Love Astrology: శుక్ర, చంద్రుల యుతి.. ప్రేమ, పెళ్లి ప్రయత్నాల్లో ఆ రాశుల వారికి విజయం..!

అక్టోబర్ 19 తేదీ నుంచి 21 వరకు కన్య రాశిలో శుక్ర చంద్రుల యుతి కారణంగా ప్రేమ, వివాహ ప్రయత్నాలకు శుభప్రదం. ఈ యుతితో మనసులోని కోరికలు నెరవేరి, సుఖ సంతోషాలు పెరుగుతాయి. వృషభం, సింహం, కన్య, వృశ్చికం, మకర రాశులకు విలాసవంతమైన జీవితం, ధన వృద్ధి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, గృహ/వాహన ప్రాప్తి కలుగుతాయి. అనేక శుభకార్యాలకు మార్గం సుగమం అవుతుంది.

Love Astrology: శుక్ర, చంద్రుల యుతి.. ప్రేమ, పెళ్లి ప్రయత్నాల్లో ఆ రాశుల వారికి విజయం..!
Love And Marriage Astrology

Edited By: Janardhan Veluru

Updated on: Oct 18, 2025 | 4:08 PM

ఈ నెల (అక్టోబర్) 19, 20, 21 తేదీల్లో కన్యా రాశిలో శుక్ర, చంద్రుల యుతి జరుగుతోంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్ర, చంద్రుల కలయిక వల్ల ప్రేమ, పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. మనసులోని కోరికలు, ఆశలు నెరవేరుతాయి. ఆ మూడు రోజుల్లో మనసులో ఎటువంటి కోరిక కలిగినా కొద్ది ప్రయత్నంతో తప్పకుండా నెరవేరుతుంది. కొన్ని రాశుల వారికి ఆ మూడు రోజులు సుఖ సంతోషాలతో గడిచిపోతాయి. విలాస జీవితం, ఆధునిక జీవనశైలి అలవడుతుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. వృషభం, సింహం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి ఈ అదృష్టాలన్నీ కలుగుతాయి.

  1. వృషభం: రాశ్యధిపతి శుక్రుడు పంచమ స్థానంలో చంద్రుడితో కలవడం వల్ల బంధువర్గంలో మంచి కుటుంబంలో అనుకోకుండా పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. అనేక విధాలుగా సంపద వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. సంతాన యోగం కలుగుతుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి.
  2. సింహం: ఈ రాశికి ధన స్థానంలో శుక్ర, చంద్రుల కలయిక వల్ల ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కుదరడం జరుగుతుంది. విహార యాత్రలు ఎక్కువగా చేస్తారు. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక విధాలుగా అదనపు ఆదాయం వృద్ధి చెందుతుంది. విదేశీ యానానికి ఆటంకాలు తొలగిపోతాయి. విదేశీ అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరగడానికి మార్గం సుగమం అవుతుంది. సంతాన యోగానికి బాగా అవకాశం ఉంది.
  3. కన్య: ఈ రాశిలో శుక్ర, చంద్రుల యుతి జరుగుతున్నందువల్ల మనసులోని కోరికలు, ఆశల్లో చాలా భాగం నెరవేరే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధి విషయంలోనే కాక, ఉద్యోగ, పెళ్లి విషయాల్లో కూడా ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. దాంపత్య జీవితం కొత్తపుంతలు తొక్కుతుంది. ఆర్థిక, వ్యక్తిగత, కుటుంబ సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు. విదేశీ అవకాశాలు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది.
  4. వృశ్చికం: ఈ రాశికి లాభ స్థానంలో శుక్ర, చంద్రులు కలవడం వల్ల ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం తప్పకుండా జరుగుతుంది. అనేక విధాలుగా ఆదా యం వృద్ధి చెందే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలున్నా పరిష్కారమై, అన్యోన్యతలు, అనుకూలతలు పెరుగుతాయి. సంతానం కలగడానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది.
  5. మకరం: ఈ రాశికి భాగ్య స్థానంలో చంద్ర, శుక్రులు కలవడం వల్ల కలలో కూడా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పెళ్లి ప్రయత్నాలకు ఈ మూడు రోజుల సమయం బాగా అనుకూ లంగా ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి జీవిత భాగస్వామిగా లభిస్తారు. అనేక విధా లుగా ఆదాయం పెరుగుతుంది. వ్యక్తిగత, ఆర్థిక, కుటుంబ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి.