Telugu News Astrology Rising Expenses but Auspicious Spending for 6 Zodiac Signs Until Early June 2026
వారికి ఆదాయానికి లోటే ఉండదు.. అయితే చేతిలో నయా పైసా నిలవదు..!
Money Astrology: జూన్ మొదటి వారం వరకు మేషం, మిథునం, కర్కాటకం, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి ఖర్చులు గణనీయంగా పెరిగే సూచనలు ఉన్నాయి. అయితే ఈ వ్యయాలు ఎక్కువగా శుభకార్యాలకే సంబంధించినవిగా ఉండే అవకాశముంది. పెళ్లి, గృహప్రవేశం, ఆస్తుల కొనుగోలు, వాహన సౌకర్యాల వంటి ముఖ్య శుభ కార్యక్రమాలకు ఖర్చులు చేసే అవకాశం ఉంది. ఆదాయం తగ్గకున్నా చేతిలో నయాపైసా నిలవకపోవచ్చు.
జూన్ మొదటి వారం వరకు కొన్ని రాశుల వారికి ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. అయితే, వీరు వృథా ఖర్చులు, అనవసర ఖర్చులు, ఉచిత సహాయాలు, నష్టదాయక వ్యవహారాలు, దానధర్మాల కంటే శుభ కార్యాల మీద ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. వీరికి చేతిలో నయా పైసా ఉండే అవకాశం లేనప్పటికీ, ఆదాయానికి మాత్రం లోటుండకపోవచ్చు. పెళ్లి, గృహ ప్రవేశం, ఆస్తుల కొనుగోలు, గృహ, వాహన సౌకర్యాల మీద వ్యయం వంటివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. శుభ కార్యాలకు సంబంధించిన గురు గ్రహం స్థితి వల్ల మేషం, మిథునం, కర్కాటకం, వృశ్చికం, మకరం, మీన రాశులకు ఈ రకమైన శుభ వ్యయం కలుగుతోంది.
మేషం: ఈ రాశివారు మరో రెండు నెలల పాటు పెళ్లి సంబంధమైన కార్యకలాపాల మీద ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. సంపన్న లేదా ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదరడం వల్ల ఈ రాశివారు ఎక్కువగా వస్త్రాభరణాలు, పెళ్లి ఏర్పాట్ల మీద అంచనాలకు మించి ఖర్చు చేసే అవకాశం ఉంది. విందులు, వినోదాలు, విలాసాల మీద ఖర్చులు తగ్గించుకుని, గృహ, వాహన సౌకర్యాల మీద ఖర్చుపెట్టే సూచనలున్నాయి. ప్రసూతి ఖర్చులకు కూడా అవకాశం ఉంది.
మిథునం: ఈ రాశివారు పెళ్లి, గృహ ప్రవేశం, ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద ఎక్కువగా ఖర్చుపెట్టే సూచనలున్నాయి. ఆస్తుల కొనుగోలుకు కూడా బాగా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటి ఆదాయ వృద్ధి ప్రయత్నాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. విలాసాల మీదా, వినోదాల మీదా ఖర్చులు తగ్గించుకుని మదుపులు, పొదుపులు, పెట్టుబడుల మీద ఖర్చు చేయడం ఎక్కువవుతుంది. భూ లాభం, ఆస్తి లాభం కలిగే అవకాశం ఉంది. వైద్య ఖర్చులు చాలావరకు తగ్గుతాయి.
కర్కాటకం: పెళ్లి, గృహ ప్రవేశం, శంకు స్థాపన, షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టే ఖర్చుల వల్ల చేతిలో డబ్బులు మిగలని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తికి కూడా కొద్దిగా ఖర్చు పెట్టే అవ కాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడడం వల్ల వైద్య ఖర్చులు బాగా తగ్గడం జరుగుతుంది. విందులు, వినోదాలకు, విలాస జీవితానికి, వ్యసనాలకు స్వస్తి చెప్పే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, స్థలాలు, గృహ, వాహనాల కొనుగోలు వంటి విషయాల మీద ఆసక్తి బాగా వృద్ధి చెందుతుంది.
వృశ్చికం: ఈ రాశివారికి పెళ్లి పనుల మీద ఖర్చులు పెరుగుతాయి. ఆశించిన దాని కంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉన్నప్పటికీ ఇల్లు లేదా స్థలం కొనుగోలు వ్యవహారం మీద వ్యయం అంచనాలను మించుతుంది. ఆస్తి వివాదాన్ని పరిష్కరించడం, ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టడం, వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం వంటి చర్యల వల్ల ఆర్థిక స్థిరత్వానికి పునాది పడుతుంది. లాభదాయక వ్యవహారాలపై ఖర్చు వృద్ధి చెందుతుంది.
మకరం: ఈ రాశివారికి అదనపు ఆదాయం వృద్ధి చెందడానికి బాగా అవకాశం ఉంది కానీ, వ్యక్తిగత, ఆర్థిక సమస్యల పరిష్కారం వల్ల చేతిలో డబ్బు ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ అభివృద్ధి కోసం కూడా బాగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. వృథా ఖర్చులు, అనవసర ఖర్చులు, విలాసాల మీద ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. ఉచిత సహాయాలు, దానధర్మాలకు స్వస్తి చెప్పడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటి అదనపు ఆదాయ ప్రయత్నాల మీద దృష్టిసారిస్తారు.
మీనం: ఈ రాశివారు ఆధ్యాత్మిక కార్యాలపై ఖర్చులతో సహా అన్ని రకాల ఖర్చులను తగ్గించుకుంటారు. కుటుంబ ఖర్చుల మీద కూడా కోత విధిస్తారు. మరో రెండు నెలల పాటు ఆదాయ వృద్ది ప్రయత్నాల మీదే దృష్టి పెడతారు. గృహ, వాహన సౌకర్యాలతో పాటు, ఆస్తుల కొనుగోలు మీద ఎక్కు వగా వ్యయం చేసే అవకాశం ఉంది. ఆరోగ్య సూత్రాలను పాటించడం వల్ల వైద్య ఖర్చులు కూడా బాగా తగ్గుతాయి. కుటుంబ సభ్యుల మీద, పెళ్లి నిర్వహణ మీద బాగా ఖర్చుపెట్టే అవకాశం ఉంది.