Shukra Parivartan: నీచ శుక్రుడితో ఆ రాశుల వారికి ధన, అధికార, రాజయోగాలు..!

| Edited By: Janardhan Veluru

Aug 17, 2024 | 9:21 PM

ఈ నెల 26వ తేదీ నుంచి సెప్టెంబర్ 18 వరకూ శుక్రుడు కన్యా రాశిలో నీచబడడం జరుగుతోంది. ప్రేమలు, పెళ్లిళ్లు, శృంగారం, దాంపత్య జీవితం, సంపద, సుఖ సంతోషాలకు కారకుడైన శుక్రుడు నీచబడడం వల్ల కొన్ని రాశులకు నష్టం జరిగే అవకాశం ఉన్నప్పటికీ, మరికొన్ని రాశులకు మాత్రం రాజయోగాలు, ధన యోగాలు, అధికార యోగాలు పట్టే అవకాశం ఉంది.

Shukra Parivartan: నీచ శుక్రుడితో ఆ రాశుల వారికి ధన, అధికార, రాజయోగాలు..!
Zodiac Signs
Follow us on

ఈ నెల 26వ తేదీ నుంచి సెప్టెంబర్ 18 వరకూ శుక్రుడు కన్యా రాశిలో నీచబడడం జరుగుతోంది. ప్రేమలు, పెళ్లిళ్లు, శృంగారం, దాంపత్య జీవితం, సంపద, సుఖ సంతోషాలకు కారకుడైన శుక్రుడు నీచబడడం వల్ల కొన్ని రాశులకు నష్టం జరిగే అవకాశం ఉన్నప్పటికీ, మరికొన్ని రాశులకు మాత్రం రాజయోగాలు, ధన యోగాలు, అధికార యోగాలు పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా వృషభం, మిథునం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మకర రాశుల వారికి ఈ యోగాలు పట్టడం జరుగుతుంది.

  1. వృషభం: రాశ్యధిపతి శుక్రుడు పంచమ కోణంలోన నీచత్వం పొందుతున్నందువల్ల కలలో కూడా ఊహిం చని ఆర్థిక యోగాలను కలిగించే అవకాశం ఉంటుంది. విందులు, విలాసాల్లో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుంది. మంచి మిత్రులు ఏర్పడతారు. పిల్లలు అత్యుత్తమ ఫలితాలు సాధి స్తారు. సంతాన యోగానికి బాగా అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొద్ది ప్రయత్నంతో అత్యధికంగా ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంటుంది.
  2. మిథునం: ఈ రాశికి చతుర్థంలో శుక్రుడి సంచారం వల్ల గృహ, వాహన సౌకర్యాలు లభిస్తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. వారసత్వపు ఆస్తి సంక్రమించే సూచనలున్నాయి. విలాస జీవితం అలవడుతుంది. మంచి పరిచయాలు ఏర్పడ తాయి. ఉద్యోగంలో అధికారులు మీ శక్తి సామర్థ్యాలను గుర్తించి పదోన్నతి కల్పించడం జరు గుతుంది. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు, చేర్పులు చేపట్టి ఆర్థికంగా లబ్ది పొందే అవకాశం ఉంది.
  3. సింహం: ఈ రాశికి ధన స్థానంలో శుక్ర సంచారం వల్ల ఊహించని విధంగా ఆర్థిక యోగాలు పడతాయి. ఆక స్మిక ధన లాభానికి అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. అదనపు ఆదాయాన్ని షేర్లు, చిన్న వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపో తుంది. బంధుమిత్రులతో సమస్యలు పరిష్కారమవుతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు.
  4. వృశ్చికం: ఈ రాశికి లాభ స్థానంలో శుక్ర సంచారం వల్ల వృత్తి, వ్యాపారాలు ఆర్థిక సమస్యలు, నష్టాల నుంచి క్రమంగా బయటపడే అవకాశం ఉంటుంది. మంచి స్నేహాలు ఏర్పడతాయి. లాభదాయక ఒప్పం దాలు చోటు చేసుకుంటాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారమవు తాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఇంట్లో పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. అనారోగ్యాల నుంచి పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది.
  5. ధనుస్సు: ఈ రాశికి దశమ కేంద్రంలో శుక్ర సంచారం వల్ల, ఉద్యోగపరంగా అనేక విధాలైన లాభాలు, ప్రయో జనాలు పొందడం జరుగుతుంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా మంచి అవకాశాలు అంది వస్తాయి. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయం వరిస్తుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేసి, కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. తల్లితండ్రుల నుంచి ఆస్తి లేదా సంపద సంక్రమించే అవకాశం ఉంది.
  6. మకరం: ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఉద్యోగంలో ఆదాయం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా దూర ప్రయాణాలు లేదా విదేశీ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రభుత్వపరంగా గుర్తింపు లభించే అవకాశం ఉంది. మంచి పెళ్లి సంబంధం ఖాయమవు తుంది. ప్రేమలో పడే సూచనలు కూడా ఉన్నాయి. దాంపత్య జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది.