Solar Eclipse 2023: సౌరకుంటుంబంలో భాగమైన మన భూమితో పాటు సూర్యచంద్రులు కూడా నిత్యం కదులుతుంటాయని మనకు తెలిసిందే. ఫలితంగానే ఒక నిర్ధిష్ట సమయంలో సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం కలుగుతుంటాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా రెండు సూర్య గ్రహణాలు, 2 చంద్ర గ్రహణాలు ఏర్పడుతున్నాయి. ఇక వీటిలో మొదటిగా రేపు అంటే ఏప్రిల్ 20న తొలి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఈ గ్రహణం ఉదయం 7.05 నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.29 గంటలకు ముగుస్తుంది. అంటే ఈ సూర్యగ్రహణం దాదాపు 5 గంటల 25 నిమిషాల పాటు ఉంటుంది. అయితే ఇది భారత్‌లో కనిపించదు.
మరోవైపు జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ గ్రహణాలు రాశిచక్రంలోని 12 రాశులపై ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తుంటాయి. ఇక ఇవి కొన్ని రాశులకు శుభప్రదంగా, మరి కొన్ని రాశులకు ప్రతికూలంగానూ ఉంటాయి. ఆ నేపథ్యంలోనే రాశిచక్రంలోని నాలుగు రాశులపై రేపటి సూర్యగ్రహణం ప్రతికూల ప్రభావాలను చూపించబోతుంది. ఫలితంగా ఈ నాలుగు రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ సూర్యగ్రహణం ఏ రాశులపై చెడు ప్రభావం చూపుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
మేష రాశి: మేష రాశివారు సూర్యగ్రహణం సమయంలో శుభకార్యాలు చేయడం, కొత్త పనులు ప్రారంభించడం, కొత్త వస్తువులు కొనడం అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఈ ప్రయత్నాలు వారి శుభ ఫలితాలను ఇవ్వదు. ఇంకా ఈ గ్రహణ ప్రభావంతో మేషరాశివారు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు.
వృశ్చిక రాశి: రేపు ఏర్పడే సూర్యగ్రహణం ఈ రాశి వారిపై అధిక ప్రభావాన్ని చూపుతుంది. ఫలితంగా వృశ్చికరాశి వారు ఆర్థిక సమస్యలతో సతమతమవడంతో పాటు ఖర్చులు అధికం కానున్నాయి. అంతేకాక వీరి కుటంబంలో కూడా గొడవలు జరిగే అవకాశం ఉంది. అందువలన ప్రతీ విషయంలో ఆచీ తూచీ అడుగు వేయాలంటున్నారు జ్యోతిష్య పండితులు. ఇక ఈ సూర్యగ్రహణ సమయంలో వృశ్చికరాశివారు శివనామస్మరణ చేయడం చాలా మంచిదని వారు చెబుతున్నారు.
కన్యరాశి: ఈ సూర్యగ్రహణం కన్యారాశివారు కొత్త పనులు ప్రారంభించకూడదు. ముఖ్యంగా ప్రయాణ సమయాల్లో జాగ్రత్తగా ఉండడం అత్యంత అవసరం. వాహనాలు నడిపే సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీకు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.
మకర రాశి: ఏప్రిల్ 20న ఏర్పడే తొలి సూర్యగ్రహణం మకర రాశివారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అలాగే వీరికి ఆర్ధిక సమస్యలు, ఖర్చులు అధికం కానున్నాయి. చేయాలనుకున్న పనులు ఎక్కడికి అక్కడే నిలిచిపోతాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)