Horoscope Today: వారికి కుటుంబ ఖర్చులు పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Telugu Rashifal (జూన్ 6, 2025): మేష రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. అధికారులు మీ సమర్థతను గుర్తించి ప్రోత్సహిస్తారు. వృషభ రాశి వారికి అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ధన వ్యయం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి దినఫలాలు ఇలా..

Horoscope Today: వారికి కుటుంబ ఖర్చులు పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today 06 June 2025

Edited By: Janardhan Veluru

Updated on: Jun 06, 2025 | 5:01 AM

దిన ఫలాలు (జూన్ 6, 2025): మేష రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వచ్చే అవకాశముంది. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉండే ఛాన్స్ ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి దినఫలాలు ఇలా..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. అధికారులు మీ సమర్థతను గుర్తించి ప్రోత్సహిస్తారు. వృత్తి జీవితంలో కార్యకలాపాలు వృద్ధి చెందుతాయి. వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ప్రధాన గ్రహాల సంచారం బాగున్నందువల్ల ఆదాయ వృద్ధి సంబంధమైన ప్రయత్నాలన్నీ సానుకూలపడతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లలు చదువుల్లో బాగా వృద్ధిలోకి వస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. మీ సలహాలు, సూచనల వల్ల సంస్థకు లాభం కలుగుతుంది. వ్యాపారాలు లాభాలపరంగా బాగా పురోగతి చెందుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఆర్థికంగా ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో ఉంటారు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ధనపరంగా ఎవరికీ హామీలు ఉండవద్దు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కొద్దిపాటి లాభాలతో పురోగమిస్తాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభి స్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లల చదువులకు సంబంధించి శుభ వార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ధన వ్యయం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో వీలైనంత అప్రమత్తంగా ఉండాలి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరిగినా ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాలన్నీ సానుకూలపడతాయి. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. సోదరులతో ఆస్తి వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. తలపెట్టిన పనులు కొద్దిగా నిదానంగా పూర్తవుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో బాధ్యతలు మారడం వల్ల పని భారం నుంచి ఉపశమనం కలుగుతుంది. ఒకటి రెండు శుభ వార్తలు వినే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు, అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూలంగా సాగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు. నిరుద్యోగులకు మెరుగైన అవకాశాలు అంది వస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సానుకూల ఫలితాలనిస్తుంది. వ్యక్తిగత సమస్యల్ని జాగ్రత్తగా పరిష్కరించుకుంటారు. ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో ఇతరుల సలహాలు, సూచనల మీద ఆధారపడకపోవడం మంచిది. ఆస్తి సమస్య పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు. సొంత ఇంటి ప్రయత్నాలు సానుకూలంగా సాగి పోతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందు తారు. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాలలో పరిస్థితులు కొద్దిగా అనుకూలంగా మారతాయి. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆస్తి వివాదం ఒకటి బాగా ఇబ్బంది పెడుతుంది. పిల్లలు చదువుల్లో శ్రద్ధను పెంచాల్సి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలలో ఆశించిన స్పందన కనిపిస్తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. జీత భత్యాలు బాగా పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆర్థికపరమైన ఒత్తిళ్ల నుంచి చాలావరకు బయటపడతారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. బంధువుల తోడ్పాటుతో పెళ్లి సంబంధం కుదురుతుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలతో సంతృప్తి చెందాల్సి వస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు లభిస్తాయి. ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు. కొన్ని ముఖ్యమైన పనుల్ని నిదానంగా పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఇంటా బయటా పని ఒత్తిడి ఉంటుంది. కొందరు బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఆదాయంతో సమానంగా కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో పని భారం బాగా పెరుగుతుంది. అధికారులు అతిగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆదా యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాలు ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు మీ సమర్థతకు, సలహాలకు, సూచనలకు విలువనిస్తారు. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కొద్దిగా ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబంతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.