Telugu News Astrology Shukra–Shani Conjunction in Pisces: Major Life Changes for These Zodiac Signs
శని, శుక్రుల యుతి.. వారి జీవితాల్లో కలలో కూడా ఊహించని అనూహ్య మార్పులు..!
మార్చి 2 నుంచి 26 వరకు మీన రాశిలో శుక్రుడు–శని యుతి ఏర్పడుతోంది. ఈ గ్రహ సంయోగం ప్రభావంతో మేషం, సింహం, తుల, వృశ్చికం, మకరం, మీన రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కులాంతర, మతాంతర వివాహాలు, విదేశీ ఉద్యోగ అవకాశాలు, సంప్రదాయ విరుద్ధ నిర్ణయాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
కళత్ర కారకుడు, సిరిసంపదలకు, భోగభాగ్యాలకు, సుఖ సంతోషాలకు కారకుడైన శుక్రుడితో శనీశ్వరుడు యుతి చెందితే కొన్ని రాశులవారి జీవితాల్లో సమూలమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ రెండు గ్రహాలు మార్చి 2 నుంచి 26 వరకు మీన రాశిలో యుతి చెందడం జరుగుతుంది. సాధారణంగా కులాంతర, మతాంతర వివాహాలు, విదేశాల్లో ఉద్యోగాలు, సంప్రదాయ విరుద్ధ వ్యవహారాలు, అసాధారణ వ్యాపారాలు వంటివి జరిగే అవకాశం ఉంటుంది. మేషం, సింహం, తుల, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి ఇటువంటి అనుభవాల్లో కొన్న యినా తప్పకపోవచ్చు. మిత్రులు పక్కదారి పట్టించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
మేషం: మార్చి 2 నుంచి ఈ రాశివారికి వ్యయ స్థానంలో శుక్ర, శనులు యుతి చెందడం వల్ల కులాంతర ప్రేమలు, కులాంతర వివాహాలు జరగడానికి బాగా అవకాశం ఉంది. అనుకోకుండా జీవనశైలి, ఆచార సంప్రదాయాలు మారిపోవడం జరుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యో గాలు సంపాదించుకునే అవకాశం ఉంది. ఉద్యోగులు తమకు ఏమాత్రం సంబంధించిన వ్యాపారాలు చేపట్టడం జరుగుతుంది. సాధారణంగా ఏదో ఒక వ్యసనానికి అలవాటు కావడం జరుగుతుంది.
సింహం: ఈ రాశికి అష్టమంలో శుక్ర, శనుల యుతి వల్ల సంప్రదాయ విరుద్ధమైన కార్యకలాపాలు చేపట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కులాంతర వివాహాలకు, కులాంతర ప్రేమలకు బాగా అవకాశం ఉంది. విదేశీయులతో ప్రేమలో పడే అవకాశం కూడా ఉంది. విలాస జీవితానికి అలవాటు పడడం, సరదాలు, వ్యక్తిగత సుఖ సంతోషాల మీద శ్రద్ద పెట్టడం వంటివి కూడా జరుగుతాయి. సుఖప్రదంగా సాగుతున్న దాంపత్య జీవితంలో సమస్యలు తలెత్తవచ్చు. అనవసర పరిచయాలు ఏర్పడవచ్చు.
తుల: రాశ్యధిపతి, కళత్ర కారకుడు అయిన శుక్రుడు షష్ట స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల పాత స్నేహాలను వదిలిపెట్టి కొత్త స్నేహితులను కలుపుకునే అవకాశం ఉంది. శత్రువులతో, నమ్మకద్రోహులతో పరిచయాలు పెంచుకోవడం జరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉన్నప్పటికీ, వృథా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. విలాస జీవితం అలవడుతుంది. అనవసర పరిచయాలు ఏర్పడతాయి. నీతిమంతమైన జీవితానికి స్వస్తి చెప్పి అవినీతి మార్గం పట్టడానికి కూడా అవకాశం ఉంది.
వృశ్చికం: పంచమ స్థానంలో శని, శుక్రులు కలవడం వల్ల కొన్ని సంప్రదాయ విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా కులాంతర వివాహానికి ప్రయత్నించడం జరిగే అవకాశం ఉంది. తమ చదువులకు, నైపుణ్యాలకు సంబందం లేని ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. పిల్లల్లో క్రమశిక్షణ తగ్గడం కానీ, వారితో సమస్యలు తలెత్తడం గానీ జరుగుతుంది. కష్టార్జితంలో ఎక్కువ భాగం మోసగాళ్ల పాలవుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో తప్పటడుగులు వేయడం జరుగుతుంది.
మకరం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో శని శుక్రుల కలయిక వల్ల వృద్ధి యోగం పట్టే అవకాశం ఉన్నప్పటికీ కొన్ని దుర్వార్తలు వినే అవకాశం కూడా ఉంది. జీవితంలో ఏమాత్రం ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటాయి. విదేశాల్లో ఉద్యోగావకాశాలు లభించడం, ఇప్పటికే అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నవారికి స్థిరత్వం లభించడం వంటివి జరుగుతాయి. విదేశీ వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం వంటివి జరిగే అవకాశం కూడా ఉంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.
మీనం: ఈ రాశిలో ఉచ్ఛపట్టిన శుక్రుడితో శనీశ్వరుడు కలవడం వల్ల జీవితం అనుకున్నదొకటి అయిం దొకటి అన్న రీతిలో సాగిపోతుంది. అనుకున్నవేవీ జరగకపోవచ్చు. అనుకోనివి జరగవచ్చు. అను కోకుండా కొన్ని వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యసనాలకు, విలాసాలకు అలవాటుపడే అవకాశం ఉంది. అనవసర పరి చయాలు ఏర్పడతాయి. జీవనశైలిలో మార్పు వస్తుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది.