AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4: లగేజ్‌ సర్దుకో అన్న నాగ్‌.. ఏడ్చేసిన అఖిల్‌

వీకెండ్ ఎపిసోడ్‌కి తోడు దీపావళి కూడా అవ్వడంతో నాగార్జున కంటెస్టెంట్‌లందరిలో హుషారు నింపారు. ఆ తరువాత సీక్రెట్‌ రూమ్‌లో ఉన్న అఖిల్‌ దగ్గరకు వెళ్లారు

Bigg Boss 4: లగేజ్‌ సర్దుకో అన్న నాగ్‌.. ఏడ్చేసిన అఖిల్‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 15, 2020 | 7:25 AM

Share

Bigg Boss 4 Akhil: వీకెండ్ ఎపిసోడ్‌కి తోడు దీపావళి కూడా అవ్వడంతో నాగార్జున కంటెస్టెంట్‌లందరిలో హుషారు నింపారు. ఆ తరువాత సీక్రెట్‌ రూమ్‌లో ఉన్న అఖిల్‌ దగ్గరకు వెళ్లారు. ”బిగ్ ఫైటర్ అయిన నువ్వు అలా ఎలా ఇంట్లో నుంచి వెళ్లిపోయావు” అని నాగార్జున అడిగారు. దీనికి అఖిల్ సమాధానం ఇస్తూ.. ”స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ను బిగ్‌బాస్‌ అలా బయటికి పంపేయరని అనుకున్నా. అంత ఈజీగా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ను బయటికి పంపేస్తే ఇక గేమ్ ఏముంటుంది సార్. నాకు ఓ కాలిక్యులేషన్ ఉంది. బిగ్‌బాస్‌ నన్ను పంపడు అని నా మనసులో ఉంది” చెప్పుకొచ్చాడు.

ఆ వెంటనే నాగార్జున, అఖిల్‌కి షాక్ ఇచ్చాడు. నీ కాలిక్యులేషన్ రాంగ్ అంటూ అఖిల్‌కి ట్విస్ట్ ఇచ్చారు. బ్యాగ్‌ సర్దేసుకొని హౌజ్‌లోకి వెళ్లి సెల్ఫీ దిగి, స్టేజ్‌ మీదకు రావాలని సూచించారు. దీంతో ఒక్కసారిగా అఖిల్‌ ఏడ్చేశాడు. తనను ఎలిమినేట్ చేయొద్దని వేడుకున్నాడు. దీంతో నేనేం చేయలేనంటూ నాగార్జున చేతులు ఎత్తేశారు. ఆ తరవాత అఖిల్‌ హౌస్‌లోకి వెళ్లాడు. దీంతో అందరూ సంబరపడ్డారు.

అయితే అఖిల్‌ ఎలిమినేట్ అయ్యాడని నాగార్జున చెప్పడంతో అంతా షాక్‌కి గురయ్యారు. అలా జరగదు అంటూ సొహైల్ వాదించాడు. అరియానా, బిగ్‌బాస్‌ని నిందించింది. మోనాల్ అయితే అఖిల్ బదులు నేను ఎలిమినేట్ అవుతాను అంటూ చెప్పేసింది. మరి ఇదే పని ఆరోజు ఎందుకు చేయలేదు..? అని నాగార్జున ప్రశ్నించారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్లే ముందు అఖిల్‌కి ఓ టాస్క్‌ ఇచ్చారు. ఇంటి సభ్యుల్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరు? నలుగురు శత్రువులు ఎవరు? చెప్పాలని అఖిల్‌ను నాగార్జున అడిగారు. దీంతో సొహైల్‌, మోనాల్‌కి ఫ్రెండ్‌షిప్ బ్యాండ్లు కట్టాడు. అభిజీత్, హారిక, లాస్య, మెహబూబ్‌లను శత్రువులుగా చెప్పాడు. ఇలా కాసేపు చర్చ జరిగిన తరువాత చివర్లో నాగ్‌ మరో ట్విస్ట్ ఇచ్చారు. అఖిల్‌ ఎలిమినేట్ అవ్వలేదని అన్నారు.

ఈ సందర్భంగా అతడికి ఓ ఆఫర్ కూడా ఇచ్చారు. అతడి ముందు రెండు కుండలు పెట్టి.. ఒక దానిలో డైరెక్ట్ నామినేషన్‌, మరో కుండలో కెప్టెన్ కావడంతో పాటు ఇమ్యూనిటీ పెంచుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇక అఖిల్‌ కెప్టెన్‌ కుండను పెట్టుకోగా.. వచ్చే వారానికి కెప్టెన్‌గా నామినేట్‌ అయ్యాడు.

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే