
జ్యోతిషశాస్త్రంలో ప్రకారం నవ గ్రహాలు ఒక నిర్దిష్ట సమయం తర్వాత తమ కదలికను మార్చుకుని ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తాయి. ఈ సమయంలో కొన్ని గ్రహాలు వాటి స్థానంలో ఉన్నప్పటికీ ఇతర గ్రహాల కలయికతో ప్రత్యేక సంబంధాలు లేదా సంయోగాలను ఏర్పరుస్తాయి. ఈ ప్రత్యేక యాదృచ్చికాలు మొత్తం రాశులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఈ ప్రత్యేక యాదృచ్చికాలలో ఒకటి ‘షడాష్టక యోగం’, ఇది సెప్టెంబర్ నెలలో త్వరలో ఏర్పడబోతోంది. ప్రస్తుతం న్యాయాధిపతి శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. అదే సమయంలో సెప్టెంబర్ 20, 2025న శనీశ్వరుడు, కుజుడుతో కలిసి షడాష్టక యోగాన్ని ఏర్పరస్తున్నాడు.
జ్యోతిషశాస్త్ర దృక్కోణంలో ఈ యోగం చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. శనీశ్వరుడు న్యాయం, క్రమశిక్షణ, కర్మకు కారకుడు. అయితే కుజుడు ధైర్యం, శౌర్యం, శక్తికి చిహ్నం. అటువంటి పరిస్థితిలో ఈ రెండు గ్రహాల కలయికతో ఏర్పడే యోగం కొన్ని రాశులపై ప్రభావాన్ని చూపిస్తుంది. దీనితో ఈ రాశికి చెందిన వ్యక్తులు కెరీర్ అడ్డంకుల నుంచి విముక్తి పొందుతారు. ఆర్థిక స్థితిలో మార్పు, వ్యాపారంలో కొనసాగుతున్న సంక్షోభం నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ అదృష్ట రాశుల ఏమిటో తెలుసుకుందాం.
మేష రాశి: షడాష్టక యోగం మేష రాశి వారికి చెందిన వ్యాపారంస్తులపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఏదైనా పనిలో డబ్బు పెట్టుబడి పెడితే అది ఇప్పుడు రెట్టింపు అవుతుంది. తాము పనిచేసే రంగంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రత్యేక లాభం పొందే అవకాశం ఉంది. విద్యార్థులు, పిల్లలకు సంబంధించిన చింతల నుంచి ఉపశమనం పొందుతారు. ఈ రాశి వారికి నెట్‌వర్కింగ్ , స్నేహితుల నుంచి మంచి ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు పొందడం ద్వారా అధిక జీతం, పదవిలో ఉన్నతిని పొందుతారు. సంబంధాలు సంతోషాన్ని కలిగిస్తాయి.
మిథున రాశి: ఇది వీరికి ప్రత్యేక సమయం అవుతుంది. వాహనం లేదా ఏదైనా ఖరీదైన వస్తువు కొనుగోలు ప్రయత్నం ఫలిస్తుంది. శనీశ్వరుడి అనుగ్రహంతో పెండింగ్ పనులు కూడా ఊపందుకుంటాయి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. విద్యార్థులకు మంచి సమయం. జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడపడానికి అవకాశం లభిస్తుంది. ఇంటి నుంచి దూరంగా పనిచేసే వ్యక్తులు తమ కుటుంబాన్ని కలిసే అవకాశం పొందుతారు. జీవితాన్ని సంతోషంగా గడుపుతారు.
మీన రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఈ షడాష్టక యోగం శుభప్రదంగా ఉంటుంది. సామాజిక గౌరవం పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఇప్పటికే ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు లేదా మానసిక ఒత్తిళ్లు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ సమయం భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవడానికి.. జీవితాన్ని ప్రేమించడానికి కొత్త దిశానిర్దేశం, శక్తిని ఇస్తుంది. వివాహంలో అడ్డంకులు తొలగిపోతాయి. తండ్రితో కొనసాగుతున్న వివాదం ముగుస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు