Big News Big Debate: ఇంట్లో ఆడవాళ్లను కూడా టార్గెట్ చేశారంటూ కన్నీటి పర్యంతమయ్యారు విపక్షనేత చంద్రబాబు. కుటుంబాలను వాడుకుని రాజకీయాలు చేసేది బాబే అంటూ ఎదురుదాడి చేసింది YCP. చెల్లీ, అమ్మా, చిన్నానలను వదలకుండా రాజకీయం చేస్తోంది ఎవరని ప్రశ్నించారు CM జగన్. అసెంబ్లీలో మొదలైన ఫ్యామిలీ పొలిటికల్ హైడ్రామా ఏపీ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అసెంబ్లీ వేదికగా శపథం చేసిన చంద్రబాబు మళ్లీ గెలిచి CMగానే ఇక్కడ చట్టసభలో అడుగుపెడతానంటున్నారు. అసలు గెలిచేది లేదు.. మళ్లీ వచ్చేది లేదంటోంది అధికార YCP.
సినిమాల్లో యాక్షన్, ఫ్యామిలీ డ్రామా ఉంటేనే సక్సెస్ ఫార్ములా. సేమ్ టు సేమ్ ఫార్ములా. ఏపీ రాజకీయాల్లోనూ యాక్షన్, ఫ్యామిలీ సీన్స్ తెరమీదకు వస్తున్నాయి. నిన్నమొన్నటిదాకా తిట్ల దండకాలతో విరుచుకుపడ్డ నేతలు ఇప్పుడు డోసు పెంచి కుటుంబసభ్యులనే టార్గెట్ చేసి మరీ రాజకీయం చేస్తున్నారు. రెండు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. రెండేళ్లుగా తనను బండబూతులు తిట్టిన YCP MLAలు ఇప్పుడు నేరుగా తన భార్యనే టార్గెట్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. రాజకీయాలకు దూరంగా ఉండి.. తనను వెన్నుతట్టి ప్రోత్సహించిన తన భార్య భువనేశ్వరిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి సభలో ఉండలేనంటూ శపథం చేశారు టీడీపీ బాస్. ఇది కౌరవసభ అని.. గౌరవం లేని చోట ఉండటం దండగన్నారు. మళ్లీ సీఎంగానే చట్టసభలో అడుగుపెడతానంటూ ప్రతినబూనారు.
చంద్రబాబు శపథం చేసి పోవాల్సినంత అవమానం జరగలేదంటోంది వైసీపీ. ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరీని ఎవరూ ఏమీ అనలేదన్నారు. గతంలో కుటుంబస భ్యులను వాడుకుని రాజకీయం చేసిన చంద్రబాబే ఇప్పుడు సొంత భార్యను వివాదంలోకి లాగుతున్నారని ఆరోపించారు. కుటుంబాలను ఏడిపించడం తప్ప.. ఏడవడం తెలియని చంద్రబాబుది కొత్త డ్రామా అంటున్నారు MLA అంబటి. సభను బహిష్కరించడానికి పక్కా ప్లాన్‌తో వచ్చారని ముందే ఊహించామన్నారు మంత్రి కొడాలి నాని.
అసెంబ్లీలో పరిణామాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు CM జగన్. టీడీపీయే తన కుటుంబాన్ని టార్గెట్ చేసిందన్నారు చెల్లి, అమ్మ, చిన్నానలపై లేని పోని అబాండాలు వేసి గోబెల్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు ముఖ్యమంత్రి. తమ కన్నును తామే పొడుచుకుంటామా.. అంటూ వివేకానంద హత్య ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నాడు అధికారంలో ఉన్నవాళ్లే ఏదైనా చేసి ఉంటారన్న అనుమానం వ్యక్తం చేశారు.
శాసనాలు చేయాల్సిన సభలో మొత్తానికి ఫ్యామిలీ మేటర్ హైలెట్ అయింది. ఇంతకీ అసెంబ్లీలో ఏం జరిగింది. చంద్రబాబు అంతగా ఎమోషన్ కావడానికి YCP MLAలు అన్నమాటలేంటి? నిజంగానే శాసనసభ్యులు అనుచిత వ్యాఖ్యలు చేశారా? లేక ఎవరికి వారు పొలిటికల్ గేంం ఆడుతున్నారా.?
(బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్)
ఇదే అంశంపై టీవీ9 స్టూడియోలో బిగ్ డిబేట్ జరిగింది… పూర్తి సమాచారం కోసం కింద వీడియో చూడండి.
Also read:
Shalu Chourasiya: కీలక మలుపులు తిరిగిన హీరోయిన్ శాలు చౌరాసియా కేసు.. నిందితుడిన పట్టుకున్న పోలీసులు
Suriya: ఆచార్యకు పోటీగా సూర్య సినిమా… థియేటర్లలో ఒకేరోజు సందడి చేయనున్న స్టార్ హీరోస్…