Shani-Shukra Yuti: మార్చి 7న శని, శుక్ర కలయిక.. ఈ 4 రాశులకు చెందిన వారికి లక్కే లక్కు..

|

Feb 29, 2024 | 7:50 AM

శని గ్రహంతో పాటు కొన్ని గ్రహాలు సంవత్సరాలు కూడా ఒకోక్కరాశిలో ఉండగా.. కొన్ని గ్రహాలు రోజుల్లోనే ఒక రాశి నుంచి మరొక రాశిలోకి అడుగు పెడతాయి. ప్రస్తుతం కర్మాధిపతి శనీశ్వరుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ రాశి లోకి మార్చి 07వ తేదీన కుంభ రాశిలోకి శుక్రుడు అడుగు పెట్టన్నాడు. దీంతో కుంభరాశిలో శనీశ్వరుడు శుక్రుడు కలయిక జరగనుంది. దీంతో కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు అత్యధిక ప్రయోజనాలు కలగానున్నాయి. ఇంకా చెప్పాలంటే పట్టిందల్లా బంగారమే.. ఈ రోజు ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం..

Shani-Shukra Yuti: మార్చి 7న శని, శుక్ర కలయిక.. ఈ 4 రాశులకు చెందిన వారికి లక్కే లక్కు..
Venus Saturn Conjunction
Follow us on

ప్రతి వ్యక్తికి తన భవిష్యత్ లో జరిగే మంచి చెడుల గురించి తెలుసుకోవాలని ఉంటుంది. దీంతో కొందరు జాతకం తెలుసుకోవాలని భావించి జ్యోతిష్య శాస్త్రాన్ని ఆశ్రయిస్తే.. మరి కొందరు న్యూమరాలజీని నమ్ముతారు. అయితే వేద జ్యోతిష్య శాస్త్రంలో వ్యక్తుల జాతకం రాశులు, గ్రహాల గమనంబట్టి మంచి చెడులు మారుతూ ఉంటాయి. మొత్తం 12 రాశుల వారి జీవితాన్ని గ్రహాల గమనం ప్రభావితం చేస్తుంది. గ్రహాల్లో అతి నెమ్మదిగా కదిలే గ్రహం శని గ్రహంతో పాటు కొన్ని గ్రహాలు సంవత్సరాలు కూడా ఒకోక్కరాశిలో ఉండగా.. కొన్ని గ్రహాలు రోజుల్లోనే ఒక రాశి నుంచి మరొక రాశిలోకి అడుగు పెడతాయి. ప్రస్తుతం కర్మాధిపతి శనీశ్వరుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ రాశి లోకి మార్చి 07వ తేదీన కుంభ రాశిలోకి శుక్రుడు అడుగు పెట్టన్నాడు. దీంతో కుంభరాశిలో శనీశ్వరుడు శుక్రుడు కలయిక జరగనుంది. దీంతో కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు అత్యధిక ప్రయోజనాలు కలగానున్నాయి. ఇంకా చెప్పాలంటే పట్టిందల్లా బంగారమే.. ఈ రోజు ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం..

కుంభ రాశి: రాశిలోనే శనీశ్వరుడు, శుక్రుడు కలయిక జరగనుంది. వీరి స్నేహం కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తులు ఉన్నత శిఖరాలకు చేరుకోనున్నారు. అంతేకాదు కెరీర్ లో అత్యంత ఉన్నత స్థానానికి చేరుకుంటారు. చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. మానసికంగా సంతోషంగా ఉంటారు. శుక్రుడు శుభ దృష్టితో కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి.

వృషభ రాశి: కుంభరాశిలోకి శుక్రుడు అడుగు పెట్టి.. శనిశ్వరుడితో జతకట్టడం వలన ఈ రాశికి చెందిన వ్యక్తులు పట్టిందల్లా బంగారమే అని చెప్పవచ్చు. ఉద్యోగ, వ్యాపార, వృత్తి రంగాల్లో ఉన్నవారు ఆర్ధికంగా అభివృద్ధిని సాధిస్తారు. కెరీర్ లో పురోగతిని సాధిస్తారు. వ్యాపారస్తులు పెట్టుబడులలో లాభాలను ఆర్జిస్తారు. మొత్తానికి ఈ రాశికి చెందిన వారు కుటుంబంతో సుఖ సంతోషాలతో జీవిస్తారు.

ఇవి కూడా చదవండి

తులా రాశి: ఈ రాశికి చెందినవారు శని, శుక్రుడి కలయికతో ఆర్ధికంగా లాభాలు పొందుతారు. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టాలంటే శుభ సమయం. దీంతో మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తుల సహకారం లభిస్తుంది. దీంతో పదోన్నతిని పొందుతారు. చేసిన పనికి ప్రసంశలు పొందుతారు. ఆధ్యాత్మిక యాత్రల చేసే అవకాశం ఉంది. స్టూడెంట్స్ కు శుభ తరుణం అని చెప్పవచ్చు.

మకర రాశి: ఈ రాశికి చెందిన వారికి శని, శుక్రుల కలయిక లక్కీని తెస్తుంది. భార్యాభర్తల మధ్య బంధం బలపడి సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే శుభ తరుణం అని చెప్పవచ్చు. ఆర్ధికంగా లాభపడి డబ్బులను ఆర్జిస్తారు. ఇల్లు, కారు కొనుగోలు చేయాలనే ప్రయత్నాలు ఫలిస్తాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు