Wealth Astrology: కీలక గ్రహాలు అనుకూలం.. 2025లో ఆస్తిపాస్తులు కూడబెట్టే రాశులు ఇవే..!
Telugu Astrology: జ్యోతిష్య శాస్త్రం శని, గురువు, కుజుడు, రాహుకేతువుల వంటి ప్రధానమైన గ్రహాల మార్పు వల్ల కొన్ని రాశుల వారు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. గ్రహాల అనుకూలత వల్ల ఆస్తి, ఇల్లు, స్థలం కొనుగోలు అవకాశం ఉంది. ఈ రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. మరి ఇందులో మీ రాశి కూడా ఉందా ఇక్కడ చెక్ చేసుకోండి.

Wealth AstrologyImage Credit source: Getty
జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి సంపద మీదా, ఆస్తిపాస్తుల మీదా మక్కువ ఎక్కువ. వీరి దృష్టి ఎక్కువగా ఆదాయాన్ని పెంచుకోవడం మీదే ఉంటుంది. ఈ ఏడాది శని, గురువు, కుజుడు, రాహుకేతువుల వంటి ప్రధానమైన గ్రహాల మార్పు వల్ల ఈ రాశుల వారి కోరికలు, ఆశలు, లక్ష్యాలు పూర్తయ్యే అకాశం ఉంది. సాధారణంగా గురు, కుజులు అనుకూలంగా ఉన్న రాశుల వారు ఆస్తిపాస్తులు ఎక్కువగా సమకూర్చుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్న రాశులు – మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. వీరు ఈ ఏడాది చివరి లోగా ఇల్లు, స్థలం, పొలం, ఆస్తిపాస్తులు కొనుక్కోవడం వంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశికి చతుర్థ స్థానంలో రాశ్యధిపతి కుజుడు, లాభ స్థానంలో రాహువు సంచారం చేస్తున్నందు వల్ల తప్పకుండా సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఇల్లు కట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై భూలాభాలు కలుగుతాయి. స్వప్రయత్నంతో స్థలాలు కొనే అవకాశం కూడా ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. జీవిత భాగస్వామి వైపు నుంచి కూడా ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరిగే సూచనలున్నాయి.
- వృషభం: ఈ రాశికి శని, గురు, కుజులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆస్తిపాస్తులను పెంచుకోవడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. అనేక విధాలుగా సిరిసంపదలు వృద్ధి చెందే అవ కాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు, మదుపులు, పెట్టుబడులు అత్యధికంగా లాభాలనిచ్చే అవకాశం ఉంది. కుజుడి అనుకూలత వల్ల ఆస్తి లాభంతో పాటు తప్పకుండా గృహ యోగం పడుతుంది. తల్లి వైపు నుంచి విలువైన ఆస్తి సంక్రమించే సూచనలు ఉన్నాయి.
- సింహం: ఈ రాశివారికి గురు, కుజులు బాగా అనుకూలంగా ఉండబోతున్నందువల్ల ఆస్తిపాస్తులను సమ కూర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సొంత ఇంటి ఆలోచన తప్పకుండా ఫలించే అవకాశం ఉంది. ఒకటి రెండు స్థలాలను సమకూర్చుకోవడం జరుగుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమై ఆస్తి లాభం కలుగుతుంది. ప్రభుత్వపరంగా స్థలం గానీ, ఇల్లు గానీ లభించే అవకాశం కూడా ఉంది. తండ్రి వైపు నుంచి కొద్దిపాటి ఆస్తి లభించే సూచనలున్నాయి.
- తుల: ఈ రాశికి శని, గురు, కుజులతో పాటు రాశ్యధిపతి శుక్రుడు కూడా అనుకూలంగా ఉండబోతు న్నందువల్ల తప్పకుండా ఆస్తుల్ని సమకూర్చుకోవడం, పెంచుకోవడం వంటివి జరుగుతాయి. వారసత్వంగా భూలాభం కలుగుతుంది. జీవిత భాగస్వామి వైపు నుంచి కూడా ఆస్తి లాభం లేదా గృహ లాభం కలిగే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరిలోగా సొంత ప్రయత్నంతో సొంత ఇంటిని అమర్చుకోవడం జరుగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది.
- ధనుస్సు: ఈ రాశికి గురువు, రాహువు, కుజుడు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల తప్పకుండా గృహ లాభం కలుగుతుంది. ఆస్తిపాస్తుల క్రయ విక్రయాల్లో అత్యధికంగా లాభాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ వంటివి బాగా లాభిస్తాయి. భూలాభాలు, ఆస్తి లాభాలు కలుగుతాయి. ఆస్తివివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఉద్యోగపరంగా గృహ సౌకర్యం ఏర్పడడానికి కూడా అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో ఆర్థికంగా పురోగతి చెందుతారు. తల్లి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది.
- మకరం: ఈ రాశివారికి ఈ ఏడాదంతా శని, రాహు, కుజులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడే అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ది చెందుతుంది. ఆస్తిపాస్తులు సమకూరుతాయి. స్థిరాస్తులపై భారీగా పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. సొంత ఇంటి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి వస్తుంది. ఇల్లు లేదా ఫ్లాట్ కొనడానికి బాగా అవకాశం ఉంది. భూలాభం కలిగే సూచనలున్నాయి.