Gangavva Akhil Bigg Boss 4: బిగ్‌బాస్ హౌజ్‌లో గంగవ్వ జోష్‌ని పెంచింది. హౌజ్‌లోకి వెళ్లేముందు గంగవ్వ టాస్క్‌లలో ఎలా పాల్గొంటుంది..? అంటూ అనుమానాలు రాగా.. ఇప్పుడు వాటిని పటాపంచలు చేస్తూ యాక్టివ్‌గా దూసుకుపోతోంది. ఇక శనివారం నాటి ఎపిసోడ్‌లో మోనాల్‌ని గంగవ్వ ఏడిపించేసింది. నీతో మాట్లాడకని అఖిల్‌కి నేనే చెప్పాను అని గంగవ్వ అనగా.. అది నిజమని నమ్మి మోనాల్ కంటతడి పెట్టుకుంది. అయితే ఊరికే అన్నానని ఆ తరువాత మోనాల్‌ని బుజ్జగించింది. కాగా అఖిల్‌ని తన దత్తపుత్రుడిగా స్వీకరిస్తానని గంగవ్వ చెప్పింది. మరి అతడికి భార్యగా ఆమె వద్దా అంటూ లాస్య, మోనాల్‌వైపు చూపించగా.. ఛీ, ఇక్కడున్న వాళ్లు ఎవరూ వద్దు అంటూ తేల్చి చెప్పింది. ఇక నాగార్జున ముందు కూడా మోనాల్‌కి గట్టి కౌంటర్లు ఇచ్చారు గంగవ్వ. ఇదంతా చూస్తుంటే అఖిల్, మోనాల్‌లు కలిసి ఉండటం గంగవ్వకు ఏ మాత్రం ఇష్టం లేనట్లు తెలుస్తోంది.
Read More:
Bigg Boss 4: గంగవ్వ ‘మహానటి’ పర్ఫామెన్స్.. సీక్రెట్ వీడియో రివీల్ చేసిన నాగార్జున