హిందూ మత విశ్వాసాల ప్రకారం తొమ్మిది గ్రహాల్లో శనీశ్వరుడి న్యాయాధిపతి.. కర్మ ప్రధాతగా భావిస్తారు. వ్యక్తి కర్మానుసారం శనీశ్వరుడు కష్ట సుఖాలను ఇస్తాడు. దీని కారణంగా ప్రతి ఒక్కరూ శనీశ్వరుడు అంటే భయపడతారు. అందుకనే పాప గ్రహంగా కూడా పరిగణిస్తారు. అయితే ఈ నమ్మకం నిజం కాదు.. ఎందుకంటే శనిదేవుడు మనిషిని అతని మంచి, చెడు పనుల ఆధారంగా శిక్షిస్తాడు. ఎవరైతే మంచి పనులు చేస్తారో.. పురోగతికి అన్ని రకాల మార్గాలు తెరవబడతాయి. చెడు పనులు చేస్తే అతను ఖచ్చితంగా ఏదో ఒక మార్గంలో శిక్షించబడతాడు.
శనివారం శనీశ్వరుడిని ఆరాధిస్తారు. శనివారం నాడు శివుని పూజించాలి. శని దేవుడి చెడు దృష్టిలో చూస్తే.. లేదా మీరు మీ జీవితంలో సమస్యలను ఎదుర్కొంటున్నారని, డబ్బు ఖర్చు పెరిగిందని లేదా డబ్బు రాక తగ్గిందని మీరు భావిస్తే, శనివారం నాడు గుడికి వెళ్లి శని దేవుడిని పూజించండి. ఇలా చేయండి. ఈ సమస్యలు తొలగిపోతాయి. శనివారం నాడు శని దేవుడికి నువ్వులను నైవేద్యంగా సమర్పించడం వలన అన్ని సమస్యల నుండి ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది.
శనివారం హిందూ మతంలో చాలా ప్రత్యేకమైన రోజు. శనివారం పొరపాటున కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. లేకుంటే శనిదేవుడు మీపై కోపగించుకోవచ్చు. శనిదేవుని అసంతృప్తికి గురిచేసే ఎటువంటి తప్పు చేయవద్దు. ఎందుకంటే శని దేవుడిని సంతోషంగా ఉంచడం మనకు చాలా ముఖ్యం. శనిదేవుడు కోపంగా ఉంటే ఎవరైనా అతని జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. నలుపు రంగు శనీశ్వరుడి చిహ్నం కనుక శనివారం నాడు నల్ల రంగు దుస్తులు ధరించాలి. ఏదైనా నల్ల జంతువుకి లేదా కాకికి ఆహారం తినిపించాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు