గురువారమే మీడియాతో ముచ్చటించిన పవన్ తప్పనిసరిగా పొత్తులు ఉంటాయన్నారు. ఇక శుక్రవారం నాడు జరిగిన పార్టీ కీలక సమావేశంలో ఎవరితో ఉంటాయన్నది కూడా వెరీ మచ్ క్లియర్‌గా చెప్పేశారు. అన్ని అనుకూలంగా ఉంటే టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీతో కలిసివెళతామన్నారు. వైసీపీని ప్రత్యర్ధిగా ప్రకటించిన పవన్.. త్రిముఖ పోటీలో మళ్లీ బలి కాదలుచుకోలేదన్నారు. బలాబలాల ఆధారంగా ఎన్నికల తర్వాతే సీఎం ఎవరన్నది చూస్తామన్నారు. అదే సమయంలో చంద్రబాబు చేతిలో మోసపోవడానికి చిన్నపిల్లలం కాదని, పొత్తుల వల్ల పార్టీ బలపడుతుందని బలంగా నమ్ముతున్నట్టు ప్రకటించారు.
ఏపీ రాజకీయాల్లో 2014 నాటి పొత్తుల కోసం పవన్ విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన చేతలు, మాటలు ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. మరి బీజేపీ ఆయనతో కలిసిరావడానికి సిద్ధంగా ఉందా? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. చాలాకాలంగా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అంటున్న బీజేపీ.. టీడీపీతో కలిసేది లేదని చెబతూ వచ్చింది. ఇప్పుడు పవన్ చెప్పగానే సొంతంగా బలపడాలనుకుంటున్న కమలనాథులు కలిసివస్తారా? ఇదే అంశంపై టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్ బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ నిర్వహించారు. వీడియోను కింద చూడొచ్చు..
మరిన్ని బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..