జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సూర్య భగవానుడు అన్ని గ్రహాలకు అధిదేవత. ఒక వ్యక్తి గ్రహాలు, రాశులు అనుకూలమైన స్థితిలో ఉన్నప్పుడు.. ఆ వ్యక్తి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితాంతం సుఖ సంతోషాలతో జీవిస్తాడని నమ్మకం. అందుకనే గ్రహాల శాంతికోసం అనుకూల దృష్టిని కోరుతూ రకరకాల పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తారు కొందరు. అయితే సూర్యుడిని జ్యోతిష శాస్త్రంలో అధికంగా రవి అని వ్యవహరిస్తారు. మనిషి సూర్యుని ప్రభావం ఉన్న వారు ఆత్మాభిమానం, చురుకు తనం కలిగి ఉంటారు. కీర్తి, బలం, గర్వం , గౌరవానికి చిహ్నం. అయితే మనిషి జాతకంలో రవి నీచ స్థితిలో ఉంటే ఆ వ్యక్తి మార్గం కష్టాలతో నిండి ఉంటుంది. ఆదివారం సూర్యుడి కోసం ఉపవాసం ఉండి పూజించడం ద్వారా సంతుష్టుడవుతాడు. సూర్యభగవానుని ప్రసన్నం చేసుకోవడానికి ఇతర మార్గాలు ఏంటో తెలుసుకుందాం.
సూర్యుడు రాశి చక్రంలో బలహీనంగా ఉన్నాడని ఎలా తెలుసుకోవాలంటే:
మీ జీవితంలో సూర్యుడు బలహీనంగా ఉంటే.. మీరు మీ స్వంత తండ్రి, గురువుకి మధ్య వివాదం నెలకొంటుంది. మీరు ఎటువంటి కారణం లేకుండా కోపంగా ఉంటారు. అహంకార భావన ఉంటుంది. అన్ని వేళలా బలహీనంగా ఉంటారు. ఏదైనా పని చేయగలరు. మీ కుటుంబంలో ఆస్తికి సంబంధించిన వివాదం ఉండవచ్చు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..