నవగ్రహాలకు అధిపతి సూర్యుడు. జ్యోతిషశాస్త్రంలో, హిందువుల జీవిత ఆచారాలలోనూ నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సూర్యుడికి అధిపతి అగ్ని.. సూర్యుడు ఆత్మకు కారకంగా పరిగణించబడ్డాడు. దీంతో ఎవరి జాతకంలో సూర్యుడు బలంగా ఉంటె.. వారు ఎల్లప్పుడూ.. సమాజంలో ఉన్నత స్థానం, గౌరవం తో పాటు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారని నమ్మకం. సూర్యుడు ప్రతి నెలా తన గమనాన్ని మార్చుకుంటూ ఒకొక్క రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 16, 2022న, సూర్యుడు వృశ్చిక రాశిని వదిలి ధనుస్సు రాశిలో ప్రవేశించనున్నాడు.. జనవరి 16 వరకు సూర్యుడు ధనుస్సు రాశిలో ఉంటాడు. దేవగురువు బృహస్పతి ధనుస్సు రాశికి అధిపతి.. కనుక జ్యోతిషశాస్త్రంలో చాలా శుభప్రదంగా ఈ రాశిని భావిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరి నెలలో, సూర్యుని రాశి మార్పు కారణంగా, కొన్ని రాశుల వారికి చాలా ప్రయోజనాలు.. మరొకొందరికి నష్టాన్ని కలిగించవచ్చు. ముఖ్యంగా ఈ 3 రాశుల వారు సూర్యుని రాశి మార్పు వలన చాలా ప్రయోజనాలను పొందవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మేషరాశి:
ఈ సంవత్సరం డిసెంబర్ 16న సూర్యుడు తన రాశిని గమనాన్ని మార్చుకోనున్నాడు. సూర్యుని సంచార కారణంగా ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వారికి ఈ మార్పు శుభఫలితాలను ఇస్తుంది. పరీక్షలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి శుభవార్త పొందే అవకాశం ఉంది. అంతేకాదు వ్యాపార సంబంధిత ప్రయాణాలలో ఈ రాశివారికి లాభాలు పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులకు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి లేదా విదేశాల్లో చదువుకోవాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు.
తులరాశి:
తుల రాశి వారికి సూర్యుడు పదకొండవ ఇంటికి అధిపతి. డిసెంబర్ 16న ఈ రాశివారికి మూడవ ఇంట్లో సూర్య సంచారము జరగబోతోంది. అటువంటి పరిస్థితిలో, సూర్యుని దృష్టి అదృష్టం స్థానంలో ఉంటుంది. తుల రాశి వారికి శుభం కలుగుతుంది. ఉద్యోగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు పూర్వీకుల ఆస్తిని పొందే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వ్యక్తులు పెట్టుబడి నుండి ప్రయోజనం పొందుతారు. వ్యాపారస్తులు మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు. ఈ రాశివారు సంతోషంగా గడుపుతారు.
కుంభ రాశి
సూర్యుడు కుంభ రాశికి ఏడవ ఇంటికి అధిపతిగా పరిగణించబడతాడు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 16న ధనుస్సు రాశిలో సూర్యుని సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆకస్మిక లాభాన్ని అందుకునే అవకాశం ఉంది. విద్యార్థులకు శుభప్రదం.. అన్ని రకాల కోరికలను నెరవేరుస్తుంది. భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి శుభఫలితాలను ఇస్తుంది. భార్యాభర్తలిద్దరి మధ్య సహకారం లభిస్తుంది. మీరు పెట్టుబడి నుండి మంచి లాభాలను పొందవచ్చు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)