జ్యోతిషశాస్త్రంలో దైత్యగురువు శుక్రదేవుడు ఒక ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడుతున్నాడు. శుక్ర గ్రహం ప్రేమ, అందం, సంపద, కీర్తి , సౌకర్యాన్ని అందించే గ్రహం. శుక్రుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి నిర్దిష్ట సమయంలో ప్రవేశిస్తాడు. అంతేకాదు తన రాశులను క్రమం తప్పకుండా మార్చుకుంటూ ఉంటాడు. ఈ సమయంలో ప్రతి రాశిపై వేర్వేరు ప్రభావాలను కలిగి ఉంటుంది. శుక్రుడు త్వరలో మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారు తమ కెరీర్ , వ్యక్తిగత జీవితంలో అపారమైన ఆనందాన్ని, విజయాన్ని సాధిస్తారు.
ఈ రోజు (డిసెంబర్ 2, 2024) ఉదయం 11:46 గంటలకు శుక్రుడు మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులకు అదృష్టం కలిసి వస్తుంది. అదే సమయంలో ఈ రాశుల వారికీ కొత్త సంవత్సరం 2025 గొప్ప ప్రారంభం అవుతుంది.
వృషభ రాశి: మకరరాశిలో శుక్రుని సంచారం వృషభ రాశి వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది. అంతేకాదు ఈ సంవత్సరంలో చివరి నెల.. దీంతో శుక్ర సంచారం కొత్త సంవత్సరం ప్రారంభం ఈ రాశికి చెందిన వ్యక్తులకు సంతోషాన్నిస్తుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. అంతే కాకుండా ఉద్యోగంలో పదోన్నతి పొందడడమే కాదు కోరుకున్న చోటికి బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశికి చెందిన వ్యక్తులు న్యాయపరమైన విషయాల్లో కూడా విజయం సాధిస్తారు.
మిధున రాశి: మిథునరాశి వారికి శుక్రుని సంచారం చాలా శుభప్రదం, ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మిధున రాశి వారు కొత్త సంవత్సరంలో ఆస్తి లేదా వాహనాలను కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో కొన్ని శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది.
కుంభ రాశి: కుంభ రాశి వారికి శుక్రుని సంచారం అదృష్టాన్ని కలిగిస్తుంది. దీని వల్ల కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. కుంభ రాశి వారికి డిసెంబరు మొదటి వారంలో ఆర్థిక లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు ఈ రాశి వారు తాము చేస్తున్న పనిలో కొన్ని కొత్త బాధ్యతలను పొందవచ్చు. వ్యాపారంలో పెట్టిన మూలధన పెట్టుబడి నుంచి ప్రయోజనం పొందుతారు. వ్యాపారంలో గొప్ప విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు ఈ రాశికి చెందిన వ్యక్తులు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా లభించే అవకాశం ఉంది.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.