ఆయుధ సంపత్తి సరే.. స్వీయ ఉత్పత్తి సంగతేంటి?

అత్యాధునిక రాఫెల్‌ యుద్ధ విమానాలు ఇండియాలో ల్యాండ్‌ అయ్యాయి. దేశ రక్షణ రంగ అమ్ములపొదిలో పవర్‌ ఫుల్‌ వెపన్స్‌ చేరాయి. సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో వీటి రాక ప్రపంచ వ్యాప్తంగా..

ఆయుధ సంపత్తి సరే.. స్వీయ ఉత్పత్తి సంగతేంటి?
Follow us

| Edited By:

Updated on: Aug 07, 2020 | 11:38 PM

భోఫోర్స్‌ నుంచి రాఫెల్‌ దాకా.. ఒప్పందాలు వివాదాలు సొంతంగా తయారీ సాధ్యం కాదా?

అత్యాధునిక రాఫెల్‌ యుద్ధ విమానాలు ఇండియాలో ల్యాండ్‌ అయ్యాయి. దేశ రక్షణ రంగ అమ్ములపొదిలో పవర్‌ ఫుల్‌ వెపన్స్‌ చేరాయి. సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో వీటి రాక ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదంతా ఓకే కానీ.. అసలు ఎంతకాలం ఇలా ఇతర దేశాలపై ఆధారపడాలన్న చర్చ మొదలైంది. ప్రపంచంలోనే 5వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌.. ఆయుధ సంపత్తిలో స్వయంసమృద్ధి సాధించడంలో వెనకబడింది. DRDO, HAL వంటి సంస్థలు దశాబ్ధాలుగా పరిశోధనలు చేస్తున్నా ఇంకా ప్రపంచంలో నెంబర్‌ 2 ఇంపోర్టర్‌గా ఉన్నాం. దీనిని అధిగమించడానికి దేశీయంగా ఆయుధాల ఉత్పత్తి పెంచడానికి FDIలను 74శాతానికి పెంచాలని నిర్ణయించింది కేంద్రం. అయితే దేశభద్రతను విదేశీ సంస్థల చేతిలో పెడతారా అంటూ విమర్శలు అందుకున్నాయి విపక్షాలు.

ఫ్రాన్స్‌తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా అత్యాధునిక రాఫెల్‌ యుద్ధ విమానాలను దసో కంపెనీ ఇండియాకు అప్పగించింది. తొలివిడతలో 5 విమానాలు అంబాలా ఎయిర్‌బేస్‌కు చేరుకున్నాయి. చైనాతో సరిహద్దులో ఉద్రిక్తతలున్నాయి. వాణిజ్యయుద్ధం జరుగుతోంది. ఈ సమయంలో రాఫెల్‌ రాక భారత రక్షణ రంగానికి మనోధైర్యాన్ని ఇస్తోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన యుద్ధవిమానాల్లో ఒకటైన రాఫెల్‌ మనసొంతమైంది.

దేశీయ అవసరాలకు ఆయుధాలను దిగుమతి చేసుకోవడం ఇండియాకు కొత్తకాదు.. చాలాకాలంగా రెండోస్థానంలో కొనసాగుతున్నాం. కానీ ఇలా ఎంతకాలమన్న చర్చ కూడా మొదలైంది. దేశీయంగానే ఆయుధాలను సమకూర్చుకోవాలని లక్ష్యాలు నిర్దేశించుకోవడమే కానీ.. చేరుకున్నది స్వల్పం. ఇప్పడిప్పుడే మనం ఎగుమతుల కూడా మొదలుపెట్టాం.. కానీ ఇంకా లక్ష్యాలు సుదూరంలో ఉన్నాయి. 2017-18లో 4వేల 600 కోట్లు ఎగమతులు చేశాం.. 2019లో ఇది 10వేల కోట్లుగా ఉందని రక్షణ శాఖ నివేదిక చెబుతోంది. 2024 నాటికి 35వేల కోట్ల ఎగుమతులు సాధించాలన్న లక్ష్యం పెట్టుకుంది మోదీ ప్రభుత్వం. ఇందులో భాగంగానే FDIలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రస్తుతం రక్షణ రంగంలో ఉన్న 49శాతం నుంచి 74శాతానికి FDIలు పెంచుతోంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ రానుంది. తొలుత 900 రక్షణ విడిభాగాలు, ఆ తర్వాత 5 వేల పరికరాల తయారీలో FDIలను అనుమతిస్తారు. డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్-2020 డ్రాఫ్ట్ కాపీని సిద్ధం చేసింది రక్షణశాఖ. రక్షణ పరికరాల దిగుమతుల భారం తగ్గించుకోడానికే పెట్టుబడుల శాతాన్ని పెంచుతున్నట్లు అందులో పేర్కొంది. ప్రస్తుతం రక్షణ పరికరాల తయారీలో ప్రైవేట్ రంగం ఉత్పత్తి పెరుగుతోందని, లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్, థేల్స్, డస్సా ఏవియేషన్ తదితర సంస్థలు భారత్ నుంచే పరికరాలను, విడిభాగాలను దిగుమతి చేసుకుంటున్నాయని ప్రభుత్వం చెబుతోంది. లాక్‌హీడ్ మార్టిన్‌కి చెందిన సీ-130 రవాణా విమానాల్లో హైదరాబాద్‌లోని టాటా గ్రూపు జాయింట్ వెంచర్ కంపెనీకి చెందిన పరికరాలను వినియోగిస్తున్నారు.

రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం అంటే దేశ రక్షణ రంగాన్ని ప్రమాదంలో పడేయటమేనని ఆరోపిస్తున్నాయి విపక్షాలు. లాభనష్టాలు చర్చించకుండా ఆత్మనిర్భర్‌ భారత్‌లో ప్రకటించి.. హడావిడిగా విదేశీ సంస్థలను అనుమతించడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. దేశీయంగా ఉత్పత్తి రంగంలో పెట్టబడులు వస్తాయో రావో కానీ.. రక్షణ రంగం మొత్తం వారి గుప్పిట్లోకి పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. విదేశీ సంస్థలు మన దేశాల ప్రయోజనాలకు కట్టబడి ఉంటాయని అన్న మౌలిక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుందన్నారు.

మొత్తానికి అటు రాఫెల్‌ రాక… ఇటు రక్షణ రంగంలో FDI పెంపు అంశాలు రాజకీయాంశాలుగా మారాయి. ఇప్పటికే విపక్షాలు FDIలపై ఆందోళనబాట పట్టాయి. ప్రభుత్వం మేకిన్‌ ఇండియా నినాదానికి ఊతం వస్తుందని అంటోంది. ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు.

డిఫెన్స్‌ రంగంలో FDI క్రమం 2001లో మొదటిసారిగా ప్రైవేటీకరణ 100శాతం దేశీయ కంపెనీలకు గ్రీన్‌సిగ్నల్‌ 26 శాతం విదేశీ కంపెనీలకు FDIలకు అనుమతి తర్వాత దీనిని 49 శాతానికి పెంచారు అంతకు మించి పెట్టాలంటే ప్రభుత్వ అనుమతి అవసరం కేస్‌ బై కేస్‌ వంద శాతం అనుమతి 2019 వరకు 42 విదేశీ సంస్థలకు అనుమతి 439 దేశీయ కంపెనీలకు గ్రీన్‌సిగ్నల్‌ రక్షణ రంగానికి చెందిన ఉత్పత్తులకు అనుమతి మేకిన్‌ ఇండియాలో భాగంగా విదేశీ సంస్థలకు ఆహ్వానం మెజార్టీ వాటా లేకుండా టెక్నాలజీ షేర్‌ చేయమని కండీషన్‌ దీంతో 74శాతం FDIలకు కేంద్రం ఓకే ఆత్మనిర్భర్‌ ప్యాకేజీలో భాగంగా నిర్ణయం మేకిన్‌ ఇండియాలో భాగమన్న కేంద్రం ఇక మీదట దిగుమతులు తగ్గిస్తారు ప్రతిఏటా కొన్ని ఉత్పత్తులను ప్రకటిస్తారు దేశీయంగానే ఆర్డర్స్‌ పంచడానికి ప్రత్యేకంగా నిధులు ఎగుమతుల సామర్ధ్యం పెరుగుతుంది జాయింట్‌ వెంచర్‌ ఉన్న విదేశీ సంస్థలకు ఫుల్ పవర్స్‌ మేకిన్‌ ఇండియాకు బిగ్‌ బూస్ట్‌ అంటున్న కంపెనీలు ప్రతి ఏటా లక్ష కోట్లకు పైగా ఆర్మీ ఆర్డర్స్‌

డిఫెన్స్‌లో నామమాత్రంగా పెట్టుబడులు మెజార్టీ వాటా ఉండదనిరాని కంపెనీలు 2014-15 – 56 లక్షలు 2015-16 – 71 లక్షలు 2017-18 – 7 లక్షలు 2018-19 – 15 కోట్లు

ఆర్మీపై అత్యధికంగా ఖర్చుపెట్టే 5వ దేశం అమెరికా, చైనా, రష్యా, సౌదీ తర్వాత ఇండియా ఆర్మీ బడ్జెట్‌ 2020-21 రూ. 3.37లక్షల కోట్లు పెన్షన్ల కోసం అదనంగా రూ.1.33 లక్షల కోట్లు 15 ఏళ్లలో విదేశీ ఒప్పందాలు రూ.6లక్షల కోట్లు ఆయుధాల ఇంపోర్ట్స్‌లో నెంబర్‌ 2 దేశీయ అవసరాల్లో 65 శాతం విదేశాల నుంచి దిగుమతి రష్యా, ఇజ్రాయిల్‌, ఫ్రాన్స్‌, యూఎస్‌ నుంచి దిగుమతులు మూడేళ్లలో విదేశీ సంస్థలతో 1.5లక్షల కోట్ల ఒప్పందాలు దేశంలో 5 ప్రభుత్వ రక్షణ ఉత్పత్తి సంస్థలు 4 షిప్‌యార్డులు, 41 ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలు

ఎగుమతుల్లో పెరుగుదల ఎగుమతుల జాబితాలో 23వ స్థానం శ్రీలంక, మయన్మార్‌, మారిషస్‌కు ఎగుమతులు 2015-16లో ఎగుమతులు 2వేల 60 కోట్లు 2018-19 నాటికి 10వేల 746 కోట్లు 2024 నాటికి 35వేల కోట్ల లక్ష్యం

రాఫెల్‌ హిస్టరీ… 2012లో యుద్ధ విమానాలకు బిడ్లు రూ. 54 వేల కోట్లతో 126 విమానాల కొనుగోలు బిడ్లు ఫ్రాన్స్‌ కంపెనీ డసోకు గ్రీన్‌ సిగ్నల్‌ రెడీగా ఉన్న18 విమానాలను వెంటనే కొనాలి మిగతావి బెంగళూరు HAL అసెంబుల్డ్‌ చేయాలి 108 విమానాలను ఇక్కడే ఉత్పత్తి చేయాలి రకరకాల కారణాలతో ఆలస్యం 2014 ఎన్నికల్లో మారిన ప్రభుత్వం పాత ఒప్పందం రద్దు చేసిన మోదీ ప్రభుత్వం 36 విమానాలు అందించేలా దసో సంస్థతో ఒప్పందం 2016 సెప్టెంబరులో ఫ్రాన్స్‌తో ఒప్పందం ఒక్కో విమానానికి రూ.16వందల 70 కోట్లు విమానాలతో పాటు మీటియర్ మిసైల్స్ ఒప్పందం విలువ రూ. 58 వేల కోట్లు టెక్నాలజీని DRDO, HALతో పంచుకోవాలి ఇండియా ఎయిర్‌ఫోర్స్‌ రీసెర్చ్‌లో 30 శాతం పెట్టుబడులు 2015లో మోదీ ఫ్రాన్స్‌ పర్యటనలో సంతకాలు 2019 సెప్టెంబర్‌లో విమానాలు అందాలి కానీ ఆలస్యంగా ఇవాళ 5 విమానాలు ల్యాండ్‌ HAL కాకుండా రిలయన్స్‌ తెరమీదకొచ్చింది అనుభవం లేని కంపెనీకి ఎలా ఇచ్చారని విమర్శలు దసోకు రిలయన్స్‌ మధ్య ఒప్పందమన్న ప్రభుత్వం రఫేల్ నుంచి ఈజిప్టు, ఖతర్ దేశాలు రూ.13వందల 20 కోట్లకే కొన్నాయా? రిలయన్స్ రాకతో ధర పెరిగిందన్న విమర్శలు

దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..