Ravi Yoga: నేడు సకల శుభాలను ఇచ్చే రవి యోగం.. గ్రహ దోషాల నివారణకు పరిహారాలు, శుభ సమయం.. మీకోసం

రవి యోగం ఈ రోజు మధ్యాహ్నం నుంచి రేపు (ఏప్రిల్ 30) సూర్యోదయం వరకు రవియోగం ఉంటుంది. ఈ యోగం శక్తితో నిండి ఉంటుందని.. ఈ రోజున వ్యక్తి ఏ పని చేసినా అది విజయవంతమయ్యే అవకాశం ఉందని విశ్వాసం. 

Ravi Yoga: నేడు సకల శుభాలను ఇచ్చే రవి యోగం.. గ్రహ దోషాల నివారణకు పరిహారాలు, శుభ సమయం.. మీకోసం
Ravi Yoga 2023

Updated on: Apr 29, 2023 | 8:05 AM

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవ గ్రహాలకు అధిపతి సూర్యభగవానుడు. ప్రత్యక్ష దైవం సూర్యుడికి ప్రతిరోజు ఉదయం అర్ఘ్యం సమర్పిస్తారు. ఇలా చేయడం వలన పుణ్యం లభిస్తుందని ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం.  శనీశ్వరుడు, రవి కలిసినప్పుడు ‘రవి యోగం’ ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్రం లో పేర్కొన్నారు. ఈ రవి యోగం శుభ యోగంగా పరిగణిస్తారు. ఈసారి రవియోగం ఈ రోజు ఏర్పడుతోంది.

రవి యోగం ఈ రోజు మధ్యాహ్నం నుంచి రేపు (ఏప్రిల్ 30) సూర్యోదయం వరకు రవియోగం ఉంటుంది. ఈ యోగం శక్తితో నిండి ఉంటుందని.. ఈ రోజున వ్యక్తి ఏ పని చేసినా అది విజయవంతమయ్యే అవకాశం ఉందని విశ్వాసం.

ఈ నేపథ్యంలో ఈ రోజున శని-సూర్య దోషం వల్ల ఇబ్బంది పడుతున్నవారు ఈ ప్రత్యేక పరిహారం చేయడం శుభఫలితాలను ఇస్తుంది..  అన్ని కష్టాలు పోతాయి. సూర్యుడు, శని ఆరాధన శుభఫలితాలను ఇస్తుంది.  రవియోగంలో సూర్యభగవానుడి ప్రభావం బలంగా ఉంటుంది. ఈ యోగం సూర్యుని శక్తితో ముడిపడి ఉంటుంది. అందుకనే ఈ రవియోగంలో మీరు ఏ పని చేసినా అది విజయవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ యోగాలో చేస్తున్న పనిలో ఆటంకాలు ఏర్పడవు. ఎటువంటి చెడు జరగదు. ఆటంకాలను తొలగించి శుభ ఫలితాలను ఇచ్చే యోగం ఇది.

ఇవి కూడా చదవండి

రవి యోగం 2023  ముహూర్తం
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం  రవియోగం 2023 ఈరోజు మధ్యాహ్నం 12.47 నుంచి గంటలకు ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 30 ఉదయం 5.05 వరకు కొనసాగుతుంది. ఈరోజు శుభ సమయం ఉదయం 11.12 నుంచి మధ్యాహ్నం 12.04 వరకు ఉంటుంది. ఈ శుభ సమయంలో  ఎవరు ఏపనిని మొదలు పెట్టినా ఆ పనిలో ఎటువంటి ఇబ్బందులు కలగవు.

ఈ రోజున రవి యోగంతో పాటు గండ యోగ, వృద్ధి యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. గండ యోగం అశుభమైనదిగా పరిగణించబడుతుంది. అయితే వృద్ధి యోగం శుభ కార్యాలకు మంచిదని భావిస్తారు. గండ  యోగం ఉదయం నుండి ఉదయం 10:32 వరకు ఉంటుంది.. ఆ తర్వాత వృద్ధి యోగం ప్రారంభమవుతుంది.  రోజంతా ఉంటుంది.

శని-సూర్య దోషం వల్ల ఇబ్బంది కలుగుతుంటే 

శనివారం శుభ మహర్తం లేదా అభిజిత్ మహర్తం ఈ రోజు ఉదయం 11.12 నుండి మధ్యాహ్నం 12.04 వరకు ఉంటుంది.  వాస్తవానికి శనివారం శనీశ్వరుడి పూజకు అంకితం చేయబడింది. సూర్య పూజకు రవి యోగం మంచిదని భావిస్తారు. అటువంటి పరిస్థితిలో శనివారం రవియోగంలో సూర్యుడు, శనిని పూజించవచ్చు. తండ్రీ కొడుకులను పూజించడం ద్వారా శని దోషం, సూర్య దోషాలు రెండింటినీ దూరం చేసుకోవచ్చు.

సూర్య-శని దోష నివారణలు

1. రవియోగంలో సూర్య భగవానుడికి ఎర్రచందనం, బెల్లం, ఎర్రని పువ్వులు సమర్పించండి. ఆ సమయంలో సూర్య మంత్రాన్ని జపించండి. సూర్య బీజ్ మంత్రాన్ని కూడా జపించవచ్చు. ఇలా చేయడం వలన జాతకంలో సూర్య దోషం తొలగిపోతుందని చెప్పబడింది.

2. శనివారం శనీశ్వరుడి ఆలయానికి వెళ్లి నీడను దానం చేయండి. ఇలా చేయడం వలన శని దోషం, ఏలి నాటి శని దోషం దుష్ప్రభావాల నుండి ఉపశమనం ఇస్తుంది.

3. రవియోగంలో నల్ల నువ్వులు, గోధుమలు దానం చేయండి. శని దేవుడికి నల్ల నువ్వులు, సూర్య దేవుడికి గోధుమలు ప్రీతికరం. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న సూర్య దోషాలు, శని దోషాలు తొలగిపోతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).