జ్యోతిషశాస్త్రంలో తొమ్మిది గ్రహాలున్నాయి. ఈ గ్రహాలకు రాజు సూర్యుడుగా జ్యోతిష్య శాస్త్రంలో పరిగణిస్తారు. ఎవరి జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటాడో వారి జీవితంలో అనేక రకాల సమస్యలు వస్తాయని నమ్ముతారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం.. వారంలో ప్రతి రోజు ఒకొక్క దేవీ దేవతలకు అంకితం చేయబడింది. ఆయా దేవుళ్లను ఆయా రోజున అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఆదివారం సూర్య భగవానునికి అంకితం చేయబడింది. అందుకనే ప్రత్యేక దైవం సూర్యుడిని పూజించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున సూర్యుడుకి సంబంధించిన చర్యలు తీసుకోవడం ద్వారా సంతోషంగా ఉంటారు. ప్రత్యేక ఆశీర్వాదాన్ని పొందుతారు.
ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు ఆటంకాలు ఏర్పడడం లేదా అనవసరమైన సమస్యలు రావడం జరుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జాతకంలో దోషం కూడా దీని వెనుక ప్రధాన కారణం కావచ్చు. ముఖ్యంగా మీ జాతకంలో సూర్యునికి సంబంధించిన ఏదైనా దోషం ఉంటే, ఖచ్చితంగా ఆదివారం రోజున కొన్ని పరిహారాలు చేయండి. దీంతో మీ జీవితంలో వచ్చే కష్టాలు తొలగిపోతాయి. జాతకంలో బలహీనమైన సూర్యుడు బలపడడానికి సంబంధించిన కొన్ని చర్యలు తెలుసుకుందాం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).