Rahu Gochar 2024: ఇష్టమైన రాశులకు రాహువు కటాక్షం.. ఆ రాశుల వారికి ధన, అధికార యోగాలు..!

| Edited By: TV9 Telugu

Jun 21, 2024 | 11:48 AM

ప్రస్తుతం మీన రాశిలో సంచారం చేస్తున్న రాహువు మరో తొమ్మిది నెలల పాటు అదే రాశిలో కొనసాగడం జరుగుతుంది. మీన రాశి రాహువుకు శత్రు స్థానం. రాహువు రాక్షస గ్రహం. పైగా వక్ర గ్రహం. మీన రాశి వంటి శత్రు క్షేత్రంలో సంచారం చేస్తున్నప్పటికీ రాహువు తనకు ఇష్టమైన కొన్ని రాశులకు తప్పకుండా ధన యోగాలు, అధికార యోగాలు ఇవ్వడం జరుగుతుంది.

Rahu Gochar 2024: ఇష్టమైన రాశులకు రాహువు కటాక్షం.. ఆ రాశుల వారికి ధన, అధికార యోగాలు..!
Rahu Gochar
Follow us on

ప్రస్తుతం మీన రాశిలో సంచారం చేస్తున్న రాహువు మరో తొమ్మిది నెలల పాటు అదే రాశిలో కొనసాగడం జరుగుతుంది. మీన రాశి రాహువుకు శత్రు స్థానం. రాహువు రాక్షస గ్రహం. పైగా వక్ర గ్రహం. మీన రాశి వంటి శత్రు క్షేత్రంలో సంచారం చేస్తున్నప్పటికీ రాహువు తనకు ఇష్టమైన కొన్ని రాశులకు తప్పకుండా ధన యోగాలు, అధికార యోగాలు ఇవ్వడం జరుగుతుంది. రాహువుకు ఇష్టమైన రాశులు వృషభం, సింహం, కన్య, తుల, మకరం, కుంభ రాశులు. మీన రాశి నుంచి నిష్క్రమించే వరకూ రాహువు ఈ రాశులకు ఏదో విధమైన యోగాన్ని కలిగిస్తూనే ఉంటాడు.

  1. వృషభం: ఈ రాశిని రాహువుకు ఉచ్ఛరాశిగా పరిగణిస్తారు. ఈ రాశి నాథుడైన శుక్రుడు రాహు గ్రహానికి గురువులాంటి వాడు. అందువల్ల ఈ రాశివారికి రాహువు ఉన్నత స్థాయి శుభ యోగాలనివ్వడం జరుగుతుంది. రాహువు ఈ రాశివారికి సర్వకాల సర్వావస్థలా రక్షణగా నిలుస్తాడు. ఈ రాశివారికి ఈ ఏడాదంతా ఎక్కువగా శుభాలే జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. పట్టిం దల్లా బంగారం అవుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు అంచనాలకు మించి సఫలం అవుతాయి.
  2. సింహం: ఈ రాశిలో ఉన్నప్పుడు రాహువు సర్వస్వతంత్రంగా వ్యవహరిస్తాడు. ఈ రాశిలో రాహువు రాజ యోగమిస్తాడు. ఉద్యోగంలోనే కాకుండా రాజకీయంగా, ప్రభుత్వపరంగా కూడా ప్రాబల్యం పెరుగు తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయంగా ప్రాధాన్యం పెరుగు తుంది. విదేశాలకు వెళ్లడానికి, అక్కడ ఉద్యోగాలు చేయడానికి అవకాశం లభిస్తుంది. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పడతాయి. సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడం జరుగుతుంది.
  3. కన్య: రాశినాథుడు బుధుడు రాహువుకు మిత్రుడైనందువల్ల ఈ రాశివారికి ధన ధాన్యాలకు లోటు ఉండని పరిస్థితి కలుగుతుంది. శీఘ్రగతిన పదోన్నతులు లభిస్తాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం ఖాయమవు తుంది. ఇతర దేశాల్లో ఉద్యోగం సంపాదించుకోవడానికి, అక్కడే స్థిరపడడానికి అనేక అవకాశాలు లభి స్తాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం కూడా ఉంటుంది.
  4. తుల: ఈ రాశినాథుడైన శుక్రుడి పట్ల రాహువుకు గురు భావం ఉన్నందువల్ల ఈ రాశివారికి రాహువు పూర్తి స్థాయిలో అండగా ఉంటాడు. ఆదాయానికి, గౌరవ మర్యాదలకు, స్థితిగతులకు ఏమాత్రం లోటు లేకుండా చేయడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అంది వస్తాయి. లాటరీలు, జూదాల వంటివి కలిసి వస్తాయి.
  5. మకరం: ఈ రాశికి అధిపతి అయిన శనీశ్వరుడు రాహు గ్రహానికి ప్రాణమిత్రుడిలాంటివాడు. అందువల్ల ఈ రాశివారిని రాహువు అనేక విధాలుగా ఆదుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ రాశివారికి రాహువు తృతీయంలో సంచారం చేస్తున్నందువల్ల ఏ రంగంలో ఉన్నప్పటికీ వృద్ధి, పురోగతి ఉంటాయి. ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో భారీ జీతభత్యాలతో హోదాలు పెరగడానికి అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది.
  6. కుంభం: ఈ రాశినాథుడైన శని రాహువుకు మిత్రుడు అయినందువల్ల రాహువు ఈ రాశివారికి మేలే తప్ప కీడు చేసే అవకాశం ఉండదు. ప్రస్తుతం ధన స్థానంలో రాహువు సంచారం జరుగుతున్నం దువల్ల ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం లభిస్తుంది. విదేశీ సొమ్ము అనుభవించే యోగం కూడా పడుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగు తాయి. మాటకు విలువ పెరుగుతుంది. తీర్థయాత్రలు, విహార యాత్రలు చేసే అవకాశం ఉంది.