
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): గురు, కుజుల అనుకూలత కారణంగా ఒకటి రెండు శుభ యోగాలు పట్టే అవకాశం ఉంది. ఉద్యో గంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బలం పుంజుకుంటాయి. ఆర్థిక పరిస్థితిసంతృప్తి కరంగా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశముంది. వృథా ఖర్చుల్ని తగ్గిం చుకోవడం మంచిది. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే సూచనలున్నాయి. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. నిరుద్యోగులకు శుభవార్త అందు తుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. ఉద్యోగ జీవితంలో శ్రమాధిక్యత ఉంటుంది. అధికారులు అత్యధికంగా ప్రాధాన్యం ఇస్తారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. కుటుంబ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవ హారాల్ని నిదానంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రయా ణాలు లాభిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందు తుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి. ఆదాయ వృద్ది ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. ఆరోగ్యానికి లోటుండదు. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి ఆశించిన లాభాలని స్తాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. కొద్ది శ్రమతో విద్యార్థులు విజయాలు సాధి స్తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. వ్యాపారంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడు తుంది. ఎటువంటి ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. బంధుమిత్రుల నుంచి కొద్దిగా ఇబ్బందులుంటాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. రాదనుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో వసూలవుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్ల లబ్ధి పొందుతారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా కొద్దిపాటి పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఇతరుల వ్యక్తి గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి చాలావరకు తగ్గుతుంది. విద్యా ర్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం పరవాలేదు. ఆశించిన శుభవార్తలు వింటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆర్థిక పరిస్థితి సజావుగా సాగిపోతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. పెరిగే అవకాశాలున్నందువల్ల గృహ, వాహన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాలు సఫలం అవుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారాల్లో మీ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): గ్రహ బలం చాలావరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలు కొత్త పుంతలు తొక్కుతాయి. వ్యాపారాల్లో మీ ఆలోచనలు, వ్యూహాలు లాభాలను పెంచుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగు పడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సజావుగా సాగిపోతాయి. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. ఆదాయంలో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. ఇతరుల వివాదాల్లో జోక్యం చేసు కోవద్దు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలకు సరైన పరిష్కారం దొరుకుతుంది. ఆస్తి వ్యవహారాలు సానుకూలపడతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు రెట్టింపు ఫలితాలుంటాయి. వ్యక్తిగత సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసు కుంటాయి. వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. కొద్ది శ్రమతో విద్యార్థులు బాగా రాణిస్తారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): రోజంతా చాలావరకు సానుకూలంగా గడిచిపోతుంది. ఆర్థిక లావాదేవీలు పూర్తి స్థాయిలో సత్ఫలి తాలనిస్తాయి. కుటుంబంలో తప్పకుండా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయంలో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగి పోతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా ప్రోత్సాహకాలు, ప్రతిఫలాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఆర్థిక పరి స్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో అనుకున్న పను లన్నీ పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ముఖ్యమైన వ్యవహారాలను కొద్ది శ్రమతో పూర్తి చేయడం జరుగుతుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి కొద్దిపాటి ప్రతికూలతలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు, ఇతర కార్యకలాపాలు వృద్ది చెందుతాయి. ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగు తుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. విద్యార్థులకు సమయం బాగుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ఆద రణ లభిస్తుంది. ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన ప్రయోజనాలుంటాయి. తలపెట్టిన పనుల న్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృథా ఖర్చులకు కళ్లెం వేయడం మంచిది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు కొద్దిగా శ్రమ తప్పకపోవచ్చు.