Zodiac Signs: ఉందిలే మంచి కాలం ముందుముందునా.. ఆ నాలుగు రాశులకు చెందిన వారికి తిరుగులేని పురోగతి.. అందులో మీరున్నారా?

| Edited By: Janardhan Veluru

May 01, 2023 | 3:58 PM

జాతక చక్రంలో ఈ పదకొండవ స్థానం ఎంత బలంగా ఉంటే అంత మంచిది. గ్రహచారంలో కూడా 11వ స్థానంలో సంచరిస్తున్న గ్రహాల వల్ల ఆయా రంగాలలో తప్పకుండా అభివృద్ధి కనిపిస్తుంది. దీని ప్రకారం..

Zodiac Signs: ఉందిలే మంచి కాలం ముందుముందునా.. ఆ నాలుగు రాశులకు చెందిన వారికి తిరుగులేని పురోగతి.. అందులో మీరున్నారా?
Zodiac Signs
Follow us on

జ్యోతిష్య శాస్త్రంలో 11వ స్థానానికి అంటే లాభ స్థానానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ స్థానం పురోగతికి, ఆదాయానికి, అనారోగ్యం నుంచి కోలుకోవడానికి, ఆయుర్దాయానికి సంబంధించినది. ఈ స్థానంలో ఏ గ్రహం ఉన్నా అది తప్పకుండా శుభ ఫలితాలను మాత్రమే ఇస్తుంది. జాతక చక్రంలో ఈ పదకొండవ స్థానం ఎంత బలంగా ఉంటే అంత మంచిది. గ్రహచారంలో కూడా 11వ స్థానంలో సంచరిస్తున్న గ్రహాల వల్ల ఆయా రంగాలలో తప్పకుండా అభివృద్ధి కనిపిస్తుంది. దీని ప్రకారం ప్రస్తుతం మేషం, మిధునం, సింహం, ధను రాశి వారికి మంచి పురోగతి కనిపిస్తోంది. కొద్ది ప్రయత్నంతో ఈ రాశుల వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా, ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా తప్పకుండా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.

మేష రాశి

ఈ రాశి వారికి ప్రస్తుతం 11వ స్థానంలో శనీశ్వరుని సంచారం జరుగుతోంది. శని వృత్తి, ఉద్యోగాలకు, ఆయుర్దాయానికి కారకుడు.  శని గ్రహం ఈ పదకొండవ స్థానంలో అంటే కుంభ రాశిలో 2025 జూలై వరకు సంచరించడం జరుగుతుంది. ఈ సమయంలో మేష రాశి వారు తప్పకుండా వృత్తి, ఉద్యోగాలపరంగా అభివృద్ధి చెందడానికి, స్థిరత్వం సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. లాభ స్థానం ఆదాయానికి సంబంధించింది కూడా అయినందువల్ల ఆదాయం పెరగటం, రుణ సమస్యలు తీరటం, ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడటం, దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కోల్పోవడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు వింటారు. కొన్ని శుభ పరిణామాలు కూడా చోటుచేసుకుంటాయి. ఈ రాశి వారు ఈ దిశగా ఎంత ప్రయత్నం చేస్తే అంతగా మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. తరచూ శివార్చన చేయించడం వల్ల గ్రహచార సంబంధమైన దోషాలన్నీ తొలగిపోతాయి.

ఇవి కూడా చదవండి

మిథున రాశి

ఈ రాశి వారికి ప్రస్తుతం 11వ స్థానంలో నాలుగు గ్రహాలు సంచరించడం జరుగుతోంది. గురువు బుధుడు రవి రాహువు ఈ రాశిలో సంచరించడం వల్ల ఈ రాశి వారికి అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో తప్పకుండా అధికార యోగానికి అవకాశం ఉంది. ముఖ్యంగా సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాల వల్ల సామాజిక హోదా పెరగడం జరుగుతుంది. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన పనులు అతివేగంగా పూర్తి అవుతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి కోలుకోవటం జరుగుతుంది. శుభవార్త శ్రవణం ఉంటుంది. ఊహించని విధంగా జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభించడమే కాక ఆర్థిక స్థిరత్వం కూడా లభించి మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. తరచూ ఆదిత్య హృదయం చదువుకోవటం వల్ల జాతక పరమైన దోషాలు తొలగిపోతాయి.

సింహ రాశి

ఈ రాశి వారికి ప్రస్తుతం 11వ స్థానంలో శుక్ర, కుజ గ్రహాలు సంచరిస్తున్నందువల్ల స్త్రీ మూలక ధనప్రాప్తికి అవకాశం ఉంది. అంతేకాక, రెండు మూడు మార్గాల ద్వారా ఆదాయం వృద్ధి చెందే సూచనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అనారోగ్యాల నుంచి దాదాపు పూర్తిగా బయట పడే అవకాశం కూడా ఉంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభించడంతో పాటు ఇతరులకు సహాయం చేయగల స్థితికి చేరుకోవడం జరుగుతుంది. అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మహిళా భాగస్వాములు, మహిళా అధికారులు, మహిళా సహచరుల ద్వారా ఆకస్మిక ధన లాభా నికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఊహించని విధంగా పురోగతి ఉంటుంది. దూర ప్రాంతం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ పరంగా కుటుంబ పరంగా సంతానపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ రాశి వారు ఎంత పాజిటివ్ గా వ్యవహరిస్తే అంత మంచిది. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల సుందరకాండ పారాయణం చేయడం వల్ల తప్పకుండా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి.

ధను రాశి

ఈ రాశి వారికి 11వ స్థానమైన తులా రాశిలో కేతు గ్రహం సంచరించడం, ఈ స్థానాన్ని నాలుగు గ్రహాలు బలంగా వీక్షించడం వల్ల, కలలో కూడా ఊహించని మార్గాలలో ఆదాయం అభివృద్ధి చెందుతుంది. వృత్తి ఉద్యోగాలలో తనదంటూ ఒక ప్రత్యేక ముద్ర వేయటం జరుగుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. ఎంత ప్రయత్నిస్తే అంతగా శుభ ఫలితాలు అనుభవా నికి వస్తాయి. శక్తివంతులైన వ్యక్తులతో పరిచ యాలు ఏర్పడతాయి. వారి వల్ల జీవితం ఒక మంచి మలుపు తిరిగే అవకాశం ఉంది.  కొత్త పెట్టుబడులు కొత్త వ్యాపారాలు అతి తక్కువ కాలంలో పురోగతి చెందుతాయి. విదేశీయానానికి సంబంధించి ఏవైనా సమస్యలు ఆటంకాలు ఉంటే అవి కొద్దిపాటి ప్రయత్నంతో పరిష్కారం అవుతాయి. అనారోగ్యాల నుంచి పూర్తిగా కోల్పోవటానికి ఇది చాలా మంచి సమయం. ప్రయాణాల ద్వారా బాగా లాభం పొందుతారు. లాటరీలు జూదం షేర్లు ఇతర లావాదేవీల ద్వారా అత్యధికంగా ప్రయోజనం పొందడం జరుగుతుంది. తరచూ లలితా సహస్రనామం పఠించడం ద్వారా అనేక శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..