Money Astrology 2025: శని, రాహువు యుతి.. ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యలు మటాష్..!

ప్రస్తుతం మీన రాశిలో శని, రాహువుల యుతి కారణంగా వృషభం, కర్కాటకం సహా మరికొన్ని రాశుల వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యల పరిష్కారం లభిస్తుంది. వృషభ రాశివారికి ఆదాయంలో పెరుగుదల, కర్కాటక రాశివారికి విదేశీ అవకాశాలు, తుల రాశివారికి వ్యక్తిగత ప్రశాంతత, వృశ్చిక రాశివారికి కుటుంబ సమస్యల పరిష్కారం, మకర రాశివారికి అన్ని రంగాలలో విజయం లభిస్తుంది. ఈ రెండు గ్రహాల యుతి మే 18 వరకు ఉంటుంది.

Money Astrology 2025: శని, రాహువు యుతి.. ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యలు మటాష్..!
Money Astrology 2025

Edited By: Janardhan Veluru

Updated on: Apr 03, 2025 | 7:57 PM

ప్రస్తుతం మీన రాశిలో శని, రాహువులు కలిసి సంచారం చేస్తున్నాయి. రాహువు కూడా దాదాపు శని లక్షణాలనే కలిగి ఉన్న గ్రహం కనుక ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు కొన్ని ఫలితాలు కచ్చితంగా అనుభవానికి వచ్చే అవకాశం ఉంటుంది. రాహువు మీన రాశిలో మే 18 వరకూ మాత్రమే సంచారం చేయడం జరుగుతోంది. ఈ 45 రోజుల కాలంలో కొన్ని రాశులవారికి ఈ రెండు గ్రహాల యుతి అనేక ఆర్థిక, వ్యక్తిగత సమస్యలను పరిష్కారం చేసే అవకాశం ఉంది. వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశులవారు కొన్ని సమస్యలు, వివాదాల విషయంలో ఊరట చెందే అవకాశం ఉంది.

  1. వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో శని, రాహువుల సంచారం జరుగుతున్నందువల్ల ఆదాయం బాగా వృద్ధి చెంది కొన్ని ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. వ్యక్తిగతమైన కొన్ని వివాదాలు, ఒత్తిళ్లు, సమస్యల నుంచి కూడా చాలావరకు విముక్తి పొందే సూచనలున్నాయి. చికిత్సకు లొంగని అనారోగ్యాలకు కూడా తప్పకుండా చికిత్స లభించి ఉపశమనం కలుగుతుంది. దాంపత్య, కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆస్తి వివాదం చక్కబడుతుంది.
  2. కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో శని, రాహువుల సంచారం వల్ల విదేశీయానానికి సంబంధించిన అడ్డంకులు, సమస్యలు తొలగిపోతాయి. సకాలంలో ఆర్థిక సహాయం అందడం వల్ల విదేశాల్లో చదువులు, ఉద్యోగాలకు మార్గం సుగమం అవుతుంది. కొందరు బంధువులతో ఏర్పడిన ఆర్థిక వివాదాలు తొలగిపోతాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఊహించని సానుకూల స్పందన లభించే అవకాశం ఉంది.
  3. తుల: ఈ రాశికి ఆరవ స్థానంలో శని, రాహువుల సంచారం వల్ల తప్పకుండా ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి గట్టెక్కడం జరుగుతుంది. వ్యక్తిగత జీవితం సుఖ సంతోషాలతో, ప్రశాంతంగా సాగిపోతుంది. అనారోగ్య సమస్యల నుంచి బాగానే కోలుకుంటారు. ఉద్యోగంలో అధికారులతో వివాదాలు తొలగిపోయి సాన్నిహిత్యం, సామరస్యం పెరుగుతాయి. దూర ప్రాంత బంధువులతో ఆశించిన స్థాయి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు తప్పకుండా విదేశీ అవకాశాలు లభించే అవకాశం ఉంది.
  4. వృశ్చికం: ఈ రాశికి పంచమ స్థానంలో శని రాహువుల సంచారం వల్ల ఆర్థిక సమస్యలతో పాటు కుటుంబ సమస్యలు కూడా చాలావరకు పరిష్కారమవుతాయి. కొందరు బంధువుల సహాయంతో వ్యక్తిగత సమస్యలు, వివాదాల నుంచి పూర్తిగా విముక్తి చెందుతారు. విదేశీయానానికి సంబంధించిన అడ్డం కులు, ఆటంకాలు తొలగిపోతాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నవారికి అభద్రతా భావం తొలగిపోయి, ఆశించిన స్థాయిలో స్థిరత్వం లభిస్తుంది. ఆస్తి సమస్య ఒకటి పరిష్కారమవుతుంది.
  5. మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో శని రాహువుల సంచారం వల్ల డబుల్ ధమాకా ఫలితాలు కలుగుతాయి. ఈ రెండు గ్రహాలకు తృతీయ స్థానం అత్యంత ఉత్తమ స్థానం. ఏ ప్రయత్నం తలపెట్టినా ఎటువంటి సమస్యలూ, ఆటంకాలూ లేకుండా సఫలం అవుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెంది ఆర్థిక సమస్యలు, కొన్ని వ్యక్తిగత సమస్యలు, అనారోగ్య సంబంధమైన అవస్థలు తగ్గి పోతాయి. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.