దిన ఫలాలు (మార్చి 29, 2025): మేష రాశి వారికి ఆస్తి వివాదం ఒకటి సానుకూలపడుతుంది. ఆర్థిక వ్యవహారాలన్నీ లాభసాటిగా పూర్తవుతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితంలో ఒత్తిడి, శ్రమ బాగా తగ్గుతాయి. సహచరులతో అదనపు బాధ్యతలను పంచుకోవడం జరుగుతుంది. మిథున రాశి వారు రావలసిన సొమ్మును రాబట్టుకుంటారు. ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉన్నా ఫలితముంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
వృత్తి, ఉద్యోగాల్లో ఆదరాభిమానాలు బాగా పెరుగుతాయి. మీ పని తీరుకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో మీ వ్యూహాలు, నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఆదాయానికి లోటుండదు కానీ, అనుకోని ఖర్చులు పెరగడానికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఆస్తి వివాదం ఒకటి సానుకూలపడుతుంది. ఆర్థిక వ్యవహారాలన్నీ లాభసాటిగా పూర్తవుతాయి. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థిక సహాయం చేస్తారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.
ఉద్యోగ జీవితంలో ఒత్తిడి, శ్రమ బాగా తగ్గుతాయి. సహచరులతో అదనపు బాధ్యతలను పంచుకోవడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, వృథా ఖర్చులు, అనకోని ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.
అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు అంచనాలకు మించి లాభిస్తాయి. రావలసిన సొమ్మును రాబట్టుకుంటారు. ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉన్నా ఫలితముంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో పెట్టుబడికి తగ్గ లాభార్జన చేస్తారు. ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో ఘన విజయాలు సాధిస్తారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. సహోద్యోగులతో సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఏ ప్రయత్నం చేపట్టినా కృషికి తగిన ఫలితం అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలను పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విద్యార్థులకు కొద్దిపాటి శ్రమ తప్పదు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
మీ ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కొద్దిగా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు రెట్టింపవుతాయి. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండడంమంచిది. బంధుమిత్రులకు మీ సలహాలు, సూచనలు బాగా ఉపకరిస్తాయి. విద్యార్థులకు శ్రమ తప్పదు.
ఉద్యోగ జీవితంలో అనుకూలతలు, ఆదరాభిమానాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అదనపు లాభాలు అందుకుంటారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది.
వృత్తి, ఉద్యోగాల్లో మీ ఆలోచనలు, ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. వ్యాపారాలలో అంచనాలకు మించిన లాభాలు గడించే అవకాశం ఉంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫల మవుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్త వింటారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక సమస్యల నుంచి ఊరట లభిస్తుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు.
వృత్తి ఉద్యోగాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ముఖ్య మైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆశించిన స్థాయిలో సంపాదన పెరిగే అవకాశం ఉంది. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ, అనవసర ఖర్చులు తప్పకపోవచ్చు. ఆర్థికపరంగా ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులు ఆశించిన విజయాలు సాధిస్తారు.
ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఆరోగ్య సమస్యలు కొద్దిగా తగ్గుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు తేలికగా పూర్తవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి బాగా గట్టెక్కుతారు. ఉచిత సహాయాలు, వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. విద్యార్థులు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించే అవకాశం ఉంది.
ఆర్థిక విషయాల్లో కాస్తంత ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. వృత్తి, ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. అయితే, ఆర్థిక పరిస్థితి గతం కంటే కాస్తంత మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగం లభించే అవ కాశం ఉంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. విద్యార్థులకు కొద్దిపాటి శ్రమ తప్పకపో వచ్చు.
ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్యలు కొద్దిగా పరిష్కారం అవుతాయి. లాభదాయకమైన స్నేహాలు ఏర్పడతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో పురోగతి సాధిస్తారు. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభించే అవకాశం ఉంది.
వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. సహోద్యోగుల బాధ్యతలను కూడా నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాల్లో పోటీ పెరిగే సూచనలున్నాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యం పరవాలేదు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. కొద్ది శ్రమతో విద్యార్థులు పరీక్షల్లో నెగ్గే అవకాశం ఉంది.