AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విపరీత రాజయోగం.. ఇక ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టబోయే రాశులివే..!

Vipareeta Raja Yoga: జ్యోతిష శాస్త్రంలో విపరీత రాజయోగానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. జాతకంలో గానీ, గ్రహ సంచారంలో గానీ 6, 8, 12 స్థానాల అధిపతులు ఒకరి స్థానంలో మరొకరు ఉన్నా లేక ఎవరి స్థానాల్లో వారున్నా విపరీత రాజయోగం పడుతుంది. ఉద్యోగంలో అధికారం చేపట్టడం, వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగడం, అనేక విధాలుగా ఆదాయం పెరగడం, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, మనసులోని కోరికలు తీరడం, జీవనశైలి మారడం వంటివి ఈ రాజయోగం వల్ల కలుగుతాయి. ప్రస్తుతం గోచారం ప్రకారం మేషం, వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకర రాశులకు ఈ యోగం పడుతోంది. మరో నెల రోజుల పాటు వీరి జీవితం దర్జాగా సాగిపోతుంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 03, 2026 | 1:00 PM

Share
మేషం: ఈ రాశికి ఎనిమిదవ స్థానాధిపతి అయిన కుజుడు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నందు వల్ల ఈ రాశివారికి మే 11 వరకు విపరీత రాజయోగం కలిగింది. దీనివల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా దూసుకుపోతాయి. విలాసవంతమైన జీవితం కోసం ఎంతటి ఖర్చుకైనా వెనుకాడరు.

1 / 6
వృషభం: ఈ రాశికి షష్టాధిపతి అయిన శుక్రుడు 12వ స్థానంలో ఉన్నందువల్ల ఏప్రిల్ నెలాఖరు వరకూ ఈ రాశివారికి విపరీత రాజయోగం కలిగింది. జీవన శైలి బాగా మారిపోతుంది. ప్రముఖులతో లాభ దాయక పరిచయాలు ఏర్పడతాయి. సంపదలు కలుగుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం ఖాయం కావడం లేదా ప్రేమలో పడడం జరుగుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ, దాంపత్య జీవితాల్లో సుఖ సంతోషాలు  వృద్ధి చెందుతాయి.

2 / 6
కర్కాటకం: ఈ రాశికి షష్టాధిపతి అయిన గురువు 12వ స్థానంలో సంచారం చేయడం వల్ల జూన్ 2 వరకు విపరీత రాజయోగం ఏర్పడింది. ఈ రాశివారు ఏం చేసినా చెలామణీ అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శీఘ్ర పురోగతి ఉంటుంది. ఊహించని పదోన్నతి కలుగుతుంది. ఒక సంస్థకు అధిపతి అయ్యే అవకాశం ఉంటుంది. పలుకుబడి పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి. వ్యాపా రాలు లాభాల బాటపడతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి ఇబ్బడిముబ్బడిగా లాభాలనిస్తాయి.

3 / 6
సింహం: ఈ రాశికి షష్టాధిపతి అయిన శని అష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల విపరీత రాజయోగం కలిగింది. ఈ ఏడాదంతా కొనసాగే ఈ యోగం వల్ల మీ మాటకు, చేతకు తిరుగుండదు. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. ప్రాధాన్యానికి, ప్రాభవానికి లోటుండదు. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. సామాజికంగా రాజ పూజ్యాలు ఎక్కువగా ఉంటాయి. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని ఆఫర్లు అందుతాయి.

4 / 6
వృశ్చికం: ఈ రాశికి 12వ స్థానాధిపతి అయిన శుక్రుడు షష్ట స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ నెలంతా ఈ రాశివారి జీవితం రాజసంగా, దర్జాగా సాగిపోతుంది. ఉద్యోగంలో ప్రాభవం బాగా పెరుగుతుంది. పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. అనేక మార్గాల్లో ధన లాభాలు కలుగుతాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది. విదేశీయానానికి సదవకాశాలు లభిస్తాయి.

5 / 6
మకరం: ఈ రాశికి 12వ స్థానాధిపతి అయిన గురువు ఆరవ స్థానంలో ఉన్నందువల్ల విపరీత రాజయోగం కలిగింది. జూన్ మొదటి వారం వరకు ఈ రాశివారికి ఉద్యోగంలో ఒకటికి రెండుసార్లు పదోన్నతులు లభించడం, అంచనాలకు మించి వేతనాలు పెరగడం వంటివి జరుగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి.

6 / 6
Follow Us