బిగ్‌బాస్ 3 తెలుగు సీజన్ ఎంతో ఆసక్తిగా కొనసాగుతుంది. ఒకరోజు కోపాలు.. మరో రోజు తాపాల మధ్య షో జరుగుతుంది. బిగ్‌బాస్.. కంటెస్టెంట్‌లకు ఒక పక్క ఆఫర్లు ఇస్తూనే.. మరోపక్క శిక్షలు కూడా విధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో.. తాజాగా.. అలీ, పునర్నవిలకు బిగ్‌బాస్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడు. వారిద్దరూ కలిసి చేసిన సీక్రెట్ టాస్క్‌కి.. సంతృప్తి చెందిన బిగ్‌బాస్ వాళ్లకు.. వచ్చేవారం ఎలిమినేషన్స్ నుంచి తప్పిస్తూ.. బిగ్ గిఫ్ట్ ఇచ్చారు. దీంతో.. అలీ, పునర్నవిలు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే.. హౌస్‌లోని సభ్యులకు కూడా బిగ్‌బాస్ మరో ఆఫర్ ఇచ్చాడు. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కు చేసిన టాస్క్‌ను పూర్తి చేసినందుకు హౌస్ సభ్యులకు మరో గిఫ్ట్ ఇచ్చాడు. బిగ్‌బాస్‌లో ఉన్న కోర్టు యార్డ్‌ను వారికి బహుమతిగా ఇచ్చాడు. కాగా.. ఈ వారం ఎలిమినేషన్‌లో ఐదుగురు ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. వారు: తమన్నా, పునర్నవి, వితిక, బాబా మాస్టర్, రాహుల్. కాగా.. హౌస్‌మెంట్స్ అందరూ బిగ్‌బాస్ రూల్స్ పాటించడంలేదంటూ.. ఇంటి సభ్యులందరికీ శిక్ష విధించాడు బిగ్ బాస్. దీంతో.. అందరూ బిగ్‌బాస్‌కి సారీ చెప్పారు.