Money Astrology: మీన రాశిలో రాహు సంచారం.. ఆ రాశుల వారికి లక్ష్మీ యోగం పక్కా.. !
వక్ర గ్రహం, పాప గ్రహం అయిన రాహువు ఏ రాశివారికైనా అనుకూలంగా ఉంటే ఆ రాశివారి మీద అనూహ్యంగా కనక వర్షం కురిపిస్తాడు. రాహువును మ్లేచ్ఛ గ్రహంగా కూడా చెబుతారు. అంటే రాహువు అనుకూలంగా ఉన్న పక్షంలో విదేశీ సొమ్ము తినే యోగాన్ని కూడా కలగజేస్తాడు. విదేశీ జీవనానికి కూడా రాహువే కారకుడు. గురువు అధిపతిగా ఉన్న మీన రాశిలో ప్రస్తుతం రాహు సంచారం జరుగుతున్నందువల్ల..
వక్ర గ్రహం, పాప గ్రహం అయిన రాహువు ఏ రాశివారికైనా అనుకూలంగా ఉంటే ఆ రాశివారి మీద అనూహ్యంగా కనక వర్షం కురిపిస్తాడు. రాహువును మ్లేచ్ఛ గ్రహంగా కూడా చెబుతారు. అంటే రాహువు అనుకూలంగా ఉన్న పక్షంలో విదేశీ సొమ్ము తినే యోగాన్ని కూడా కలగజేస్తాడు. విదేశీ జీవనానికి కూడా రాహువే కారకుడు. గురువు అధిపతిగా ఉన్న మీన రాశిలో ప్రస్తుతం రాహు సంచారం జరుగుతున్నందువల్ల వృషభం, మిథునం, కర్కాటకం, తుల, మకరం, మీన రాశుల వారికి రాహువు విదేశీ యోగాన్ని, తద్వారా లక్ష్మీ యోగాన్ని కలుగజేయడం జరుగుతుంది. ఈ ఏడాదంతా రాహువు మీన రాశిలోనే సంచారం చేయడం జరుగుతుంది.
- వృషభం: ఈ రాశివారికి రాహువు లాభస్థానంలో ఉన్నందువల్ల తప్పకుండా విదేశీ సొమ్ముతినే యోగం పడుతుంది. విదేశీ యానానికి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం అయి, విదేశాలకు వృత్తి, ఉద్యోగాల నిమిత్తం వెళ్లడం, డబ్బు సంపాదించుకోవడం ఖాయంగా జరుగుతుంది. లాభ స్థానంలో ఉన్న రాహువు విదేశీ సంపాదనకు వీలు కల్పిస్తాడు. అందువల్ల ఈ రాశి వారికి తప్పకుండా లక్ష్మీ యోగం పట్టే అవకాశం ఉంటుంది. విదేశీ యోగాల్లో గుర్తింపుతో పాటు స్థిరత్వం కూడా లభిస్తుంది.
- మిథునం: ఈ రాశివారికి దశమ స్థానంలో, అంటే వృత్తి, ఉద్యోగాల స్థానంలో రాహు సంచారం జరుగుతు న్నందువల్ల నిరుద్యోగులకు స్వదేశంలో కంటే విదేశాల్లోనే ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కు వగా ఉంటాయి. భారీ జీతభత్యాలతో విదేశాల్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నవారికి ఉద్యోగ స్థిరత్వంతో పాటు నివాస స్థిరత్వం కూడా లభిస్తుంది. అంతేకాక, మీన రాహువు కారణంగా ఈ రాశివారికి విదేశాల్లో గృహ యోగం కలిగే అవకాశం కూడా ఉంది.
- కర్కాటకం: ఈ రాశికి తొమ్మిదవ స్థానంలో, అంటే భాగ్య స్థానంలో రాహువు సంచారం కారణంగా ఈ రాశి వారికి తప్పకుండా విదేశీ యోగం, దానితో పాటు లక్ష్మీ యోగం పట్టడం జరుగుతుంది. సంపద వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఒక దేశంలో స్థిరత్వం సంపాదించడంతో పాటు అనేక దేశాలను సందర్శించే అవకాశం కూడా ఉంది. కొద్ది ప్రయత్నంతో విదేశీ యానానికి సంబంధించిన సమ స్యలు, ఆటంకాలన్నీ తొలగిపోతాయి. స్వదేశంలోనే విదేశీ కంపెనీల్లో పనిచేసే అవకాశం కూడా ఉంది.
- తుల: ఈ రాశివారికి ఆరవ స్థానంలో రాహువు సంచారం జరుగుతున్నందువల్ల ఉద్యోగపరంగా విదేశాల నుంచి అనేక ఆఫర్లు అందే అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ ఉద్యో గాలు లభించడం జరుగుతుంది. ఈ రాశివారికి తప్పకుండా విదేశీ సొమ్ము తినే యోగం ఉంది. విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించడం, విదేశాల్లో స్థిరపడడం, గృహ సౌకర్యాలను ఏర్పాటు చేసు కోవడం వంటివి జరుగుతాయి. విదేశాల్లో ఉద్యోగం సంపాదించడానికి సమయం అనుకూలంగా ఉంది.
- మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో, అంటే ప్రయాణాలు, ప్రయత్నాలకు సంబంధించిన స్థానంలో రాహువు సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారు తప్పకుండా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. విదేశీ అవకాశాల కోసం కొద్ది ప్రయత్నం చేసినా అంచనాలకు మించిన ఫలితం ఉంటుంది. విదేశీ ఉద్యోగాలు, వృత్తుల కారణంగా సంపద బాగా వృద్ధి చెందుతుంది. గృహ యోగం కూడా పడుతుంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలకు ప్రస్తుతం సమయం బాగా అనుకూలంగా ఉంది.
- మీనం: ఈ రాశిలో సంచారం చేస్తున్న రాహువు కారణంగా ఈ రాశివారు తప్పకుండా జల ప్రాంత, తీర ప్రాంత దేశాలకు వృత్తి, ఉద్యోగాల నిమిత్తం వెళ్లే అవకాశం ఉంటుంది. ధన సంపాదనలో అగ్ర స్థానంలో ఉండడం కూడా జరుగుతుంది. విదేశాల్లో కెరీర్ సంబంధమైన జీవితానికి ఎటువంటి భంగమూ ఉండకపోవచ్చు. ప్రస్తుత సమయంలో విదేశీ ఉద్యోగాలకు వెళ్లేవారు ఖాయంగా స్థిర పడడం కూడా జరిగే అవకాశం ఉంది. విదేశీ యానానికి ఎటువంటి ఇబ్బందులూ ఉండక పోవచ్చు.