Runa Yoga: ఆరవ స్థానంలో అనుకూల గ్రహం.. ఆ రాశుల వారికి ‘రుణ’ యోగం!

| Edited By: Janardhan Veluru

Aug 18, 2024 | 1:20 PM

జ్యోతిషశాస్త్రంలో రుణాన్ని కూడా ఒక యోగంగానే అభివర్ణించడం జరిగింది. గృహ, వాహన సౌకర్యాల కోసం, ఇంటి మరమ్మతుల కోసం తీసుకునే రుణాలను రుణ యోగాలుగా పేర్కొనడం జరిగింది. ఈ యోగంలో భాగంగా రుణాలు చేయడంతో పాటు, రుణాలను తీర్చడం కూడా జరుగుతుంది. దీని ప్రకారం ఈ ఏడాది చివరి లోగా మేషం, మిథునం సహా ఆరు రాశుల వారికి ఈ రుణ యోగం పడుతుంది.

Runa Yoga: ఆరవ స్థానంలో అనుకూల గ్రహం.. ఆ రాశుల వారికి ‘రుణ’ యోగం!
Follow us on

జ్యోతిషశాస్త్రంలో రుణాన్ని కూడా ఒక యోగంగానే అభివర్ణించడం జరిగింది. గృహ, వాహన సౌకర్యాల కోసం, ఇంటి మరమ్మతుల కోసం తీసుకునే రుణాలను రుణ యోగాలుగా పేర్కొనడం జరిగింది. ఈ యోగంలో భాగంగా రుణాలు చేయడంతో పాటు, రుణాలను తీర్చడం కూడా జరుగుతుంది. దీని ప్రకారం ఈ ఏడాది చివరి లోగా మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మీన రాశుల వారికి ఈ రుణ యోగం పడుతుంది. ఈ రాశుల వారు లాభదాయక పెట్టుబడుల కోసం రుణాలు పొందడం జరుగుతుంది. వీరికి సునాయాసంగా రుణాలు లభించే అవకాశం కూడా ఉంది. సాధారణంగా ఆరవ స్థానాన్ని బట్టి, ఆరవ స్థానాధిపతిని బట్టి ఈ రుణ యోగం గురించి చెప్పాల్సి ఉంటుంది.

  1. మేషం: ఈ రాశివారికి ఆరవ స్థానాధిపతి అయిన బుధుడు ప్రస్తుతం 4, 5 స్థానాల్లో సంచారం చేస్తు న్నందువల్ల ఇంటి కోసం లేదా వాహనం కోసం రుణం చేయడం జరుగుతుంది. ఈ రుణం ఆర్థిక సమస్యగా మారే అవకాశం లేదు. ఈ రాశివారికి ఆదాయం బాగుండే అవకాశం ఉన్నందువల్ల రుణ సౌకర్యం తేలికగా లభిస్తుంది. వచ్చే రెండు మూడు నెలల కాలంలో గృహ సంబంధమైన రుణం పొందేవారు అతి తక్కువ కాలంలో ఈ దీర్ఘకాలిక రుణం నుంచి బయటపడడం జరుగుతుంది.
  2. మిథునం: ఈ రాశికి ఆరవ స్థానాధిపతి అయిన కుజుడు వ్యయ స్థానంలో ఉన్నందువల్ల సాధారణంగా ఆస్తులు కొనడానికి రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. భూసంబంధమైన ఆస్తుల మీద పెట్టు బడులు పొందే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి ఇది లాభదాయకంగా ఉంటుంది. ఇప్పుడు స్థలాలు, పొలాలు, ఇళ్ల కోసం రుణాలు తీసుకునేవారు మున్ముందు ఆర్థి కంగా బాగా లాభాలు పొందే అవకాశం ఉంటుంది. వీరి మీద రుణ భారం ఎక్కువ కాలం ఉండకపోవచ్చు.
  3. కర్కాటకం: ఈ రాశివారికి ఆరవ స్థానాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నందువల్ల వీరు తక్కువ వడ్డీకి రుణాలు తీసుకుని, ఎక్కువ వడ్డీకి రుణాలకిచ్చి లబ్ధి పొందడం జరుగుతుంది. వీరు రుణాలు తీసుకుని లాభసాటి వ్యవహారాల మీదా, ఒప్పందాల మీదా భారీగా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. గురువు లాభ స్థానంలో ఉన్నంత వరకూ వీరు ఎటువంటి రుణం తీసుకున్నా త్వరగా తీరిపోతుంది. గృహ, వాహన సౌకర్యాల కోసం కూడా రుణాలు తీసుకునే అవకాశం ఉంది.
  4. కన్య: ఈ రాశివారికి ఆరవ స్థానాధిపతి శని రుణ స్థానంలోనే ఉన్నందువల్ల ఏ రుణమైనా ఎక్కువ కాలం కొనసాగే అవకాశం లేదు. మామూలుగా ఇంటి మరమ్మతులు, వైద్య చికిత్సలు, శుభ కార్యాల కోసం రుణం తీసుకోవడం జరుగుతుంది కానీ, ఈ రుణం ఎక్కువ కాలం ఉండే అవకాశం లేదు. ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నందువల్ల రుణ భారం వీలైనంతగా తగ్గిపోయే అవ కాశం ఉంది. ఈ రాశివారు రుణాల విషయంలో ప్రణాళికా బద్ధంగా వ్యవహరించడం జరుగుతుంది.
  5. తుల: ఈ రాశివారికి 6వ స్థానాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలో ఉండడం వల్ల, ఆరవ స్థానంలో రాహువు ఉండడం వల్ల గృహం, ఆస్తుల మీద ఎక్కువగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ రాశివారికి అతి తేలికగా రుణాలు లభిస్తాయి. సరైన ప్రతిఫలాపేక్ష లేనిదే వీరు రుణం చేసే అవకాశం ఉండదు. వీరు ఎటువంటి రుణం తీసుకున్నా అతి తక్కువ కాలంలో దీన్ని తీర్చేయడం జరుగుతుంది. ఇప్పుడు తీసుకునే రుణం వల్ల వీరు తప్పకుండా లబ్ధి పొందుతారు.
  6. మీనం: ఈ రాశికి ఆరవ స్థానంలో ఆరవ స్థానాధిపతే ఉన్నందువల్ల ఇంటికి, వాహనానికి రుణం చేసే అవ కాశం ఉంటుంది. అప్పు చేసి షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెట్టడానికి కూడా అవకాశం ఉంది. రుణం చేయడానికి ఇది వీరికి అనుకూల సమయం. వీరికి సునాయాసంగా రుణం లభి స్తుంది. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం కూడా జరుగుతుంది. ఎక్కడ ఏ విధంగా పెట్టు బడులు పెట్టినప్పటికీ, గ్రహ బలం వల్ల వీరు ఆ రుణాల నుంచి త్వరలో బయటపడడం జరుగుతుంది.