Bigg Boss 4 Akhil Sarthak: బిగ్ బాస్ రన్నరప్ అఖిల్‌కు బంపరాఫర్.. ఇంతకీ ఇందులో నిజమెంత.!

Bigg Boss 4: బిగ్ బాస్ సీజన్ 4‌లో పాల్గొన్న కంటెస్టెంట్స్‌కు వరుసపెట్టి ఆఫర్లు తలుపు తడుతున్నాయి. తాజాగా బిగ్ బాస్ 4 రన్నరప్ అఖిల్...

Bigg Boss 4 Akhil Sarthak: బిగ్ బాస్ రన్నరప్ అఖిల్‌కు బంపరాఫర్.. ఇంతకీ ఇందులో నిజమెంత.!
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 07, 2021 | 9:04 PM

Bigg Boss 4: బిగ్ బాస్ సీజన్ 4‌లో పాల్గొన్న కంటెస్టెంట్స్‌కు వరుసపెట్టి ఆఫర్లు తలుపు తడుతున్నాయి. ఇప్పటికే అభిజీత్‌, సోహైల్‌, మోనాల్‌ గజ్జర్‌, దివిలకు అవకాశాలు రాగా.. తాజాగా ఇదే కోవలోకి బిగ్ బాస్ 4 రన్నరప్ అఖిల్ సార్ధక్ కూడా చేరిపోయాడు. అఖిల్‌కు బంపరాఫర్ వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న ‘సీటీమార్’ సినిమాలో అఖిల్‌ను ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేశారని టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ వార్త నిజమో.? కాదో.? తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే. కాగా, ‘సీటీమార్’ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.