Zodiac Signs: వృద్ధి స్థానంలో గ్రహ సంచారం.. ఆ రాశుల వారి జీవితంలో సాటి లేని పురోగతి..!

| Edited By: Janardhan Veluru

Jun 18, 2024 | 6:50 PM

జ్యోతిష శాస్త్రంలో మూడవ స్థానానికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. ఈ స్థానంలో శుభ గ్రహాలున్నా, పాప గ్రహాలున్నా జీవితంలో వృద్ధికి, పురోగతికి బాట వేస్తాయి. అక్కడ ఏదో ఒక గ్రహం ఉండాల్సిన అవసరం ఉంది. దాన్ని జ్యోతిష శాస్త్రంలో ఒక అతి ముఖ్యమైన ఉపచయ స్థానంగా పరిగణిస్తారు. ఉపచయ స్థానమంటే వృద్ధి స్థానం (గ్రోత్ సెంటర్).

Zodiac Signs: వృద్ధి స్థానంలో గ్రహ సంచారం.. ఆ రాశుల వారి జీవితంలో సాటి లేని పురోగతి..!
Astrology 2024
Follow us on

జ్యోతిష శాస్త్రంలో మూడవ స్థానానికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. ఈ స్థానంలో శుభ గ్రహాలున్నా, పాప గ్రహాలున్నా జీవితంలో వృద్ధికి, పురోగతికి బాట వేస్తాయి. అక్కడ ఏదో ఒక గ్రహం ఉండాల్సిన అవసరం ఉంది. దాన్ని జ్యోతిష శాస్త్రంలో ఒక అతి ముఖ్యమైన ఉపచయ స్థానంగా పరిగణిస్తారు. ఉపచయ స్థానమంటే వృద్ధి స్థానం (గ్రోత్ సెంటర్). ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం మేషం, కర్కాటకం, ధనుస్సు, మకరం, కుంభం, మీన రాశులకు తృతీయ స్థానంలో ఏదో ఒక గ్రహం ఉన్నందువల్ల వీరికి శీఘ్రగతిన పురోగతి ఉంటుంది. తృతీయ స్థానంలో ఉన్న గ్రహం కారకత్వం లేదా లక్షణాలను బట్టి వృద్ధి, పురోగతి ఏ విధంగా ఉంటాయన్నది నిర్ధారించాల్సి ఉంటుంది.

  1. మేషం: ఈ రాశికి తృతీయ స్థానంలో బుధ, శుక్ర, రవి గ్రహాలు ఉండడం వల్ల అనేక విధాలుగా ఈ రాశి వారు జీవితంలో పురోగతి చెందే అవకాశం ఉంటుంది. ఈ మూడు గ్రహాలు ఈ నెలాఖరు వరకు ఈ రాశిలో కొనసాగే అవకాశం ఉన్నందువల్ల ఈ రాశివారికి ఆర్థికంగా, ఉద్యోగపరంగా ఊహించని పురో గతి ఉంటుంది. ఏ రంగంలో ఉన్నవారికైనా ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరగడం, లాభాలు వృద్ధి చెందడం జరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. తీర్థయాత్రలు చేసే అవకాశముంది.
  2. కర్కాటకం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో కేతువు సంచారం వల్ల ఆర్థికంగానే కాక సామాజికంగా కూడా అంచనాలకు మించిన వృద్ధి ఉంటుంది. ఏ ప్రయత్నం చేపట్టినా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఊహించని అభివృద్ధి ఉంటుంది. ఆర్థికంగా దశ, దిశ మారిపోయే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపా రాల్లో కొద్దిపాటి మార్పులు, చేర్పులతో లాభాలు పెరిగిపోతాయి. జీవనశైలిలో కూడా సానుకూల మార్పు చోటు చేసుకుంటుంది. జీవితాన్ని మలుపు తిప్పే శుభ పరిణామాలు సంభవిస్తాయి.
  3. ధనుస్సు: ఈ రాశికి తృతీయ స్థానంలో తృతీయ స్థానాధిపతి శనీశ్వరుడి సంచారం వల్ల జీవితంలో కలలో కూడా ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలోనే కాక, ఆర్థికంగా కూడా స్థిరత్వం లభిస్తుంది. ఆదాయం దిన దినాభివృద్ది చెందుతుంది. ఆర్థిక సమస్యలు బాగా తగ్గుముఖం పడ తాయి. ఒత్తిళ్లు, కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సంపన్నుల స్థాయికి చేరుకుంటారు. ఆరోగ్య భాగ్యం కూడా పడుతుంది.
  4. మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో రాహువు సంచారం వల్ల ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండదు. అనేక మార్గాల్లో ఆదాయం అత్యధికంగా వృద్ధి చెందే సూచనలు న్నాయి. ఆర్థిక సమస్యల ఒత్తిడి బాగా తగ్గిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త నైపుణ్యాలను పెంచు కోవడం ద్వారా ఉన్నత పదవులు సాధించడంతో పాటు ఆర్థిక లాభం పొందుతారు. వ్యాపారాల్లో మార్పులు చేపట్టి లాభాలు గడిస్తారు. శుభ పరిణామాలు సంభవిస్తాయి. ధన యోగాలు పడతాయి.
  5. కుంభం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో తృతీయ స్థానాధిపతి కుజుడి సంచారం వల్ల దేని గురించీ ఆందో ళన పడాల్సిన అవసరం ఉండదు. ధన ధాన్య వృద్ధికి అవకాశం ఉంటుంది. ఏ ప్రయత్నం తల పెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. అనేక శుభవార్తలు వింటారు. కీలకమైన శుభ పరిణా మాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగంలో చేరే అవకాశ ముంది.
  6. మీనం: ఈ రాశికి తృతీయ స్థానంలో రాశ్యధిపతి గురువు సంచారం వల్ల జీవితం నల్లేరు మీది బండిలా సాగిపోతుంది. దాదాపు ప్రతి ప్రయత్నమూ సత్ఫలితాలనిస్తుంది. ప్రయాణాల వల్ల లాభం చేకూ రుతుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా ప్రయాణాలు చేయవలసినవారికి అంచనాలకు మించిన పురో గతి ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు తగిన స్పందన లభి స్తుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది.