Shani Pradosh Vratam: రేపే శని ప్రదోష వ్రతం.. ఈ సమయంలో శనిని ఇలా పూజించండి .. శివయ్య అనుగ్రహం మీ సొంతం

|

Aug 30, 2024 | 8:43 PM

ప్రదోష వ్రతం శనివారం నాడు వస్తే దానిని శని ప్రదోష వ్రతం అంటారు. ప్రదోష వ్రతం శివునికి అంకితం చేయబడింది. ఈ రోజున పరమశివుడు, పార్వతి అమ్మవారి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రదోష వ్రతం శనివారం వచ్చింది కనుక శివ పర్వతులతో పాటు శనిశ్వరుడిని కూడా పూజిస్తారు. శని ప్రదోష వ్రతం చెయాడం ద్వారా శని మహాదశ నుండి ఉపశమనం పొంది సుఖం, శాంతులను పొందుతారని నమ్ముతారు. దీనితో పాటు అన్ని రకాల భయాలు, సమస్యలు, బాధలు కూడా దూరమవుతాయి..

Shani Pradosh Vratam: రేపే శని ప్రదోష వ్రతం.. ఈ సమయంలో శనిని ఇలా పూజించండి .. శివయ్య అనుగ్రహం మీ సొంతం
Shani Pradosha Vratam
Follow us on

త్రయోదశి తిథి ప్రతి నెలలో రెండుసార్లు వస్తుంది. ప్రదోష వ్రతాన్ని త్రయోదశి తిథి రెండింటిలోనూ.. ఒకటి శుక్ల పక్షంలోని త్రయోదశి తిథిలోనూ, మరొకటి కృష్ణ పక్షంలోని త్రయోదశి తిథిలోనూ ఆచరిస్తారు. శ్రావణ మాసంలో రెండో ప్రదోష వ్రతం ఆగష్టు 31 శనివారం రోజున జరుపుకోనున్నారు. అందుకే ఈ ప్రదోష వ్రతాన్ని శని ప్రదోష వ్రతంగా జరుపుకుంటారు. ప్రదోష వ్రతం శనివారం నాడు వస్తే దానిని శని ప్రదోష వ్రతం అంటారు. ప్రదోష వ్రతం శివునికి అంకితం చేయబడింది. ఈ రోజున పరమశివుడు, పార్వతి అమ్మవారి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు చేస్తారు.

ప్రదోష వ్రతం శనివారం వచ్చింది కనుక శివ పర్వతులతో పాటు శనిశ్వరుడిని కూడా పూజిస్తారు. శని ప్రదోష వ్రతం చెయాడం ద్వారా శని మహాదశ నుండి ఉపశమనం పొంది సుఖం, శాంతులను పొందుతారని నమ్ముతారు. దీనితో పాటు అన్ని రకాల భయాలు, సమస్యలు, బాధలు కూడా దూరమవుతాయి.

పూజకు శుభ ముహూర్తం

ఇవి కూడా చదవండి

వేద క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలోని కృష్ణ పక్షంలోని త్రయోదశి తిథి ఆగస్టు 31, శనివారం తెల్లవారుజామున 2:25 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు సెప్టెంబర్ 1 తెల్లవారుజామున 3:40 గంటలకు ముగుస్తుంది.

ప్రదోష వ్రతం ఎప్పుడు ఆచరిస్తారు? తేదీ, శుభ సమయం ఏమిటంటే

ప్రదోష వ్రతంలో ప్రదోష కాలంలో శివుడిని పూజిస్తారు. అందుచేత శని ప్రదోష వ్రతాన్ని ఆగస్టు 31వ తేదీ శనివారం జరుపుకుంటారు. ఈ రోజున సాయంత్రం 6:43 నుండి రాత్రి 8:59 వరకు పూజా సమయం. ఈ సమయంలో భక్తులు శివుడిని పూజించవచ్చు.

శుభ యోగం ఏర్పడుతోంది

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ శని ప్రదోష వ్రతం రోజున కూడా కొన్ని శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ రోజున వరియాన్ యోగా ఏర్పడుతోంది. ఇది సాయంత్రం 5.39 వరకు ఉంటుంది. ఈ రోజు రెండు నక్షత్రాలు అంటే పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు కూడా రానున్నాయి. ఈ యోగాలలో శివుడిని ఆరాధించడం వల్ల ప్రతి పనిలో విజయం లభిస్తుంది.

శని ప్రదోష వ్రతం 2024

శని ప్రదోష వ్రత పూజ విధి

శని ప్రదోష వ్రతం రోజున తెల్లవారుజామున నిద్రలేచి, స్నానాలు చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. తర్వాత ప్రార్థనా స్థలం లేదా పూజా గదిని శుద్ధి చేయడానికి గంగాజలాన్ని చల్లండి. ఇప్పుడు శివపార్వతుల ముందు నెయ్యి దీపం, ధూపం వెలిగించండి. శివునికి బిల్వ పత్రం, పండ్లు, అక్షతలు, తెల్ల చందనం సమర్పించండి. పార్వతిదేవికి కుంకుమ, అక్షతం, పండ్లు, పువ్వులు సమర్పించండి. ఇప్పుడు ప్రదోష వ్రతం చేయనని దేవుడి ముందు ప్రతిజ్ఞ చేసి.. దీని తర్వాత పూజ చేయండి. శివ చాలీసా పఠించండి, ప్రదోష వ్రత కథ వినండి. మంత్రాలను పఠించండి.

హారతితో పూజను ముగించండి. దీని తరువాత రావి చెట్టుకు నీరు సమర్పించి రావి చెట్టుకు ఐదు రకాల తీపి నైవేద్యాలు సమర్పించండి. సాయంత్రం వేళ రావి చెట్టు కింద ఐదు నూనె దీపాలు వెలిగించి 7 సార్లు ఆ చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి. సాయంత్రం వేళ శివాలయం, శని దేవాలయాలకు వెళ్లి పూజలు చేసి ధూపదీపాలు వెలిగించాలి. సాయంత్రం సమయంలో మాత్రమే రావి చెట్టు కింద ఆవ నూనె దీపం వెలిగించండి. శని దోషం వల్ల ఉద్యోగాలలో ఆటంకాలు తొలగిపోతాయని నమ్ముతారు.

ప్రదోష వ్రత ప్రాముఖ్యత

శని ప్రదోష వ్రతం చాలా ప్రాముఖ్యత కలిగినదిగా పరిగణించబడుతుంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల శివ పార్వతుల అనుగ్రహం లభిస్తుంది. ఈ వ్రతాన్ని పూర్తి విశ్వాసంతో భక్తితో ఆచరించడం ద్వారా, సాధకుడి కోరికలన్నీ నెరవేరుతాయని, సాధకుడికి సంతానం కలిగే అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్ముతారు, అందుకే సంతానం కోరిక కోసం కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రత ప్రభావంతో వ్యక్తి తెలిసి తెలియక చేసిన అన్ని రకాల పాపాలు నశిస్తాయి. జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. ప్రదోష వ్రతాన్ని ఆచరించడం వల్ల మనిషికి వ్యాధులు, సమస్యల నుంచి విముక్తి కలుగుతుందని నమ్ముతారు. ఈ ఉపవాసం ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండ్

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు