సాధారణంగా కొందరు పిసినారులు ఉంటారు.. డబ్బులు అస్సలు ఖర్చు చేయరు.. ఎప్పుడు ఇతరులతో ఖర్చు చేయించేందుకు ఇష్టపడుతుంటారు. వారు మంచివారే అయినప్పుటికీ ఖర్చు చేసేందుకు మాత్రం వెనకడతారు. పొదుపు చేసేందుకు.. చిన్న బడ్జెట్లో తేదీని ప్లాన్ చేస్తుంటారు. అలాగే.. ఎప్పుడు వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ.. పొదుపుగా వ్యవహరిస్తుంటారు. అనవసర ఖర్చులు చేసేందుకు ఆసక్తి చూపించరు. అయితే వారి ఈ స్వభావమనేది.. వారి జన్మ రాశుల ఆధారంగా ఉంటుందని అంటున్నారు జ్యోతిష్యనిపుణులు. మకరం నుంచి తులరాశి వరకు.. ఇతరులకు.. తమ కోసం కూడా ఖర్చు చేసేందుకు ఆలోచిస్తారు. మరి ఆ రాశులెంటో తెలుసుకుందామా..
మకరరాశి..
వీరు షాపింగ్ చేసినప్పుడు ఎక్కువగా బేరం చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కొనుగోలు చేసిన ప్రతి వస్తువుపై అదనపు తగ్గింపు.. డిస్కౌంట్స్ అడుగుతుంటారు. ఉచితంగా రూపాయి వచ్చిన చాలా సంతోషంగా ఉంటారు. కొందరు ఈ రాశి స్త్రీలు.. తమ విందుకు కూడా చెల్లించేందుకు ఇష్టపడరు.
తులారాశి..
ఈ రాశి స్త్రీలు అందంగా ఉంటారు. వీరు బంధానికి ఎక్కువగా విలువ ఇస్తారు.. బంధంలో ఇద్దరూ సమానమే అని భావిస్తారు. వీరు తమ భాగస్వామితో బయటకు వెళ్లినప్పుడు వీరు చెల్లించేందుకు ఆసక్తి చూపిస్తారు. కానీ ఎక్కువ సమయంలో వీరు ఇతరులను చెల్లించడానికి ఇష్టపడతారు.
ధనుస్సు రాశి..
ధనుస్సు రాశి స్త్రీలు, పురుషులు తమ భాగస్వాములతో డిన్నర్‌కు వెళ్లినప్పుడు చాలా సంతోషంగా ఉంటారు. వీరికి నచ్చిన వంటకాలను ఆర్డర్ చేయడానికి ఎంత దూరమైన వెళ్తారు. కానీ డబ్బులు చెల్లించేందుకు మాత్రం అస్సలు ఇష్టపడరు. ఎప్పుడు ఇతరులు చెల్లిస్తే సంతోషిస్తారు.
కర్కాటక రాశి.
వీరు రాయల్టీ లుక్.. ఆలోచన.. నడవడిక కలిగి ఉంటారు. తమ కోసం ఎక్కువగా ఖర్చు పెట్టేందుకు ఇష్టపడతారు. దీంతో వీరి భాగస్వాములకు ఇబ్బంది ఉంటుంది. వీరితో ఉన్నప్పుడు మీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు సహయం చేసేందుకు ఇష్టపడరు.
గమనిక:- ఈ కథనం కేవలం జ్యోతిష్య నిపుణుల అభిప్రాయాలు.. రాశి చక్రాల నమ్మకాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని టీవీ9 తెలుగు దృవీకరించలేదు.
Kajal Aggarwal: ఆచార్య సినిమాలో లేని కాజల్.. అయినా కళ్లు చెదిరే రెమ్యునరేషన్ ?.. ఎంతంటే..
Nikhil: మీకు కొడుకుగా ఉన్నందుకు ప్రతిక్షణం గర్వపడ్డాను.. తండ్రి మరణంపై హీరో నిఖిల్ భావోద్వేగ లేఖ..
Acharya Movie: బాస్ ఈజ్ బ్యాక్.. థియేటర్లలో ఆచార్య సందడి.. ఫ్యాన్స్ ఆందోళన.. ఎందుకంటే..