Big News Big Debate: ఓ మై జీఎస్టీ

GST పరిహారంపై కేంద్రం, రాష్ట్రాల మధ్య నలుగుతున్న వివాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు తెలంగాణ సీఎం కేసీఆర్‌.

Big News Big Debate: ఓ మై జీఎస్టీ
Follow us

| Edited By:

Updated on: Sep 01, 2020 | 9:40 PM

  • కేంద్రం, రాష్ట్రాల మధ్య చిచ్చు
  • ఆప్షన్లను అంగీకరించేది లేదన్న తెలంగాణ
  • స్వరం కలుపుతున్న బీజేపీయేతర సీఎంలు
  • కేంద్ర తలొగ్గుతుందా? రాష్ట్రాలే దారికొస్తాయా?

Big News Big Debate: GST పరిహారంపై కేంద్రం, రాష్ట్రాల మధ్య నలుగుతున్న వివాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. కౌన్సిల్‌ సమావేశంలో కేంద్రం ఇచ్చిన ఆప్షన్లు ఆందోళన కలిగిస్తున్నాయన్న సీఎం.. చట్ట ప్రకారం నష్టాన్ని కేంద్రమే భరించాలన్నారు. ఈ సంక్షోభ సమయంలో ఫెడరల్‌ స్ఫూర్తి మరింత బలోపేతమేయ్యేలా చర్యలు ఉండాలన్నారు. GST వల్ల ఎక్కువగా నష్టపోతున్నా.. జాతీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని 2017లో చట్టానికి మద్దతు ఇచ్చినట్టు లేఖలో పేర్కొన్నారు KCR. తెలంగాణ ఒక్కటే కాదు.. దేశంలోని ఎన్డీయేతర రాష్ట్రాలన్నీ కూడా GST కౌన్సిల్‌లో ఆర్ధిక మంత్రి ఇచ్చిన రెండు ఆప్షన్లుపై భగ్గమంటున్నాయి. మహారాష్ట్ర సీఎం అయితే ఏకంగా GST విధానంపైనే సమీక్ష చేయాలంటున్నారు. గత వారం GST కౌన్సిల్‌ 41వ సమావేశం నిర్వహించింది కేంద్రం. కోవిడ్‌ యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌ అని.. దీని కారణంగా పన్నుల ఆదాయం తగ్గింది కాబట్టి GST పరిహారం రాష్ట్రాలకు ఇవ్వలేమని చెప్పింది కేంద్రం. దీనిపై రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దైవాదీనం పేరుతో తమ హక్కులను కాలరాయడం ఏంటని ప్రశ్నించారు ఆర్ధిక మంత్రులు. నష్టపరిహారానికి ప్రత్యామ్నాయంగా రాష్ట్రాలు అప్పులు చేసుకోవాలంటూ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇచ్చిన 2 ఆప్షన్లపై వ్యతిరేకత వ్యక్తమైంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. కేంద్రం ఇచ్చిన ఆప్షన్లు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవన్నారు. GST చట్ట ప్రకారం పరిహారం తమ హక్కు అని గుర్తుచేశారు. GST విధానంలోకి మారడం వల్ల తీవ్రంగా నష్టపోయినా.. దీర్ఘకాలిక, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీర్మానం చేసినట్టు గుర్తు చేశారు KCR. ఈ సంక్షోభ సమయంలో ఫెడరల్‌ స్ఫూర్తి మరింత బలోపేతం అయ్యేలా కేంద్రం వ్యవహరించాలని సూచించారు. కేంద్రానికి పన్నుల ఆదాయం తగ్గినా, పన్నేతర ఆదాయ మార్గాలు అనేకం ఉన్నాయన్నారు కేసీఆర్‌. పెట్రోలియం ఉత్పత్తులపై సెస్, ప్రభుత్వరంగ సంస్థల ద్వారా ఆదాయం, డిజిన్వెస్ట్‌మెంట్‌, RBI నుంచి డివిడెండ్లు ఇలా అనేక అవకాశాలున్నా.. రాష్ట్రాలకు పరిహారం విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరు సరికాదన్నారు. కేంద్రమే అప్పులు చేసి ఇచ్చే అవకాశాన్ని తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్‌రావు సూచించారు. GST పరిహారంపై ఎన్డీయేతర రాష్ట్రాలు కేంద్రం ఇచ్చిన ఆప్షన్లను అంగీకరించడం లేదు. కౌన్సిల్‌ సమావేశంలోనే ఢిల్లీ, కేరళ, బెంగాల్‌ ఆర్ధిక మంత్రులు అభ్యంతరం తెలిపారు. చత్తీస్‌ఘడ్‌, పంజాబ్‌ కూడా అభ్యంతరం తెలిపాయి. ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దావ్‌ థాక్రే సమావేశానికి ముందే GST వల్ల సమస్యలు వస్తున్నాయని.. దీనిపై సమీక్ష చేయాల్సిన అవసరం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ GST పరిహారం విషయంలో కేంద్రం వెనక్కు తగ్గుతుందా? లేక.. రాష్ట్రాలే దిగొస్తాయా? అన్నది చూడాలి.

అసలు GST పరిహారం ఏంటి? 2017లో GST అమల్లోకి వచ్చింది ఈ విధానంతో ఆదాయం పడిపోతుందని రాష్ట్రాల అభ్యంతరం మొదటి 5ఏళ్ల నష్టం భరిస్తామని కేంద్రం హామీ పొగాకు, లగ్జరీ కార్లపై సెస్‌ ద్వారా రాష్ట్రాలకు భర్తీ ప్రతి రెండు నెలలకు చెల్లిస్తూ వచ్చింది కేంద్రం 2017 నుంచి 2019 వరకు రాష్ట్రాలకు ఇచ్చింది 2019-20లో రూ.1.65లక్షల కోట్లు చెల్లించింది 2020-21లో కొవిడ్‌ కారణంగా ఇవ్వనలేనంటోంది రెండు విడతల్లో రావాల్సిన బకాయిలు ఇవ్వలేదు GST పరిహారం ఇవ్వలేమన్న కేంద్రం సెస్‌ ద్వారా వచ్చిన ఆదాయం రూ.65వేల కోట్లు రాష్ట్రాలకు చెల్లించాల్సిన మొత్తం రూ.3లక్షల కోట్లు షార్ట్‌ పాల్‌ వచ్చేసి రూ.2.35లక్షల కోట్లు రెండు ఆప్షన్లు ఇచ్చిన నిర్మలా సీతారామన్‌

ఆప్షన్‌…1 తగ్గిన పరిహారం బదులు రాష్ట్రాలు అప్పులు తీసుకోవాలి ఇందుకు కేంద్ర ఆర్థికశాఖ సహకరిస్తుంది కోవిడ్‌తో సంబంధం లేకుండా జిఎస్టీ లోటు రూ.97వేల కోట్లు RBI ద్వారా అప్పులకు తక్కువ వడ్డీకే వచ్చేలా సాయం ఐదేళ్ల తర్వాత GST పరిహారం సెస్‌ నుంచి చెల్లింపులు జరగాలి

ఆప్షన్‌ 2 మొత్తం లోటు పరిహారం అప్పుల రూపంలో సమీకరణ రూ.2.35 లక్షల కోట్లు అప్పులు దీనికి వడ్డీ అసలు మొత్తం సెస్‌ ద్వారా వచ్చే ఆదాయంతో చెల్లించాలి ఇందులో రూ.97వేల కోట్లను రాష్ట్రాల అప్పు ఖాతాలో చూపించరు మిగిలిన రూ.1.38లక్షల కోట్లు రాష్ట్రాలు ఖాతాలో చూపిస్తారు.

వేసవిలో సాఫ్ట్ స్కిన్ కోసం గులాబీలతో రకరకాల ఫేస్‌ప్యాక్‌లు..
వేసవిలో సాఫ్ట్ స్కిన్ కోసం గులాబీలతో రకరకాల ఫేస్‌ప్యాక్‌లు..
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
తడిపొడి అందాలతో కవ్విస్తున్న కేతిక..
తడిపొడి అందాలతో కవ్విస్తున్న కేతిక..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హాలిడేస్ లిస్టు ఇదిగో.!
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హాలిడేస్ లిస్టు ఇదిగో.!
గుండెపోటు బాత్‌రూమ్‌లోనే ఎందుకు ఎక్కువగా వస్తుంది.?
గుండెపోటు బాత్‌రూమ్‌లోనే ఎందుకు ఎక్కువగా వస్తుంది.?
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
స్వగ్రామానికి మావోయిస్టు శంకర్‌రావు దంపతుల మృతదేహాలు..
స్వగ్రామానికి మావోయిస్టు శంకర్‌రావు దంపతుల మృతదేహాలు..
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు