Big News Big Debate: తెలంగాణ గల్లీలో ‘ఢిల్లీ లిక్కర్’ ప్రకంపనలు.. పేలుతున్న మాటల తూటాలు.. ఇంకెన్ని ట్విస్టులో..

|

Dec 01, 2022 | 7:08 PM

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ ప్రకంపనలు తెలంగాణ గల్లీల్లో మొదలయ్యాయి. రిమాండులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు ఉండటంతో రాజకీయ పార్టీల్లో హాట్‌ టాపిక్‌గా..

Big News Big Debate: తెలంగాణ గల్లీలో ‘ఢిల్లీ లిక్కర్’ ప్రకంపనలు.. పేలుతున్న మాటల తూటాలు.. ఇంకెన్ని ట్విస్టులో..
Big News Big Debate
Follow us on

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ ప్రకంపనలు తెలంగాణ గల్లీల్లో మొదలయ్యాయి. రిమాండులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు ఉండటంతో రాజకీయ పార్టీల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. బ్లాక్‌మెయిల్‌ రాజకీయాల్లో భాగంగానే అక్రమ కేసులు పెడుతున్నారని టీఆర్ఎస్‌ అంటే.. బ్లాక్‌ దందాల్లో ఉండే కేసీఆర్‌ కుటుంబాన్ని వదిలే ప్రసక్తే లేదంటున్నారు బీజేపీ నాయకులు. అటు మంత్రులు, ఎంపీలకు ఈడీ, సీబీఐ, ఐటీ భయాలు వెంటాడుతున్నాయి. వరుస నోటీసులతో టీఆర్ఎస్‌ నేతలు అయితే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

లిక్కర్‌ స్కామ్‌ వ్యవహారం టీఆర్ఎస్‌ నేతలకు వెంటాడుతోంది. అటు రిమాండు రిపోర్టులో కవిత పేరు రావడంతో విపక్షాలకు అస్త్రంగా మారింది. అయితే ఎలాంటి విచారణకైనా సిద్ధమంటున్న కవిత మోదీని టార్గెట్‌ చేశారు. ఎన్నికలకు ఏడాది సమయం ఉండగానే మోదీ కంటే ముందు ఈడీ వచ్చిందన్నారు.

తెలంగాణలో దోచుకున్నది సరిపోక.. ఢిల్లీకి వెళ్లి మరీ లిక్కర్ వ్యాపారం చేయాల్సిన అవసరం ఏ ముందని ప్రశ్నిస్తోంది బీజేపీ. 8 ఏళ్లలోనే వేల కోట్లు ఎలా వచ్చాయో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు ఈటల. బీజేపీ బ్లాక్‌ మెయిల్‌ చేయడం లేదని.. బ్లాక్‌ దందాల భాగోతం బయటకు వస్తాయని.. పాత కేసుల గురించి ప్రస్తావించారు బండి సంజయ్‌. లిక్కర్‌ స్కామ్‌లో నిజానిజాలు బయటకు రావాలంటోంది కాంగ్రెస్‌. సీపీఐ నారయణ కూడా ఈ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి

లిక్కర్‌ స్కామ్‌లో పొలిటికల్‌ కిక్‌ అలా ఉంటే.. మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ దాడుల్లో ఈడీ రేపో మాపో రంగంలో దిగే అవకాశం ఉంది. ఇక మంత్రి గంగుల, ఎంపీ రవిచంద్ర కేసుల్లో సంచలన విషయాలు కూడా వెలుగుచూస్తున్నాయి. దీంతో తెలంగాణలో ఇప్పుడు మొత్తం దర్యాప్తు సంస్ధల చుట్టూనే తిరుగుతున్నాయి. ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

ఈ అంశాలన్నింటిపైనా టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ బిగ్ న్యూస్ బిడ్ డిబేట్ కింది వీడియోలో చూడండి..