Weekly Horoscope (02-08 July): 12 రాశుల వారికి వారఫలాలు.. వారికి ఆదాయం అనూహ్యంగా పెరుగుతుంది.. !
భవిష్యత్తులో ఏం జరుగుతుందో జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా ముందే లెక్కిస్తారు. గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య పండితులు ఆయా రాశుల వారికి ఎలా ఉంటుందన్న విషయాన్ని ముందుగానే అంచనావేస్తారు. వాటికి పరిహార మార్గాలను కూడా సూచిస్తారు. మరి 12 రాశుల వారికి ఆదివారం (జులై 2) నుంచి శనివారం (జులై 8) వరకు వారఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
Weekly Horoscope(02-08 July): భవిష్యత్తులో ఏం జరుగుతుందో జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా ముందే లెక్కిస్తారు. గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య పండితులు ఆయా రాశుల వారికి ఎలా ఉంటుందన్న విషయాన్ని ముందుగానే అంచనావేస్తారు. వాటికి పరిహార మార్గాలను కూడా సూచిస్తారు. మరి 12 రాశుల వారికి ఆదివారం (జులై 2) నుంచి శనివారం (జులై 8) వరకు వారఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ముఖ్యమైన వ్యక్తిగత పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి శుభవార్త వింటారు. నిరుద్యోగులకు ఆఫర్ అందే అవకాశం ఉంది. తెలిసిన వారితో పెళ్లి సంబంధం కుదిరే సూచనలు ఉన్నాయి. పిల్లలు ప్రయోజ కులుగా మారే అవకాశం ఉంది. బంధువుల నుంచి మంచి శుభవార్త వింటారు. మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ చాలావరకు నెరవేరే అవకాశం ఉంది. తల్లిదండ్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలసి వచ్చే అవకాశం ఉంది. ఇది చాలా వరకు అనుకూల సమయం.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఆస్తి, ఆదాయానికి సంబంధించిన విషయాలు ప్రాధాన్యం సంతరించుకుంటాయి. ఆస్తి విలువ పెరిగే సూచనలు ఉన్నాయి. ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. ఉద్యోగ పరంగా, అదనపు ఆదాయ ప్రయత్నాల పరంగా ఆదాయం పెరగడం జరుగుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోవడమే కాకుండా పెట్టుబడులు పెట్టడం, ఇతరత్రా మదుపు చేయడం వంటివి కూడా జరుగుతాయి. ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. కుటుంబ పరిస్థితి ప్రశాంతంగా కొనసాగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): కొత్త ప్రయత్నాలు, కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణ యాలు బాగా కలిసి వస్తాయి. వీటిని ఆచరణలో పెట్టడానికి ఇది చాలా మంచి సమయం. ఉద్యోగ ప్రయత్నాలు, ఆర్థిక ప్రయత్నాలు, పెళ్లి ప్రయ త్నాలు తప్పకుండా విజయం సాధిస్తాయి. ప్రేమ వ్యవహారాలు కూడా ఆశించిన స్థాయిలో అనుకూలంగా ఉంటాయి. దీర్ఘ కాలిక అనారోగ్యం నుంచి ఊరట లభిస్తుంది. ఉద్యోగంలో పని భారం పెరిగినప్పటికీ ప్రతిఫలం ఉంటుంది. కార్యసిద్ధి, వ్యవహార విజయం వంటివి అనుభవానికి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ముందుకు సాగుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఆర్థిక స్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడటం జరుగుతుంది. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగంలో కొద్దిగా కష్టనష్టాలు ఎదురైనప్పటికీ మొత్తం మీద ప్రోత్సాహకారంగా సాగిపోతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. సంతానం లేని వారికి సంతాన యోగానికి అవకాశం ఉంది. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. రోడ్డు ప్రమాదాలతో అప్రమత్తంగా ఉండటం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఈ రాశి వారు పట్టుదలగా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్య లకు పరిష్కారం లభిస్తుంది. ఆస్తి వివాదం ఒకటి సానుకూలపడుతుంది. ఉద్యోగ జీవితంలో టెన్షన్లు, ఒత్తిడి తప్పకపోవచ్చు. డాక్టర్లు, ఇంజ నీర్లు వంటి వృత్తి నిపుణులు దూసుకుపోయే అవకాశం ఉంది. కుటుంబంలో చిన్న చిన్న చికా కులు తలెత్తే అవకాశం ఉంది. జీవిత భాగ స్వామితో సామరస్యంతో వ్యవహరించడానికి ప్రయత్నం చేయడం మంచిది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆదాయం పరిస్థితి చాలా వరకు నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులు అదుపు తప్పే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కొద్దిగా ఆలస్యంగానే అయినప్పటికీ తప్పకుండా సఫలం అవుతాయి. వృత్తి జీవితం ఆశించిన దాని కంటే ఎక్కువగా సంతృప్తికరంగా సాగి పోతుంది. కొత్త ప్రయత్నాలకు, కొత్త నిర్ణయాలకు సమయం అనుకూలంగా ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పెళ్లి ప్రయత్నాలను ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది. ప్రేమ వ్యవహారాలు సాధారణంగా సాగిపోతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): అన్ని విషయాలలోనూ అభివృద్ధి కనిపిస్తోంది. అనుకున్న పనులు అవుతాయి. గతంలో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కొత్త ప్రయత్నాలు ప్రారంభించడానికి, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఇది చాలా వరకు అనుకూలమైన సమయం. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా తప్పకుండా సఫలం అవుతాయి. వృత్తి వ్యాపారాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. కుటుంబ జీవితం సుఖసంతోషాలతో సాగిపోతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడే అవకాశం ఉంది. ఉద్యోగం మారటానికి ఇప్పట్లో అవకాశం లేదు. దూర ప్రాంతం నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితంలో చిన్న చిన్న చికాకులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో కొద్దిపాటి పురోగతికి అవకాశం ఉంది. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్య సమస్యలేవీ ఉండకపోవచ్చు. ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడేందుకు ప్రయత్నాలు సాగిస్తారు. వృత్తి జీవితం నిలకడగా సాగిపోతుంది. వ్యాపారాలు పరవాలేదు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఏ ప్రయత్నం తలపెట్టినప్పటికీ అది సంతృప్తి కరంగా సఫలం అయ్యే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఉద్యోగంలో ఎదుగుదలకు అవకాశం ఉంది. వృత్తి జీవితంలో బాగా డిమాండ్ పెరుగుతుంది. కుటుంబంతో కలిసి విహారయాత్ర చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): వృత్తి, ఉద్యోగాలలో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. అధికారుల నుంచి ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం ఉంటుంది. ప్రమోషన్ కు అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఎక్కువగా ప్రయాణాలు చేయడం జరుగుతుంది. తోబుట్టువుల నుంచి ఒక శుభవార్త వింటారు. ఆస్తి వివాదం చాలావరకు సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా బాగా తగ్గటం జరుగుతుంది. పట్టుదలగా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆదాయ సమస్యలు ఉన్నప్పటికీ ఇతరులకు ఎంతో ఔదార్యంతో సహాయం చేస్తారు. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ పెద్దల నుంచి ఆర్థిక లాభం ఉంటుంది. ఉద్యోగం ప్రశాంతంగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాలు కూడా లాభాల విషయంలో సంతృప్తికరంగా ముందుకు వెళతాయి. కుటుంబ జీవితం లో సామరస్యం, అన్యోన్యత పెరుగుతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): సమస్యలు ఇబ్బందులు ఉన్నప్పటికీ వృత్తి ఉద్యోగాలలో లక్ష్యాలను పూర్తి చేస్తారు. మానసిక ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. బాధ్యతలు పెరగటం వల్ల ఇబ్బంది పడతారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. ఖర్చులు బాగా అదుపులో ఉంటాయి. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవటం చాలా మంచిది. కుటుంబ సభ్యుల మధ్య అపార్ధాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంతో కలిసి విహారయాత్ర చేసే అవకాశం ఉంది.
Note: ఇక్కడ ఇచ్చిన సమాచారం వ్యక్తుల నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని ఇక్కడ అందించాం..
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..