Shubh Yoga: వృషభ రాశిలో గురువు.. ఆ రాశుల వారికి శుభ యోగాలు పక్కా..!

| Edited By: Janardhan Veluru

Jul 17, 2024 | 6:59 PM

సాధారణంగా వృషభ రాశిలో ఉన్న గురువు ఏ రాశివారికైనా ఏదో విధంగా శుభ యోగాలు పట్టిస్తాడు. వచ్చే ఏడాది మే ఆఖరు వరకూ వృషభ రాశిలోనే ఉండబోతున్న గురువు వల్ల కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు అనుభవానికి రావడం సహజం. అయితే, గురువు కొన్ని రాశులకు దుస్థానాల్లో ఉన్నా శుభ ఫలితాలనివ్వడం జరుగుతుంది.

Shubh Yoga: వృషభ రాశిలో గురువు.. ఆ రాశుల వారికి శుభ యోగాలు పక్కా..!
Shubh Yoga
Follow us on

సాధారణంగా వృషభ రాశిలో ఉన్న గురువు ఏ రాశివారికైనా ఏదో విధంగా శుభ యోగాలు పట్టిస్తాడు. వచ్చే ఏడాది మే ఆఖరు వరకూ వృషభ రాశిలోనే ఉండబోతున్న గురువు వల్ల కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు అనుభవానికి రావడం సహజం. అయితే, గురువు కొన్ని రాశులకు దుస్థానాల్లో ఉన్నా శుభ ఫలితాలనివ్వడం జరుగుతుంది. వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, మీన రాశులకు గురువు దుస్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ వారి జీవితాల్లో శుభ కార్యాలు జరగడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం వంటివి తప్పకుండా సంభవిస్తాయి.

  1. వృషభం: ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతి, ప్రాధాన్యం పెరగడం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సామాజికంగా కూడా గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. ప్రముఖులతో పరి చయాలు పెరుగుతాయి. చాలా కాలంగా పెండింగులో ఉన్న భూమి పూజ లేక గృహ ప్రవేశం వంటివి తప్పకుండా నెరవేరుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి రావడం, సంతాన యోగం కలగడం వంటివి తప్పకుండా జరుగుతాయి.
  2. మిథునం: ఈ రాశివారికి వ్యయ స్థానంలో గురు సంచారం వల్ల ఇంట్లో చాలా కాలంగా పెండింగులో ఉన్న వివాహ కార్యక్రమం పూర్తయ్యే అవకాశం ఉంది. కొన్ని మొక్కుబడులు తీర్చుకోవడం, తీర్థయా త్రలు చేయడం వంటి శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. పిల్లలు చదువుల్లోనే కాక, వృత్తి, ఉద్యోగాల్లో ఘన విజయాలు సాధించడం జరుగుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. సంతాన యోగానికి కూడా అవకాశం ఉంది. వైద్య ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి.
  3. సింహం: జ్యోతిషశాస్త్రం ప్రకారం, దశమ స్థానంలో గురువు సంచారం చేయడం నష్టదాయకం అవుతుంది. అయితే, ఈ రాశివారికి ఉద్యోగపరంగా పదోన్నతులు లభించడం, అధికారులకు సన్నిహితం కావడం, జీతభత్యాలు పెరగడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కూడా నష్టాల నుంచి బయట పడి లాభాల బాట పడతాయి. ఎక్కువగా తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. నిరుద్యోగులకు లాభ దాయకమైన ఉద్యోగం లభిస్తుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్న ఆశయం నెరవేరుతుంది.
  4. తుల: ఈ రాశికి గురువు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల, ఆకస్మిక ధన లాభానికి అవ కాశం ఉంటుంది. గృహ ప్రవేశం, వివాహం వంటి శుభ కార్యాలు జరిగే సూచనలున్నాయి. పిల్లలకు సంబంధించి కొన్ని కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సంతాన యోగానికి అవ కాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించే సూచనలున్నాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలన్నీ చాలావరకు సఫలం అవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  5. ధనుస్సు: ఈ రాశికి గురువు ఆరవ రాశిలో సంచారం చేస్తున్నప్పటికీ, చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఆర్థిక సమస్యల నుంచి, ఆస్తి వివాదాల నుంచి బయటపడడానికి అవకాశముంది. ఆదాయ వృద్ధికి సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి. కోర్టు కేసులు కూడా సానుకూలంగా పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల సమస్యలు తగ్గిపోతాయి. ఉద్యోగంలో సహోద్యోగులను దాటి ముందుకు వెళ్లడం జరుగుతుంది. గృహ ప్రవేశం చేసే అవకాశం ఉంది. వాహన యోగం పడుతుంది.
  6. మీనం: ఈ రాశికి గురువు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ప్రతి ప్రయత్నమూ నెరవేరే అవ కాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలపరంగానే కాక ఆదాయపరంగా ఊహించని పురోగతి ఉంటుంది. ఇష్ట మైన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. విహార యాత్రలు, తీర్థయాత్రలు పూర్తి చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుంది.