బ్రేకింగ్: కూలిన బ్యాంకు పైకప్పు .. కొనసాగుతున్న రక్షణ చర్యలు
మహారాష్ట్ర షోలాపూర్‌లో బ్యాంకు పైకప్పు కూలిపోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. షోలాపూర్‌కు సమీపంలో ఉన్న కర్మాలాలో ఉన్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బిల్డింగ్ పైకప్పు బుధవారం ఉదయం ఉన్నపాటున కూలిపోయింది. ఈ శిధిలాల కింద సుమారు 25మంది వరకు చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. వీరిలో 10 మందిని రక్షించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. భవనం శిధిలాల కింద ఉన్నవారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. బ్యాంకు పైకప్పు కూలిన ఘటన వార్త దావానంలా వ్యాపించడంతో అక్కడికి పెద్దఎత్తున జనం […]
మహారాష్ట్ర షోలాపూర్‌లో బ్యాంకు పైకప్పు కూలిపోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. షోలాపూర్‌కు సమీపంలో ఉన్న కర్మాలాలో ఉన్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బిల్డింగ్ పైకప్పు బుధవారం ఉదయం ఉన్నపాటున కూలిపోయింది. ఈ శిధిలాల కింద సుమారు 25మంది వరకు చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. వీరిలో 10 మందిని రక్షించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. భవనం శిధిలాల కింద ఉన్నవారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు.
బ్యాంకు పైకప్పు కూలిన ఘటన వార్త దావానంలా వ్యాపించడంతో అక్కడికి పెద్దఎత్తున జనం గుమిగూడారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.