Astrology: ఈ రాశివారు మంచి ప్రేమికులు.. తమ భాగస్వామి కాలు కింద పెట్టినా కందిపోతుందని భావిస్తారు.. ఆ రాశులు ఏమిటంటే..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు, రాశులు, నక్షత్రాల ఆధారంగా మనిషి మంచి చెడులు మాత్రమే కాదు.. నడవడిక, మనిషి గుణగణాలు కూడా ఆధారపడి ఉంటాయని నమ్మకం. ఈ నేపధ్యంలో ఈ రోజు కొన్ని రాశుల వారు ప్రేమించే గుణం కలిగి ఉంటారు. తాము ప్రేమించిన వారిని ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండేలా చూసుకుంటారు. తమ భాగస్వామికి అపురూపమైన ప్రేమని అందిస్తారు. తమ శృంగార శైలితో ఎల్లప్పుడూ తమ భాగస్వామిని ఆకర్షిస్తారు. ఆ రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

Astrology: ఈ రాశివారు మంచి ప్రేమికులు.. తమ భాగస్వామి కాలు కింద పెట్టినా కందిపోతుందని భావిస్తారు.. ఆ రాశులు ఏమిటంటే..
Astro Tips

Updated on: Jul 22, 2025 | 10:56 AM

జ్యోతిషశాస్త్రంలో రాశుల ప్రకారం వ్యక్తుల ప్రవర్తన కొన్ని సంగ్రహావలోకనాలను మనం తెలుసుకోవచ్చు. జనన సమయం, జన్మ నక్షత్రం, జన్మ రాశులను బట్టి కూడా వ్యక్తుల గురించి, వారి జీవనశైలి గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. రాశి ప్రకారం.. వ్యక్తులు సాధారణంగా ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారో నిర్ణయించబడుతుంది. ప్రతి రాశికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ జీవితంలో ప్రేమ కోసం వెతుకుతారు. ప్రతి ఒక్కరూ ప్రేమించబడాలని కోరుకుంటారు. అయితే కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు మంచి ప్రేమికులు. తమ భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు. కనుక ఈ రోజు మనం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు ప్రేమించే స్వభావాన్ని కలిగి ఉంటారు. తమ భాగస్వామిని ప్రేమిస్తారు. అంతేకాదు తాము ప్రేమించిన వ్యక్తులను ఎప్పుడూ ఆకర్షించాలని కోరుకుంటారు. శృంగారభరితంగా జీవించడానికి ఇష్టపడతారు. ఈ రోజు ప్రేమించే మనసు ఉన్న రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

మీన రాశి: మీన రాశి వారు కలలు కనే ప్రేమికులు. వారు తమ భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు. నమ్ముతారు. వీరు తమ ప్రేమను వ్యక్తపరిచే విధానం కొంచెం కవితాత్మకంగా ఉంటుంది.

కర్కాటక రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ ప్రేమని .. ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని కోరుకుంటారు. ఈ రాశి వారు భావోద్వేగ బంధాన్ని నమ్ముతారు. తమ భాగస్వామికి విధేయులుగా ఉంటారు.

ఇవి కూడా చదవండి

తులా రాశి: శుక్రుడు పాలించే తులారాశి వారు సహజంగా ఆకర్షణీయంగా ఉంటారు. అందం, ప్రేమను ఇష్టపడతారు.

వృషభ రాశి: వృషభ రాశి వారిని శుక్రుడు పాలిస్తాడు. ఈ రాశి వారు తమ భాగస్వామితో గడిపే విషయంలో మంచి రొమాంటిక్ గా ఉంటారు. కొవ్వొత్తి వెలుగులో విందు, భాగస్వామితో సమయం గడపడం, ప్రేమపూర్వక స్పర్శ వంటి వివిధ పద్దతుల ద్వారా తమ ప్రేమని భాగస్వామికి తెలియజేయాలనే ఉత్సాహంతో ఉంటారు. ఈ రాశి వారు తమ భాగస్వామికి విలాసవంతమైన జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడతారు.

సింహ రాశి: సింహ రాశి వారు భావోద్వేగానికి లోనవుతారు. వీరు భాగస్వామి నుంచి ఆప్యాయత, అనుబంధాన్ని కోరుకుంటారు. తమ భాగస్వామి ఎల్లప్పుడూ తమని ప్రేమించాలని కోరుకుంటారు. దీని కోసం వీరు ఏ పని చేయడానికి అయినా సరే వెనుకాడరు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.