నవగ్రహాలకు అధిపతి సూర్యుడి తనయుడు శనీశ్వరుడు. కూడా నవ గ్రహాల్లో ఒకడు. ఇతను జీవుల కర్మలను అనుసరించి మంచి, చెడు ఫలితాలను ఇస్తాడు కనుక కర్మఫలదాత అని అంటారు. నవ గ్రహాల్లో కెల్లా నెమ్మదిగా నడిచే గ్రహం శనీశ్వరుడు. ప్రస్తుతం న్యాయాధిపతి శనీశ్వరుడు తన సొంతరాశి అయిన కుంభంలో సంచరిస్తున్నాడు. ఇదే రాశిలో 2025 వరకు ఉంటాడు. దీంతో కుంభ రాశి, మకర రాశి, మీనరాశులకు చెందిన వ్యక్తులపై ఏలి నాటి శని ప్రభావం ఉండనుంది. ఇదే రాశిలో మరో ఏడాది పాటు శనీశ్వరుడు ఉండనున్నాడు. దీంతో కొన్ని రాశులకు చెందిన వ్యక్తులపై శనీశ్వరుడు అనుగ్రహం ఉండనుంది. దీంతో కొన్ని రాశులకు అదృష్టం, కెరీర్ లో పురోగతి ఉండనుంది. ఆ అదృష్ట రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..
సింహం రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులపై శనీశ్వరుడు శుభ దృష్టి ఉంటుంది. కోరుకున్న అమ్మాయిని భార్యగా పొందే అవకాశం లభిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు ఆర్ధికంగా లాభాలను పొందుతారు. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అందుకుంటారు. ఇప్పటి వరకూ ఎన్నడూ చూడని విధంగా జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. డబ్బులు నాలుగు విధాలా సంపాదిస్తారు. బంగారం కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యపరంగా బాగుంటుంది.
వృషభ రాశి: శనీశ్వరుడు ఈ రాశిలో 2025 వరకూ కుంభరాశిలో ఉండనున్నాడు. దీంతో ఈ వృషభ రాశికి చెందిన వ్యక్తులపై శనీశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. పట్టిందల్లా బంగారమే. కానీ కెరీర్ లో అనుకున్నది సాధిస్తారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. పరపతి పెరుగుతుంది. ఈ సమయంలో వ్యాపారంలో పెట్టుబడును పెట్టడంతో భవిష్యత్ లో ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. డబ్బుకు లోటు ఉండదు.
తుల రాశి: శనీశ్వరుడి అనుగ్రహంతో ఈ రాశికిచెందిన వారు ఏ పని మొదలు పెట్టినా సక్సెస్ అందుకుంటారు. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. సంపాదన నాలుగు రెట్లు పెరుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం సుఖం కలుగుతుంది. ఆస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. డబ్బులకు లోటు ఉండదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు