Srawan Mas 2022: ఈ సంవత్సరం శ్రావణ మాసం జూలై 29 నుంచి ప్రారంభం కానుంది. ఈ పవిత్ర మాసంలో శ్రావణ మంగళవారాలు, శుక్రవారాలలో పాటు శివుడిని పూజిస్తారు. ఈ మాసంలో శివుని ఆశీస్సులు మాత్రమే కాదు కొన్ని రాశుల వారికి లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా ఉంటాయి. అవి ఏ రాశిలో ఈరోజు తెలుసుకుందాం..
ధనుస్సు – ఈ రాశి వారిపై లక్ష్మీదేవి విశేష అనుగ్రహం ఉంటుంది. ఈ రాశి వారు కెరీర్‌లో విజయం సాధిస్తారు. కొత్త, మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో కూడా పురోగతి ఉంటుంది. డబ్బుకు, తిండి గింజలకు కొరత ఉండదు. కొత్త పనులు ప్రారంభించేందుకు ఈ మాసం చాలా మంచిది.
సింహ రాశి – జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహ రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఈ పవిత్ర మాసంలో ఆరోగ్యంగా ఉంటారు. కష్టపడితే ఫలితం ఉంటుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
తులారాశి – శ్రావణ మాసం తుల రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. జ్యోతిష్యం ప్రకారం ఈ రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సరస్వతీ దేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. మీరు రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే ఈ సమయం మీకు శుభప్రదంగా ఉంటుంది.
మిథునరాశి – మిధున రాశి వారికి కూడా ఈ మాసం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ మాసంలో ఎవరికైనా దానం చేస్తే ఎంతో ఫలితం ఉంటుంది. మీరు ఏదైనా కోర్టు కేసులో చిక్కుకుంటే, దాన్ని పరిష్కరించే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఈ నెలలో డబ్బు సంపాదిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)