శని గ్రహ ప్రభావంతో ఆ రాశుల వారిపై తీవ్ర మానసిక ఒత్తిడి.. ఆఫీస్‌లో గొడ్డు చాకిరీలు ఖాయం..!

| Edited By: Janardhan Veluru

May 23, 2023 | 6:01 PM

శని సంచారం వల్ల కొన్ని రాశుల వారికి మానసిక, శారీరక ఒత్తిడి, తిప్పట, శ్రమ ఎక్కువ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంటా బయటా పని భారం పెరిగి శారీరకంగా అలసిపోయే అవకాశం ఉంది. శని తన స్వక్షేత్రమైన కుంభరాశిలో సంచారం చేస్తున్నందువల్ల డబ్బు ఇవ్వడం, ఉద్యోగం ఇవ్వటం, ఉద్యోగంలో గుర్తింపు లభించడం వంటివి జరిగే అవకాశం ఉన్నప్పటికీ..

శని గ్రహ ప్రభావంతో ఆ రాశుల వారిపై తీవ్ర మానసిక ఒత్తిడి.. ఆఫీస్‌లో గొడ్డు చాకిరీలు ఖాయం..!
Zodiac Signs
Follow us on

శని సంచారం వల్ల కొన్ని రాశుల వారికి మానసిక, శారీరక ఒత్తిడి, తిప్పట, శ్రమ ఎక్కువ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంటా బయటా పని భారం పెరిగి శారీరకంగా అలసిపోయే అవకాశం ఉంది. శని తన స్వక్షేత్రమైన కుంభరాశిలో సంచారం చేస్తున్నందువల్ల డబ్బు ఇవ్వడం, ఉద్యోగం ఇవ్వటం, ఉద్యోగంలో గుర్తింపు లభించడం వంటివి జరిగే అవకాశం ఉన్నప్పటికీ మానసిక ఒత్తిడి పెంచే సూచనలు కూడా ఉన్నాయి. మానసిక శారీరక ఒత్తిడి ఇవ్వటం సిరి లక్షణం. అందువల్ల శని విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఐదు రాశుల వారికి కొద్ది కాలం పాటు కొన్ని యోగాలతో పాటు మానసిక ఒత్తిడి శ్రమ పని భారం వంటివి అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. ఆ రాశులు కర్కాటకం, వృశ్చికం, మకరం, కుంభం, మీనం.

  1. కర్కాటక రాశి: ఈ రాశి వారికి అష్టమ శని జరుగుతోంది. దీనివల్ల ఆదాయం పెరగటం, ఉద్యోగంలో పురోగతి వంటివి చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే, అష్టమ శని తప్పకుండా పని భారం పెంచడం జరుగుతుంది. అదనపు బాధ్యతలు మీద పడే అవకాశం ఉంది. సహచరుల బాధ్యత లను కూడా మోయవలసిన అవసరం ఏర్పడు తుంది. ప్రతి చిన్న పనికి ఒకటికి రెండుసార్లు తిరగవలసి వస్తుంది. ఆహార విహారాల్లో కూడా తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. శరీరానికి విశ్రాంతి అవసరమని గ్రహించండి. ఇతరుల బాధ్యతలను పంచుకోవ డానికి ప్రయత్నించకపోవడం చాలా మంచిది. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ఆధ్యాత్మిక చింతనను అలవరచుకోవడం అవసరం.
  2. వృశ్చిక రాశి: ఈ రాశి వారికి అర్థాష్టమ శని జరుగుతున్నందు వల్ల ఏరి కోరి ఇతరుల బాధ్యతలను ఇతరుల పనులను నెత్తిన వేసుకునే అవకాశం ఉంది. శారీరక మానసిక శ్రమతో పాటు అనవసర ఖర్చులతో కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది. కుటుంబ వ్యవహారాలలో కూడా బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఏ పని సకాలంలో పూర్తికాక నిరాశ నిస్పృహలకు లోను కావలసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆసాజనకంగా ఉన్నప్పటికీ అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఎంతగానో ఒత్తిడి పెరుగుతుంది. బంధువుల నుంచి స్నేహితుల నుంచి కూడా సహాయం కోసం ఒత్తిడి పెరుగుతుంది. మానసిక నుంచి బయటపడ టానికి యోగ సాధన చాలా మంచిది.
  3. మకర రాశి: ఉద్యోగ పరంగా, ఆదాయపరంగా పరిస్థితులు అనుకూలంగానే ఉన్నప్పటికీ ఏలిన్నాటి శని కారణంగా శ్రమ తిప్పట ఎక్కువగా అనుభవానికి వస్తాయి. సకాలంలో లక్ష్యాలు పూర్తి చేసినా, బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినా అధికా రులు లేదా యజమానుల నుంచి సంతృప్తి వ్యక్తం కాకపోవడం మానసికంగా ఒత్తిడిని పెంచుతుంది. కుటుంబ పరంగా కూడా ఇతరుల బాధ్యతలను స్వీకరించవలసి వస్తుంది. మొత్తం మీద ఇంటా బయటా చాకిరి పెరిగి, క్షణం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. విశ్రాంతి తీసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. సొంత పనుల కంటే ఇతరుల పనులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వవలసి వస్తుంది. వీలైనంతగా శరీరానికి విశ్రాంతి ఇవ్వడం మంచిది.
  4. కుంభ రాశి: ఈ రాశి వారికి ఏలిన్నాటి శని కారణంగా బరువు బాధ్యతలు పెరిగి క్షణం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం నిలకడగా ఉన్నప్పటికీ అనవసర ఖర్చుల కారణంగా మానసిక ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. ప్రతి చిన్న పనికి అనేక పర్యాయాలు తిరగవలసి వస్తుంది. ముఖ్య మైన పనులు వాయిదా పడుతూ ఉంటాయి. అటు ఉద్యోగపరంగా, ఇటు కుటుంబపరంగా పని భారం బాగా పెరుగుతుంది. విశ్రాంతి తీసుకోవ డానికి కూడా అవకాశం ఉండకపోవచ్చు. ఇతరుల బాధ్యతలను పంచుకునే ప్రయత్నం చేయవద్దు. ఇతరులకు సహాయ సహకారాల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవడం అవసరం. మితిమీరిన ఔదార్యం లేదా మంచితనం కారణంగా ఇబ్బంది పడటం జరుగుతుంది. మధ్య మధ్య శరీరానికి విశ్రాంతినివ్వడం మంచిది.
  5. ఇవి కూడా చదవండి
  6. మీన రాశి: ఈ రాశి వారికి ఏలినాటి శని కారణంగా తిప్పట ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. బంధువులు లేదా సన్నిహిత మిత్రులు ఈ రాశి వారిని స్వప్ర యోజనాలకు ఉపయోగించుకునే సూచనలు ఉన్నాయి. అతిగా తిరగటం అతిగా ప్రయాణాలు చేయడం మితిమీరి ఖర్చు చేయడం వంటివి మానసికంగా బాగా ఇబ్బంది పెడతాయి. సొంత పనులను పక్కన పెట్టి ఇతరుల కోసం అనవస రంగా శ్రమ పడాల్సి వస్తుంది. కుటుంబానికి సమయం కేటాయించడం తగ్గుతుంది. ఉద్యో గంలో కృతజ్ఞతలు లేని బాధ్యతలు నిర్వర్తించ వలసి వస్తుంది. ఇతరుల కోసం విలువైన సమయాన్ని వృధా చేయవలసి వస్తుంది. మొత్తం మీద ఇంటా బయట శ్రమ ఒత్తిడి బాగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. యోగ సాధన లేదా ఆధ్యాత్మిక చింతన వల్ల ఉపశమనం పొందటానికి ప్రయత్నించండి.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..