Zodiac Signs: పాప గ్రహాల ప్రభావంతో ఆ రాశుల వారికి వ్యసనాల బెడద.. జాగ్రత్తగా లేకుంటే జీవితంలో ఓడిపోతారు..!

| Edited By: Janardhan Veluru

Jun 05, 2023 | 6:48 PM

పాప గ్రహాల ప్రభావం వల్ల వివిధ రాశుల వారు వ్యసనాలకు లోను కావడం జరుగుతుంది. రాహుకేతువులు, కుజుడు, రవి, క్షీణ చంద్రుడు శుక్ర గ్రహాల ప్రభావం వల్ల మద్యపానం, ధూమ పానం, స్త్రీ లోలత్వం వంటి వ్యసనాలు చుట్టు ముట్టే అవకాశం ఉంటుంది. అయితే, ఇక్కడ ప్రధానంగా వివిధ రాశుల వారిని మద్యపాన వ్యసనం ఎప్పుడు ఏ విధంగా పట్టుకుంటుందో పరిశీలిద్దాం..

Zodiac Signs: పాప గ్రహాల ప్రభావంతో ఆ రాశుల వారికి వ్యసనాల బెడద.. జాగ్రత్తగా లేకుంటే జీవితంలో ఓడిపోతారు..!
Zodiac Signs
Follow us on

పాప గ్రహాల ప్రభావం వల్ల వివిధ రాశుల వారు వ్యసనాలకు లోను కావడం జరుగుతుంది. రాహుకేతువులు, కుజుడు, రవి, క్షీణ చంద్రుడు శుక్ర గ్రహాల ప్రభావం వల్ల మద్యపానం, ధూమ పానం, స్త్రీ లోలత్వం వంటి వ్యసనాలు చుట్టు ముట్టే అవకాశం ఉంటుంది. అయితే, ఇక్కడ ప్రధానంగా వివిధ రాశుల వారిని మద్యపాన వ్యసనం ఎప్పుడు ఏ విధంగా పట్టుకుంటుందో పరిశీలిద్దాం. ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం ఏ ఏ రాశుల వారికి ఈ మద్యపాన వ్యసనం అలవడుతుందో, ఇదివరకే ఈ అలవాటు ఉన్న వారికి ఇది ఎలా ఎక్కువ అవుతుందో చూడాల్సి ఉంటుంది.

  1. మేష రాశి: ఈ రాశి కుజ గ్రహానికి సంబంధించిన రాశి అయినందువల్ల ఈ రాశి వారికి త్వరగా మద్య పాన వ్యసనం వంట బట్టే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఏదైనా వ్యసనం అలవాటైతే అది త్వరగా వదిలి పెట్టక పోవచ్చు. సాధారణంగా ఈ రాశి వారిలో ఎక్కువ మందిని మద్యపానమే ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ రాశిలో రాహు సంచారం జరుగుతున్నందువల్ల ఈ వ్యసనం కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది. అయితే రాహువుతో పాటు, గురు గ్రహం కూడా ఇదే రాశిలో ఉన్నందువల్ల కొద్ది ప్రయ త్నంతో ఈ వ్యసనం నుంచి బయటపడేందుకు వీలుంది.
  2. వృషభ రాశి: సాధారణంగా ఈ రాశి వారికి తొందరగా ఏ వ్యసనమూ అలవాటు కాదు. అలవాటైతే తొందరగా వదిలిపెట్టదు. ఈ రాశి వారు అప్పుడప్పుడు సరదాగా స్నేహితులతో మద్యం సేవించడమే తప్ప ప్రతిరోజు తప్పనిసరిగా తాగటమనే అలవాటు ఉండదు. ఈ వ్యసనం నుంచి బయటపడటానికి ప్రస్తుత సమయం చాలా అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ రాశి వారికి మద్యపానం గా మారే పక్షంలో ఆరోగ్యం త్వరగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
  3. మిథున రాశి: ఈ రాశి వారిలో కూడా ఎక్కువమందికి మద్య పానం అలవాటయ్యే అవకాశం ఉంది. మిత్రు లతో కలిసి మద్యం తీసుకోవడానికి వీరు ఎటు వంటి పరిస్థితులలోనూ వెనుకాడరు. అయితే, ఈ రాశి వారు సాధారణంగా మోతాదుకు మించి తీసుకోకపోవచ్చు. వాస్తవానికి ఈ రాశి వారిలో మద్యపాన ప్రియత్వం కాస్తంత ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. కొద్దిపాటి ప్రయత్నంతో కొద్దిపాటి కౌన్సెలింగ్ తో ఈ రాశి వారు ఈ వ్యసనం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారి స్నేహితులలో ఎక్కువ మంది ఇటువంటి అలవాట్లు కలిగిన వారే ఉంటారు.
  4. కర్కాటక రాశి: ఈ రాశి వారు అతి త్వరగా మద్యపానం వంటి వ్యసనాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ రాశి వారి మనసు చంచలంగా ఉండటం వల్ల మద్యపానానికి త్వరగా ఆకర్షి తులు కావడం జరుగుతుంది. ఈ రాశి వారికి మద్యపానం అలవాటైతే దీని నుంచి బయట పడటం చాలా కష్టం అవుతుంది. అందువల్ల ఈ రాశి వారు ఇటువంటి వ్యసనాలకు మొదటి నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రస్తుతం కర్కాటక రాశిలో కుజ, శుక్ర గ్రహాలు సంచరిస్తున్నందువల్ల ఈ రాశి వారికి మద్యపానంతో పాటు మరికొన్ని వ్యసనాలు కూడా అందుబాటులోకి వచ్చే సూచనలు ఉన్నాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. సింహ రాశి: ఈ రాశి వారు ఒక పట్టాన వ్యసనాల జోలికి పోవటం జరగదు. అప్పుడప్పుడు స్నేహితులతో మద్యపానం చేయడం కూడా తక్కువగానే జరుగుతూ ఉంటుంది. ఒకవేళ కొద్దిగా మద్య పానానికి అలవాటు పడినప్పటికీ అతి త్వరగా దీని నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తారు. వ్యసనాలను వ్యసనపరులను వీలైనంత దూరంగా ఉంచడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రాశి నాథుడు పాప గ్రహమైనటు వంటి రవి గ్రహమే అయినప్పటికీ, వీరు పరువు ప్రతిష్టల కోసం పాకులాడే వ్యక్తులు గనక వ్యసనాలకు దూరంగానే ఉంటారు.
  7. కన్య రాశి: ఈ రాశి వారు వ్యసనాలకు అలవాటు పడటం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. సాధార ణంగా మిత్రుల సమక్షంలో కూడా వీరు మద్యపా నానికి దూరంగా ఉండటమే జరుగుతుంది. ఈ రాశి వారికి సంబంధించినంత వరకు మద్య పానాన్ని అలవాటు చేసుకోవడం జరిగే పని కాదు. ఒకవేళ అలవాటు పడినా ఏదో ఒక దశలో దీని నుంచి బయటపడటం జరుగుతుంది. సాధా రణంగా ఈ రాశి వారు ఏదో ఒక క్రమ శిక్షణకు పద్ధతికి కట్టుబడి ఉండటం జరుగుతూ ఉంటుంది. అందువల్ల వీరికి మద్యపానాన్ని అల వాటు చేయడం అంత తేలికైన విషయం కాదు.
  8. తులా రాశి: ఈ రాశి వారు సాధారణంగా విలాస పురుషులై ఉంటారు. అందువల్ల విలాస జీవితంలో భాగంగా వీరు మద్యపానానికి అలవాటు పడటం జరుగుతుంది. ఈ వ్యసనం ఈ రాశి వారిని ఒక పట్టాన వదిలి పెట్టకపోవచ్చు. ఈ రాశి వారు ఎక్కువగా ఇతరులకు మద్యపానం అలవాటు చేయడం కూడా జరుగుతుంది. వృద్ధాప్యంలో కూడా ఈ రాశి వారు మద్యపానాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది. మద్యపాన ప్రియత్వం కారణంగా ఈ రాశి వారు ప్రయోగాలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది.
  9. వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఒక పట్టాన మద్యపానం అల వాటు కాదు. అలవాటు అయితే మాత్రం అది జీవితాంతం వదిలిపెట్టదు. వీరికి మద్యపానం అలవాటు ఉన్న విషయం చాలా కాలం వరకు బయటకు తెలియకపోవచ్చు. కొందరు ముఖ్యమైన స్నేహితులతో లేదా ఒంటరిగా మద్యాన్ని సేవించడం వీరికి అలవాటు. ఈ రాశి వారికి మద్యపానం అనేది సాధారణంగా ఒక హద్దులో ఉంటుంది. మితిమీరి సేవించడం వీరికి ఇష్టం లేని వ్యవహారం. ఈ రాశి వారు ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మద్యపానం విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు.
  10. ధనూ రాశి: ఈ రాశి వారు సహజ సిద్ధంగా మద్యపాన ప్రియులు. ఈ రాశి వారికి చిన్నతనం నుంచే ఏదో ఒక వ్యసనం అలవాటయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మద్యపానానికి త్వరగా అలవాటు పడటం జరుగుతుంది. అయితే, మద్యపానానికి లేదా మరేదైనా వ్యసనానికి దూరంగా ఉండాలని మనసులో ఒకసారి గట్టిగా నిర్ణయం తీసుకున్న పక్షంలో వీరిని మార్చడం చాలా కష్టం. ఈ రాశి వారికి ఎక్కువగా ప్రముఖులతో లేదా పలుకుబడి కలిగిన వ్యక్తులతో స్నేహాలు ఏర్పడే అవకాశం ఉన్నందువల్ల ఒక్కొక్కసారి మద్యపానం తప్పనిసరి అయ్యే సూచనలు ఉన్నాయి.
  11. మకర రాశి: ఈ రాశి వారు సాధారణంగా వ్యసనాల జోలికి పోవటం జరగదు. ఈ రాశికి శని అధిపతి అయి నందువల్ల ఈ రాశి వారు క్రమశిక్షణ, నియమాలు, పద్ధతులకు అలవాటు పడి ఉంటారు. ఇతరు లను వ్యసనాల నుంచి తప్పించడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు లేదా ఎప్పుడో ఒకప్పుడు మద్యం తీసుకోవడం కూడా చాలా అరుదు. సాధారణంగా స్నేహితులతో కంటే కుటుంబంతోనే ఎక్కువ సమయం గడప డానికి ఇష్టపడే ఈ రాశి వారు మద్యపానం ధూమపానం తదితర వ్యసనాలకు సాధ్యమై నంత దూరంగా ఉండటం జరుగుతూ ఉంటుంది.
  12. కుంభ రాశి: ఈ రాశికి కూడా శనీశ్వరుడే అధిపతి అయినందువల్ల సాధారణంగా ఈ రాశి వారు మద్యపానానికి దూరంగా ఉండటమే జరుగుతూ ఉంటుంది. ఈ రాశిలో రాహు గ్రహం లేదా కుజగ్రహం ఉన్నప్పుడు మాత్రమే ఈ రాశి వారిలో కొద్దిగా ఈ అలవాటు ఉంటుంది. ఎప్పుడైనా మద్యం సేవించినప్పటికీ దానికి అలవాటు పడటం, దాని కోసం ఆరాటపడటం వంటివి మాత్రం జరిగే అవకాశం లేదు. పైగా వీరిలో ఎక్కువ మంది కౌన్సిలింగ్ లేదా వ్యసన నివారణ కేంద్రాలలో పనిచేయడం కూడా జరుగుతూ ఉంటుంది.
  13. మీన రాశి: ఈ రాశి వారికి ఏ వ్యసనం అయినప్పటికీ అతి త్వరగా వంట పడుతుంది. వీరు సాధారణంగా సున్నిత మనస్కులు అయినందువల్ల మొహమాటాలకు లొంగిపోయి ఈ వ్యసనానికి అలవాటు పడే అవకాశం ఉంటుంది. వాస్తవానికి మద్యపాన ప్రియులకు ఎంత వీలైతే అంత దూరంగా ఉండటానికే వీరు ప్రాధాన్యం ఇస్తారు. అయితే మానసికంగా బలహీనులు అయినందు వల్ల బలవంతాలకు, మొహమాటాలకు లొంగి మధ్య మధ్య మద్యం సేవించే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ వీరు వ్యసన పరులు అయ్యే అవకాశం మాత్రం లేదు. సాధారణంగా నియమాలకు కట్టుబడి ఉంటారు.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..