AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jupiter Transit 2025: గురువు అనుగ్రహంతో వారికి అనేక యోగాలు..! 12 రాశుల వారికి ఇలా..

Guru Gochar 2025: ఈ నెల(మే) 25న గురువు వృషభ రాశిని వదిలిపెట్టి మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది. ప్రతి రాశిలోనూ ఏడాదిపాటు ఉండే గురువు మిథున రాశిలో 2026 జూన్ 2వ తేదీ వరకూ కొనసాగుతాడు. ఉత్తరాదివారి పంచాంగాల ప్రకారం ఈ నెల 15వ తేదీనే గురువు మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది. గురువు మే 25న మిథున రాశిలో ప్రవేశిస్తున్నప్పటికీ పది రోజుల ముందు నుంచే రాశి మార్పు ఫలితాలనివ్వడం ప్రారంభమవుతుంది. గురువు మిథున రాశి ప్రవేశం అనుకూలంగా లేనివారు ప్రతి రోజూ దత్తాత్రేయ స్తోత్రాన్ని చదువుకోవడంతో పాటు, చదువు చెప్పిన గురువులు, మంత్రోపదేశం చేసిన గురువులు, తల్లితండ్రుల పట్ల ఆదరాభిమానాలతో వ్యవహరించడం వల్ల దుష్ఫలితాలు తగ్గి శుభ ఫలితాలు పెరుగుతాయి.

TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: May 12, 2025 | 12:25 PM

Share
మేషం: ఈ రాశికి భాగ్య, వ్యయాధిపతిగా అత్యంత శుభుడైన గురువు ఈ రాశికి తృతీయ స్థానమైన మిథున రాశిలో ప్రవేశించడం వల్ల ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. కొద్దిగా ఆత్మ విశ్వాసం, ధైర్యం సన్నగిలే అవకాశం ఉంది. అయినప్పటికీ ఈ రాశివారికి ఆర్థికంగా, వృత్తి, ఉద్యోగాలపరంగా, సామాజికంగా హోదా, స్థాయి పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అందలాలు ఎక్కడం జరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది.

1 / 12
వృషభం: ఈ రాశికి ధన స్థానంలో గురువు సంచారం చేయడం వల్ల అనేక విధాలుగా ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆదాయపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. నిరుద్యోగులకు మంచి జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు చోటు చేసుకుంటాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.

2 / 12
మిథునం: ఈ రాశిలో గురువు సంచారం వల్ల ఆర్థికంగా, వృత్తి, ఉద్యోగాలపరంగా ఆశించిన పురోగతి ఉంటుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది.

3 / 12
కర్కాటకం: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన గురువు వ్యయ స్థాన సంచారం వల్ల ఆదాయాన్ని బాగా మదుపు చేయడం, పెట్టుబడులు పెట్టడం వంటివి జరుగుతాయి. శుభ కార్యాల మీదా, దైవకార్యాల మీదా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది.

4 / 12
సింహం: ఈ రాశివారికి లాభ స్థానంలో ఉన్న గురువు సంచారం వల్ల అనేక విధాలుగా అదృష్టాలు కలుగుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూల సమయం. విదేశాల నుంచి వృత్తి, ఉద్యోగాలపరంగా ఆశించిన శుభ వార్తలు అందుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది.  ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది.  నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది.

5 / 12
కన్య: ఈ రాశికి దశమ స్థానంలో గురువు సంచారం వల్ల ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా వృద్ధి చెందుతుంది. గృహ, వాహన యోగాలు పట్టడానికి అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగ లభిస్తుంది. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.

6 / 12
తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో గురువు ప్రవేశించడం వల్ల జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో లాభాల పంట పండుతుంది. ఉద్యోగంలో అధికార లాభం ఉంటుంది. మంచి ఉద్యోగంలో మారడానికి కూడా అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన స్థాయిలో ఉద్యోగం లభిస్తుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. అనేక విధాలుగా ధన యోగాలు కలుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. వారసత్వ సంపద లభిస్తుంది.

7 / 12
వృశ్చికం: ఈ రాశికి అష్టమంలో ధనాధిపతి గురువు సంచారం వల్ల, సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవడం లేదా అటువంటి వ్యక్తితో ప్రేమలో పడడం జరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాలు వృద్ధి చెందుతాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని భారం బాగా పెరుగుతుంది. ప్రతి పనిలోనూ శ్రమాధిక్యత ఉంటుంది. ఆదాయానికి లోటుండదు కానీ, ఖర్చులు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా తగ్గుతాయి.

8 / 12
ధనుస్సు: రాశ్యధిపతి గురువు సప్తమ స్థానంలో ప్రవేశించడం వల్ల మనసులోని కోరికలు, ఆశలు చాలా వరకు నెరవేరుతాయి. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న ఉద్యోగులు, నిరుద్యోగుల కల నెరవేరుతుంది. సొంత ఇల్లు అమరుతుంది. అంచనాలకు మించి ఆదాయం వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఇష్టమైన వ్యక్తితో పెళ్లి కుదిరే అవకాశం ఉంది.

9 / 12
మకరం: ఈ రాశివారికి ఆరవ స్థానంలో ధన కారకుడు గురువు ప్రవేశించడం వల్ల ఆర్థిక సమస్యలు క్రమంగా పరిష్కారమవుతాయి. ఆదాయం కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల చాలా తక్కువగా లాభాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభి స్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభిస్తుంది.

10 / 12
కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో గురువు ప్రవేశం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపు లభించి అందలాలు ఎక్కుతారు. వృత్తి, వ్యాపారాలను లాభాల బాట పట్టిస్తారు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత, కుటుంబ సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీల వల్ల అత్యధికంగా లాభాలు కలుగుతాయి. ఆదాయం, రాబడి వృద్ధి చెందుతాయి.

11 / 12
మీనం:ఈ రాశికి నాథుడైన గురువు చతుర్థ స్థానంలో ప్రవేశించడం వల్ల ఆస్తిపాస్తులకు సంబంధించిన సమస్యలు, వివాదాలు పూర్తిగా పరిష్కారమై ఊరట లభిస్తుంది. గురువు పూర్తి స్థాయిలో శుభ ఫలితాలనివ్వడం మొదలవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అన్నివిధాలుగానూ ఆదాయం పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమై మనశ్శాంతి ఏర్పడుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శీఘ్ర పురోగతి ఉంటుంది.

12 / 12