Leadership Astrology: ఈ రాశుల వారికి నాయకత్వం యోగంతో ప్రమోషనల్స్ దక్కే ఛాన్స్.. అందులో మీరు ఉన్నారా?

| Edited By: Janardhan Veluru

Mar 25, 2023 | 3:06 PM

గ్రహాలు అన్నిటికీ రాజు అయినటువంటి రవి లేదా సూర్యుడు సహజమైన నాయకుడు. జాతక చక్రంలో రవి బలంగా ఉన్న పక్షంలో ఆ జాతకుడు తప్పకుండా తన రంగంలో నాయకుడు అవ్వటానికి, ఉన్నత స్థితికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది.

Leadership Astrology: ఈ రాశుల వారికి నాయకత్వం యోగంతో ప్రమోషనల్స్ దక్కే ఛాన్స్.. అందులో మీరు ఉన్నారా?
Telugu Astrology
Image Credit source: TV9 Telugu
Follow us on
జ్యోతిష శాస్త్రం ప్రకారం రవి గ్రహం నాయకత్వానికి ప్రధాన కారకుడు. గ్రహాలు అన్నిటికీ రాజు అయినటువంటి రవి లేదా సూర్యుడు సహజమైన నాయకుడు. జాతక చక్రంలో రవి బలంగా ఉన్న పక్షంలో ఆ జాతకుడు తప్పకుండా తన రంగంలో నాయకుడు అవ్వటానికి, ఉన్నత స్థితికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆయా రాశుల అధిపతిని బట్టి కూడా నాయకత్వం అనేది ఆధారపడి ఉంటుంది.
నాయక రాశులు
రాజకీయాలు, వాణిజ్య సంస్థలు, రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో రవి నాయకత్వం 100% కనిపిస్తుంది. చంద్ర గ్రహం కళలు, వైద్యం, పరిశోధన, విద్యాసంస్థలు వంటి రంగాలలో తన నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తాడు. కుజుడు న్యాయ శాస్త్రం, శస్త్ర చికిత్సలు, మద్యం, పెట్రోల్, భూమి, ఆస్తులు వంటి విషయాలకు నాయకత్వం వహిస్తాడు. రాహు కేతువులు అక్రమాలు అవినీతి అన్యాయాలకు సంబంధించిన అన్ని రంగాలలోనూ నాయకత్వాన్ని ప్రదర్శిస్తారు. శని సామాజిక సేవ, ప్రజాస్వామ్యం, భాగస్వామ్య వ్యాపారాలు తదితర రంగాలలో తన సత్తా చూపిస్తాడు. శుక్రుడు కళలు, శృంగారం, ఇల్లు వాహనాలు, భాగస్వామ్యం వంటి విషయాలలో నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తాడు. ఇక గురువు విద్య, ప్రవచనాలు, బోధన, ఆర్థిక వ్యవహారాలు, రియల్ ఎస్టేట్, విదేశీ సంబంధ వ్యాపారాలు వంటి విషయాలలో నాయకుడిగా వ్యవహరిస్తాడు. బుధుడు టెక్నాలజీ టెక్నికల్ క్రీడలు ఇంజనీరింగ్ సాహిత్యం రచన వ్యాసంగం వంటి రంగాలలో జాతకులను ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాడు.
సహజ నాయకత్వం
జాతక చక్రంలో మేష, సింహ, ధనురాసులు సహజమైనటువంటి నాయకత్వ రాశులు. ఈ రాశుల జాతకులలో నాయకత్వం చేపట్టాలన్న ఆకాంక్ష మిగిలిన రాశుల కంటే కాస్తంత ఎక్కువగా ఉంటుంది. అంటే యాంబిషన్ ఎక్కువ అన్నమాట. ఇతర రాశుల వారు నాయకత్వం కోసం ఓపికగా నిరీక్షిస్తున్న సమయంలో ఈ మూడు రాశుల వారు నాయకత్వాన్ని ఏదో విధంగా చేజిక్కించుకునే ప్రయత్నంలో ఉంటారు. వృషభం, కన్య, మకర రాశి వారు సాధారణంగా అందరినీ కలుపుకుని పోయే మనస్తత్వం కలవారు. అందువల్ల నాయకత్వం లభించినప్పటికీ తమ సేవా తత్వాన్ని పక్కన పెట్టడం జరగదు.
మిధునం, తుల, కుంభ రాశి వారు తమ తెలివి తేటలతో దూర దృష్టితో నాయకత్వం మీద కన్ను వేసి ఉంచుతారు. కొంత ఆలస్యం అయినప్పటికీ నాయకత్వం తమను తప్పకుండా వరిస్తుందని గట్టి నమ్మకంతో ఉంటారు. కర్కాటకం, వృశ్చికం, మీనరాశుల వారు తమ ప్రతిభను అధికారులు గుర్తించి మెచ్చుకోవాలని భావిస్తారు. నిజానికి ఈ రాశుల వారు నాయకత్వంలో కంటే రెండవ స్థానంలోనే లేదా తెర వెనుక బాధ్యతలతోనే ఎక్కువగా రాణిస్తుంటారు.
ప్రస్తుత పరిస్థితి
ఇక ప్రస్తుత విషయానికి వస్తే, మేష సింహ ధనస్సు రాశుల వారికి ఈ ఏడాది విశేషంగా బ్రహ్మాండంగా నాయకత్వ యోగం పట్టబోతోంది. ఏప్రిల్ 23 తర్వాత నుంచి ఈ రాశి వారికి బాధ్యతలు పెరగటం అధికారం దక్కడం వంటివి తప్పకుండా జరుగుతాయి అని చెప్పవచ్చు.
మేష రాశి
ఈ రాశి వారు ఒక పెద్ద సంస్థలో అధికారం లేదా నాయకత్వం చేపట్టడం ఖాయం అని చెప్పాల్సి ఉంటుంది. సరికొత్త పథకాలు లేదా ప్రాజెక్టులు వీరి ఆధీనంలోకి వచ్చి సకాలంలో విజయ వంతంగా పూర్తి అవుతాయి. వీరి ఆలోచనలు, నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. వీరి మీద వీరు పనిచేసే సంస్థ ఆధారపడటం గానీ, వీరి కారణంగా అది అభివృద్ధి చెందడం కానీ జరుగుతుంది.
సింహ రాశి
ఈ ఏడాది ఈ రాశికి చెందిన వారు ఎక్కువగా రాజకీయాలు, సామాజిక సేవ, రియల్ ఎస్టేట్ వంటి ప్రజా సంబంధమైన రంగాలలో నాయకులు లేదా ఉన్నత అధికారులు కావడానికి అవకాశం ఉంది. వీరి ద్వారా సమాజం ఎంతగానో ప్రయోజనం పొందుతుంది. అందరికీ మీరు సలహాలు, సూచనలు నచ్చుతాయి. నిజానికి వీరు ఏ రంగంలోనూ లేకపోయినా వీరి చుట్టూ జనం చేరటానికి అవకాశం ఉంది.
ధనుస్సు రాశి
ఈ రాశి వారు వృత్తిపరంగా, వ్యాపార పరంగా అత్యున్నత స్థానానికి చేరడం లేదా నాయకులు కావడం జరిగే సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నా తప్పకుండా జనాన్ని అజమా యిషి చేసే స్థితిలో ఉండటం జరుగుతుంది. రాజకీయాలు, టీచింగ్, రియల్ ఎస్టేట్, వైద్యం తదితర రంగాలలో ఉన్నవారు అయితే వీరికి మరింత ఎక్కువగా అధికార యోగం పడుతుంది. వీరికి కిందిస్థాయి వారి నుంచి కూడా మంచి సహాయ సహకారాలు లభిస్తాయి.
(Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..)