‘విక్రమ్ వేద’ రీమేక్‌లో అమిర్ ఖాన్!

Bollywood Superstars in Vikram Vedha remake, ‘విక్రమ్ వేద’ రీమేక్‌లో అమిర్ ఖాన్!

తమిళ స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, మాధవన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘విక్రమ్ వేద’. 2017లో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇక ఆ తర్వాత ఈ మూవీ తెలుగు, హిందీ భాషల్లో రీమేక్ అవుతుందని వార్తలు వినిపించాయి.

తెలుగు రీమేక్ గురించి అధికారిక ప్రకటన ఏది రాలేదు గానీ.. హిందీలో మాత్రం ‘విక్రమ్ వేద’ రీమేక్ త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ మూవీ కోసం నటీనటుల ఎంపిక జరుగుతోందట.

తమిళంలో విజయ్ సేతుపతి చేసిన పాత్రలో ఆమిర్ ఖాన్.. మాధవన్ చేసిన క్యారెక్టర్‌లో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ వెర్షన్‌ను నీరజ్ పాండే నిర్మిస్తుండగా.. మాతృకను డైరెక్ట్ చేసిన భార్యాభర్తల దర్శక ద్వయం పుష్కర్-గాయత్రినే హిందీ వెర్షన్‌‌ను కూడా దర్శకత్వం వహించనున్నారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *