Telugu News Astrology Valentine week: love horosocpe 7 february 2023 rose day is going to lucky for 12 zodiacs
Valentine Week: నేడు రోజ్ డే.. ఈ రాశుల వారికి ప్రేమ జీవితం అద్భుతం.. ఆ క్రేజీ లవర్స్ ఎవరంటే..
కొన్ని రాశుల వారు తమ భాగస్వామిని తల్లిదండ్రులకు పరిచయం చేయాలని ఆలోచించ వచ్చు. ప్రేమని పెళ్లి వరకూ తీసుకుని వెళ్లాలని భావించవచ్చు. ఈ నేపథ్యంలో మేషం నుండి మీనం వరకు మొత్తం 12 రాశుల వారికీ చెందిన ప్రేమ జీవితం గురించి తెలుసుకోండి.
వాలెంటైన్ వీక్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు ప్రతి రోజూను సెలబ్రేట్ చేసుకుంటారు. దీన్నే వాలెంటైన్ వీక్ అంటారు.ఈ వారం ప్రతి ఒక్కరూ తమ ప్రేమ జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మేషం, కుంభం, మీనం వంటి అన్ని రాశుల వారికీ ఈ వారం చాలా ప్రత్యేకమైంది. కొన్ని రాశుల వారు తమ భాగస్వామిని తల్లిదండ్రులకు పరిచయం చేయాలని ఆలోచించ వచ్చు. ప్రేమని పెళ్లి వరకూ తీసుకుని వెళ్లాలని భావించవచ్చు. ఈ నేపథ్యంలో మేషం నుండి మీనం వరకు మొత్తం 12 రాశుల వారికీ చెందిన ప్రేమ జీవితం గురించి తెలుసుకోండి.
మేష రాశి: ప్రేమికుల మధ్య లేదా భార్యాభర్తల మధ్య ఏదో విషయంలో గొడవలు రావచ్చు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మాట్లాడే సమయంలో నియంత్రణ ముఖ్యం. వివాదాలు త్వరగా ముగిసే అవకాశం ఉంది. ఒంటరిగా ఉన్నవారు ఈరోజు తమ భాగస్వామిని కనుగొనవచ్చు.
వృషభ రాశి: ఈ రాశివారికి మిశ్రమంగా ఉంటుంది. ఆలోచనాత్మకంగా కొత్త సంబంధాన్ని ప్రారంభించండి. మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపండి.
మిధునరాశి: ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు పొందుతారు. మీ సంబంధం మరింత బలపడుతుంది. రిలేషన్ షిప్ లో ఉన్న వారి ప్రేమ జీవితంలో రొమాన్స్ పెరుగుతుంది.
కర్కట రాశి: ఈరోజు భాగస్వామితో ఇష్టంగా గడుపుతారు. ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తారు.
సింహ రాశి: ఈ రోజు.. ఈ రాశివారు తమ పనుల్లో బిజీగా గడుపుతారు. దీంతో తమ జీవిత భాగస్వామితో గడపడానికి ఎక్కువ సమయం కేటాయించలేరు. అయితే మీరిద్దరూ ఒకరి పరిస్థితి మరొకరు అర్థం చేసుకుంటారు.
కన్య రాశి: ఈ రోజు ఈ రాశివారు తమ భాగస్వామిని అన్ని విధాలుగా సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. అయితే ప్రేమికుల మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చి.. ఇద్దరి మధ్య గొడవకు దారి తీస్తుంది. కనుక పెళ్లి ప్రస్తావనకు దూరంగా ఉండండి.
తులరాశి: ఈ రోజు ఈ రాశివారు తమ భాగస్వామి తన సమస్యలను పంచుకుంటారు. అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే త్వరపడి నిర్ణయాలు తీసుకోవద్దు.
వృశ్చిక రాశి: ఒంటరిగా ఉన్న వారికి ఈరోజు వారి భాగస్వామిని పొందే అవకాశాలు ఉన్నాయి. మీ జీవితాంతం మీతో సంతోషముగా గడిపే భాగస్వామిని పొందే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి: ఈ రోజు మీ భాగస్వామి మీ ప్రేమ బంధం గురించి అలోచించి.. ఒక అడుగు ముందుకు వేయమని అడగవచ్చు. ఈ రోజు మీరు మీ భాగస్వామితో వివాహం గురించి మాట్లాడే అవకాశం ఉంది.
మకరరాశి: ఈ రాశివారు ఈ రోజు తమ భాగస్వామితో సమయం గడుపుతారు. వీరి ప్రేమ సంబంధం మరింత బలపడుతుంది.
కుంభ రాశి: ఈ రాశివారు కొత్త ప్రేమ సంబంధాన్ని ప్రారంభించడానికి మంచి రోజు. మరోవైపు, ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు ఈ రోజు తమ ప్రేమని వ్యక్తం చేయడానికి ఆసక్తిని చూపిస్తారు.
మీనరాశి: ఈ రోజు ఈ రాశివారు తమ ప్రేమ భాగస్వామిని తమ తల్లిదండ్రులకు పరిచయం చేయడం గురించి ఆలోచించే అవకాశం ఉంది. దీంతో ఇరువురి మధ్య ఉన్న ప్రేమ బంధం మరింత బలపడుతుంది. పెళ్ళి చేసుకునేందుకు మార్గం సుగమం చేస్తుంది.