Big News Big Debate: ప్రకాష్‌ రాజ్ vs మంచు విష్ణు.. ‘మా’ గొడవలతో టాలీవుడ్‌ రోడ్డున పడిందా..?

|

Oct 04, 2021 | 9:02 PM

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో తిప్పి కొడితే ఉన్నది 951 ఓట్లు. బ్యాలెట్‌ పాత లెక్కలు తీసినా పోలైన శాతం సగం ఎప్పుడూ దాటలేదు. ఎప్పుడు ఏకగ్రీవాలే ఎక్కువగా ఉండేవి. ఈసారి మాత్రం పోరు రచ్చరచ్చగా మారింది.

Big News Big Debate: ప్రకాష్‌ రాజ్ vs మంచు విష్ణు.. ‘మా’ గొడవలతో టాలీవుడ్‌ రోడ్డున పడిందా..?
Maa Elections Big News Big Debate
Follow us on

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో తిప్పి కొడితే ఉన్నది 951 ఓట్లు. బ్యాలెట్‌ పాత లెక్కలు తీసినా పోలైన శాతం సగం ఎప్పుడూ దాటలేదు. సరిగ్గా చెప్పాలంటే 5వందలకు మించి పోలైన సందర్భాలు అరుదు. అసలు ఆ మాటకొస్తే ఏకగ్రీవాలే ఎక్కువగా ఉండేవి. ఈసారి మాత్రం పోరు రచ్చరచ్చగా మారింది. రెండు కుటుంబాల మధ్య ఫైటింగ్‌ అంటున్నారు. అంతేకాదు వర్గపోరుగా మలిచారు. చివరకు ప్రాంతాలు, భాషను కూడా తెరపైకి‌ తీసుకొచ్చారు. మొత్తానికి మా ఫైటింగ్‌ గతంలో ఎన్నడూ చూడని.. ఎప్పడూ వినని రీతిలో సరికొత్త ట్రెండ్‌ సెట్టర్స్‌ అవుతున్నారు..

డైలాగులు పేలుతున్నాయి..
పెద్దలను కలుస్తున్న విష్ణు..
పెద్దలను ప్రశ్నించే ప్యానల్ నాదంటున్న ప్రకాష్‌రాజ్
నటన మా నరనరాల్లో ఉందంటున్నది ఒకరు
నటన ముఖంలో కనిపించాలంటున్నది మరొకరు..
హామీల వర్షం కురుస్తోంది. వరాల జల్లులు మొదలయ్యాయి.
మా ఎన్నికల్లో తలపడుతున్న మంచు విష్ణు, ప్రకాష్‌ రాజ్‌ ప్యానళ్ల మధ్య పోటీ రసవత్తరం..
వివాదాలు వద్దంటూనే.. విమర్శలతో రోడ్డెక్కారు..

జరుగుతున్నది సినీ..మా ఎన్నికల్లా లేవు. రాజకీయ పార్టీల మధ్య హోరాహోరిగా సాగుతున్న ఫైటింగ్‌లా మారింది. ఎన్నికల కోసమే పోటీ పడుతున్నాం. కానీ మేమంతా ఒక్కటే అన్న మాటలు పటాపంచలాయ్యాయి. మాటలు హద్దులు మీరుతున్నాయి. విమర్శలు శృతిమించుతున్నాయి. వ్యక్తిగత దూషణలు, ఇండస్ట్రీలోని కుటుంబాల చుట్టూ రాజకీయం రచ్చ రాజేస్తోంది. ఇది 2 కుటుంబాల మధ్య ఫైట్‌గా మారిందన్న చర్చా ఇండస్ట్రీలో ప్రతిధ్వనిస్తోంది. ముందు నుంచి కూడా నాగబాబు ప్రకాష్‌ రాజ్‌కు మద్దతు ప్రకటించారు. ప్యానల్‌ ప్రకటించే సమయానికి నాగబాబు తమ కుటుంబం మద్దతు కూడా ఉంటుందని బహిరంగంగా చెప్పేశారు.

తాజాగా పవన్‌ కల్యాణ్‌ వ్యవహారంలో మంచు వర్సెస్‌ మెగా మధ్య వార్‌ డిక్లేర్‌ చేసినట్టు అయింది. ఇండస్ట్రీ వైపు ఉంటారా. లేక పవన్‌ కళ్యాణ్‌‌ వైపా అంటూ మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపాయి. దీనికి మంచు ఫ్యామిలీనా? మంచి ప్యానలా అంటూ ప్రకాష్‌ రాజ్‌ కామెంట్స్‌ మరింత ఆజ్యం పోశాయి. సీనియర్ నటులు కృష్ణ, కృష్ణంరాజు, బాలయ్య వంటి పెద్దల మద్దతు తనకే ఉందని మంచు చెబుతుంటే.. పెద్దల అవసరం తనకు లేదని వారిని ప్రశ్నించే ప్యానల్‌ తనదంటున్నారు ప్రకాష్‌ రాజ్‌.

మా ఎన్నికల ప్రస్తావన వచ్చిన దగ్గర నుంచి ఎన్నో మలుపులు తిరిగింది. ముందే అధ్యక్ష బరిలో 5గురు వచ్చారు. తర్వాత హేమ, జీవిత, CVL తప్పుకున్నారు. తర్వాత ప్రధాన కార్యదర్శి రేసులోకి వచ్చిన బండ్ల గణేష్‌ కూడా నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది.

(బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్)

ఇదే అంశంపై టీవీ9 స్టూడియోలో బిగ్‌ డిబేట్‌ జరిగింది.. పూర్తి సమాచారం కోసం కింద వీడియో చూడండి.. 

Read Also… Viral Video: దొంగకు ఊహించని షాకిచ్చిన మహిళ.. టెక్నాలజీతో దొంగకు ఎలా చెక్ పెట్టిందో చూడండి… 

Hypersonic Missile: రష్యా అమ్ములపొదిలో మరో అద్భుత అస్త్రం.. సబ్‌మెరైన్‌ నుంచి హైపర్‌సోనిక్ క్షిపణి విజయవంతం