AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashi Phalalu: వారికి దీర్ఘకాల వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది.. 12 రాశులవారికి శనివారం రాశిఫలాలు..

Rashi Phalalu: తమ భవిష్యత్తు ఎలా ఉండబోతోందని ముందే తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విశ్వసించే విధానం జ్యోతిష్యం. జ్యోతిష్య శాస్త్రం మేరకు 12 రాశుల వారికి శనివారం (29 ఏప్రిల్ 2023).. రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

Rashi Phalalu: వారికి దీర్ఘకాల వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది.. 12 రాశులవారికి శనివారం రాశిఫలాలు..
Zodiac Signs111[1]
Janardhan Veluru
| Edited By: |

Updated on: Apr 29, 2023 | 4:08 AM

Share

Horoscope Today (29 April 2023): తమ భవిష్యత్తు ఎలా ఉండబోతోందని ముందే తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విశ్వసించే విధానం జ్యోతిష్యం. జ్యోతిష్య శాస్త్రం మేరకు 12 రాశుల వారికి శనివారం (29 ఏప్రిల్ 2023).. రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. అతి కష్టం మీద ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. స్నేహితుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయం లభించదు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. అదనపు ఆదాయం, పెళ్లి ప్రయత్నాలు కొద్దిగానే సఫలం అవుతాయి. వృత్తి వ్యాపారాల మీద మరింత శ్రద్ధ అవసరం.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వృత్తి వ్యాపారాలు ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతాయి. ఐటి వంటి వృత్తి నిపుణులకు సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. చాలాకాలంగా బాధ పెడుతున్న వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఆర్థిక, పెళ్లి ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగంలో సానుకూల పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ప్రేమ వ్యవహారాలు పెళ్ళికి దారితీస్తాయి. వైద్య ఖర్చులు బాగా తగ్గుతాయి. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగ పరంగా మంచి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితుల్లో సానుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అనుకోకుండా పరిచయస్తులలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో బాగా లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యం పరవాలేదు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర1): ఆర్థిక వ్యవహారాలలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఖర్చులు తగ్గించుకొని పొదుపు చేసుకుంటే మంచిది. మీ స్తోమతకు మించి ఇతరులకు ఆర్థికంగా సహాయపడతారు. కొందరు స్నేహితుల ద్వారా ఉద్యోగ పరంగా లబ్ధి పొందుతారు. తల్లిదండ్రుల నుంచి లేదా తోబుట్టువల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం అనుకూలిస్తుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): కుటుంబ పరంగా మంచి నిర్ణయాలు తీసుకొని ఆచరణలో పెట్టండి. కుటుంబ సభ్యులలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. తోబుట్టులతో ఆస్తి సంబంధమైన వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. బంధు వర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇస్తాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఆర్థిక పరిస్థితి కొద్దిగా నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. ఆర్థిక సహాయం కోసం స్నేహితులు కొందరు ఒత్తిడి తీసుకువస్తారు. అనవసర పరిచయాలకు, విలాసాలకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): ముఖ్యమైన పనులలో కొన్ని విజయవంతంగా పూర్తి అవుతాయి. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త అందుతుంది. అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. వృత్తి వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఉద్యోగ పరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. ఆహార విహారాల్లో క్రమశిక్షణ పాటించడం మంచిది. వృత్తి వ్యాపారాలలో కొద్దిగా సమస్యలున్నా, ముందుకు దూసుకుపోతారు. పెళ్లి ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడతాయి. బంధువులలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2): దూరప్రాంతం నుంచి ఆశించిన శుభవార్త వింటారు. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో ఊహించని విధంగా స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులు, తోబుట్టువుల ద్వారా ప్రయోజనం పొందుతారు. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. వారసత్వం ద్వారా లబ్ధి పొందే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. స్నేహితులను గానీ, బంధువులను కానీ నమ్మి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. దూర ప్రాంతంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక లావాదేవీలు సఫలం అవుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికార యోగానికి అవకాశం ఉంది. ప్రమోషన్ మీద బదిలీ అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇష్టపడిన వారితో పెళ్లి ఖాయం అవుతుంది. పిల్లలు చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ పురోగతి సాధిస్తారు. ఆరోగ్య పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. వాగ్దానాలు, హామీలకు ఇది సమయం కాదు.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).
మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా