Vasant Panchami 2025: శుభ గ్రహాల అనుకూలత.. వసంత పంచమి నుంచి వారికి శుభాలు..!

Vasant Panchami Astrology: ఫిబ్రవరి 2న వసంత పంచమి నుంచి కొన్ని రాశుల వారికి అనుకూలతలు బాగా పెరిగే అవకాశం ఉంది. శుభగ్రహాలైన బుధ, గురు, శుక్ర గ్రహాల బలం ఆ రోజు నుంచి బాగా పెరుగుతున్నందువల్ల ఒక నెల రోజుల పాటు, అంటే మార్చి ఒకటవ తేదీ వరకు అనేక శుభ ఫలితాలు అనుభవానికి రావడం జరుగుతుంది.

Vasant Panchami 2025: శుభ గ్రహాల అనుకూలత.. వసంత పంచమి నుంచి వారికి శుభాలు..!
Vasant Panchami 2025

Edited By: Janardhan Veluru

Updated on: Jan 30, 2025 | 11:32 AM

Vasant Panchami 2025: ఫిబ్రవరి 2న వస్తున్న వసంత పంచమి నుంచి కొన్ని రాశుల వారికి అనుకూలతలు బాగా పెరిగే అవకాశం ఉంది. శుభగ్రహాలైన బుధ, గురు, శుక్ర గ్రహాల బలం ఆ రోజు నుంచి బాగా పెరుగుతు న్నందువల్ల ఒక నెల రోజుల పాటు, అంటే మార్చి ఒకటవ తేదీ వరకు అనేక శుభ ఫలితాలు అనుభవానికి రావడం జరుగుతుంది. శుక్రుడు ఉచ్ఛ స్థితికి రావడం, శుక్ర, గురు గ్రహాల మధ్య రాశి పరివర్తన జరగడం, శని, బుధ గ్రహాలు కుంభ రాశిలో యుతి చెందడం వంటి కారణాల వల్ల మేషం, వృషభం, మిథునం, తుల, మకరం, కుంభ రాశి వారి జీవితాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఆదాయం వృద్ధి చెందడం, అధికార లాభం కలగడం, శుభకార్యాలు జరగడం వంటివి చోటు చేసుకుంటాయి.

  1. మేషం: ఈ రాశివారికి ఫిబ్రవరిలో తప్పకుండా ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. షేర్లు, ఇతర మదు పులు, పెట్టుబడులు అపార ధన లాభాన్ని కలిగిస్తాయి. పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు జరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ప్రేమలో పడడం గానీ, ప్రేమ వ్యవహారాలు విజయవంతం కావడం గానీ జరుగుతుంది. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని ఆఫర్లు అందుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్య లాభం కలుగుతుంది.
  2. వృషభం: ఈ రాశివారికి ఫిబ్రవరిలో అనేక విధాలుగా అదృష్టం తలుపు తడుతుంది. ఉద్యోగావకాశాలు, ఆదాయ వృద్ధి అవకాశాలు పెరుగుతాయి. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందీ ఉండకుండా నెలంతా జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. నిరుద్యోగులు తప్పకుండా మంచి ఉద్యోగంలో స్థిరపడ తారు. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి ఖాయమవుతుంది. విదేశీయానానికి ఆటం కాలు తొలగిపోతాయి. ఉద్యోగులకు ఉన్నత పదవులు లభిస్తాయి. పిల్లలు బాగా వృద్ధిలోకివస్తారు.
  3. మిథునం: ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవు తుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. నెల రోజుల పాటు డబ్బుకు లోటు లేకుండా జీవితం సాగిపోతుంది. మనసులోని కొన్నికోరికలు, ఆశలు నెరవేరుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. మంచి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఆశించిన గుర్తింపు లభిస్తుంది.
  4. తుల: ఈ రాశివారికి గురు, శుక్రుల పరివర్తన విపరీత రాజయోగాన్నిస్తుంది. రాశ్యధిపతి శుక్రుడు ఉచ్ఛ పట్టడం వల్ల వీరికి అనేక అదృష్టాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. ఈ రాశి వారింట లక్ష్మీదేవి తాండవిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత పదవులు కలుగుతాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
  5. మకరం: ఈ రాశివారికి ఇది అదృష్ట సమయం. అనేక శుభ ఫలితాలు కలిగే సూచనలున్నాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక విధాలుగా ఆర్థిక లాభాలను పొందుతారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఇబ్బడిముబ్బడిగా లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది. అనేక శుభవార్తలు వింటారు.
  6. కుంభం: ఫిబ్రవరి నెలలో ఈ రాశివారి జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఊహించని విధంగా ధన లాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అపార ధన లాభం కలుగుతుంది. ఆస్తి లాభం కలుగుతుంది. ఆస్తి వివాదాలు, సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఇష్టమైన వ్యక్తితో పెళ్లి నిశ్చయమయ్యే అవకాశం ఉంది.